ప్రయాణికుల వసతులు మెరుగుపరచాలి | Facilitation of passengers boost | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల వసతులు మెరుగుపరచాలి

Published Fri, May 8 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Facilitation of passengers boost

దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశం

హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం చేయొద్దని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ జోన్ పరిధిలోని డివిజినల్ ఇంజినీర్లను ఆదేశించారు. రైల్వే బడ్జెట్‌లో సంతృప్తికరంగా కేటాయింపులు జరిగినందున అన్ని పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. గురువారం రైల్ నిలయంలో సీనియర్ డివిజినల్ ఇంజనీర్ల సమన్వయ సదస్సును ఆయన ప్రారంభించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సరుకు లోడింగ్‌లో అదనంగా 10 శాతం లక్ష్యాన్ని రైల్వే బోర్డు పెంచిందని, దీన్ని చేరుకోవాలంటే రైళ్లు, ట్రాక్ జాయింట్స్ వైఫల్యాలు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రణాళికతో రూపొందించిన మాన్‌సూన్-2015 పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement