
దోపిడీలు.. దారుణాలు
శాంతిభద్రతల అదుపులో పోలీసుల వైఫల్యం
సమ్మక్క-సారలమ్మ జాతరలో అట్టర్ ఫ్లాప్
గణనీయంగా పెరిగిన దొంగతనాలు
జంట హత్యలతో సంచలనం
నకిలీ నక్సల్స్ పేరుతో ముఠాలు
కొత్తగా సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ
పోలీస్ బాస్‌ల బదిలీలు
2014లో క్రైం రేట్ గణనీయంగా పెరిగింది. దోపిడీలు, హత్యలు జిల్లాను వణికించారుు. శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీస్ బాస్‌లు పూర్తిగా విఫలమయ్యూరు. కిడ్నాప్‌లు, దొంగతనాలు, హత్యలు, నకిలీ నక్సలైట్ల బెదిరింపులు, మాజీ నక్సలైట్ల భూపంచాయితీలతో పలుచోట్ల బాధితులు బెంబేలెత్తిపోయారు. నేరాలను నియంత్రించడం, నేరగాళ్లపై నిఘా ఉంచడంలో పోలీసులు ఈ ఏడాది చతికిలబడ్డారనే చెప్పవచ్చు. రఘునాథపల్లిలో దోపిడీ దొంగల మారణకాండ, భూపాలపల్లి, ఆజాంనగర్ బ్యాంకులదోపిడీ, నగరంలో జంట హత్యలు, ప్రముఖుల కిడ్నాప్‌నకు సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ, నకిలీ నక్సల్స్ పేరుతో బెదిరింపుల వంటి అనేక ఘటనలు సంచలనం సృష్టించారుు. రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదం నింపారుు.
గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే జిల్లాలో క్రైం రేట్ 2014లో గణనీయంగా పెరిగింది. శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తి స్థాయిలో విఫలం కావడంతో వరంగల్ నేరగాళ్లకు నిలయంగా మారింది. కిడ్నాప్‌లు, దొంగతనాలు, హత్యలు, నకిలీ నక్సలైట్ల బెదిరింపులు, మాజీ నక్సలైట్ల భూపంచాయితీలతో అనేక మంది బెంబేలెత్తిపోయారు. నేరాలను నియంత్రించడం, నేరగాళ్లపై
నిఘా ఉండడంలో పోలీసులు ఈ ఏడాది చతికిలబడ్డారనే చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక కేసులు ఈ ఏడాది ఈ జిల్లాలోనే జరిగాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రఘునాథపల్లిలో పార్థీ దొంగల భీభత్సం, భూపాలపల్లి, ఆజంనగర్ బ్యాంకులదోపిడీ, నగరంలో జంట హత్యలు, ప్రముఖుల కిడ్నాప్‌కు సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ, నకిలీ నక్సల్స్ పేరుతో బెదిరింపుల వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.
- వరంగల్‌క్రైం
నగరంపై రక్తపు మరకలు..
నగరంలో ఈ ఏడాది రెండు చోట్ల జంట హత్యలు చోటుచేసుకున్నాయి. హన్మకొండ హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లి,కొడుకు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం ఆ ఇంటి ఆడపడుచే తన కుమారుడి సాయంతో తల్లిని, సోదరుడిని హత్య చేసింది. పోలీసులు ఈ కేసును ఛేదించి హత్యకు కారణమైన వారికి కటకటాల్లోకి నెట్టా రు. ఆ తర్వాత గొర్రెకుంట సమీపంలో కొలొం బో కాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. డబ్బుల కోసం తెలిసినవారే ఎవరికీ అనుమానం రాకుండా ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకకుండా వీరిని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే హత్య జరిగి ఆరు నెలలు గడిచినా పోలీసులు ఈ కేసులో ఎలాంటి క్లూ సంపాదించలేకపోయా రు. అలాగే సుబేదారి స్టేషన్ పరిధిలోని విజయపాల్ కాలనీలో మార్చి 7న ఒక మహిళ హత్యకు గురైంది. అత్యంత సన్నిహితులే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. ఈ ఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి.
జిల్లాలో సుపారీ గ్యాంగ్‌ల ఎంట్రీ..
జిల్లాలో ఈ ఏడాది కొత్తగా సుపారీ గ్యాంగ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. డబ్బులు తీసుకుని కిడ్నాప్‌లు, హత్యలు చేసేందుకు వీరు వెనుకాడరు. నగరంలో పేరు మోసిన పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డిని సుపారీ తీసుకున్న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి పోలీసులకు చిక్కారు. మరో ముఠా నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యకు పథకం పన్నింది. పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో వీరిని కటకటాల్లోకి నెట్టారు. జిల్లాలో నేర చరిత్ర ఉన్న మాజీ నక్సలైట్లు, రౌడీషీటర్లు ముఠాలుగా ఏర్పడి సుపారీ తీసుకుంటూ కిడ్నాప్, హత్యలకు పథకం రచిస్తున్నారు. వీరిపై పోలీసు నిఘా ఉన్నా ఇలాంటివి జరుగుతుండడం కలకలం రేపుతోంది.
నకిలీ నక్సలైట్ల పేరుతో...
డబ్బు కోసం బరితెగించిన కొందరు వ్యక్తులు నక్సలైట్లుగా చలామణి అవుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఠాలుగా ఏర్పడిన ఈ నకిలీలు కాంట్రాక్టర్లను, క్వారీ యజమానులను, లిక్కర్ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వసూళ్ల కోసం వచ్చిన ఒక ముఠా ఈ నెల 4న మహబూబాబాద్ సమీపంలో పట్టుబడింది. ఆ తర్వాత ములుగులో కూడా ఇలాంటి ముఠానే పట్టుకున్నారు. వారి వద్ద తపంచాలు, రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌లో ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఇక్కడ ఇలా ముఠాలుగా ఏర్పడి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలు ఇంకా జిల్లాలో ఉన్నాయి.
వణికించిన దోపిడీలు..
అర్బన్, రూరల్ పరిధిలో దొంగతనాలు రికార్డు స్థాయిలో చోటుచేసుకున్నాయి. హన్మకొండ హంటర్‌రోడ్డులో మే 29న నందిహిల్స్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారు. సీబీఐ పేరుతో ఇంట్లోకి వచ్చిన నలుగురు వ్యక్తులు ఇంట్లోవారిని బెదిరించి పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు. అయితే ఇంతవరకు పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించలేకపోయారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రఘునాథపల్లిలో పార్థీ దొంగల ముఠా సృష్టించిన మారణకాండ మరిచిపోలేనిది. దోపిడీకి వచ్చిన ముఠా సభ్యులు ఇంట్లో ముగ్గురిని చంపి మరీ సొత్తును దోచుకెళ్లారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నవంబర్‌లో భూపాలపల్లి, ఆజంనగర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖల్లో జరిగిన దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో పనిచేసే మెస్సేంజర్ సుమారు 34 కేజీల బంగారు ఆభరణాలు, రూ.21 లక్షల నగదుతో పరారయ్యా డు. అయితే పోలీసులు వారంలోపే దొంగను పట్టుకుని సొత్తు రికవరీ చేశారు. అదే విధంగా వరంగల్ నగరంలో, గ్రామీణ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లు నిత్యకృత్యమయ్యాయి. ఒక్కోరోజు రెండు, మూడుచోట్ల స్నాచర్లు పంజా విసురుతున్నారు. చాలా కేసుల్లో పోలీసులు వీరిని పట్టుకోవడంలో విఫలమయ్యారు.