GM srivastava
-
ప్రయాణికుల వసతులు మెరుగుపరచాలి
దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆదేశం హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించటంలో నిర్లక్ష్యం చేయొద్దని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ జోన్ పరిధిలోని డివిజినల్ ఇంజినీర్లను ఆదేశించారు. రైల్వే బడ్జెట్లో సంతృప్తికరంగా కేటాయింపులు జరిగినందున అన్ని పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. గురువారం రైల్ నిలయంలో సీనియర్ డివిజినల్ ఇంజనీర్ల సమన్వయ సదస్సును ఆయన ప్రారంభించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే సరుకు లోడింగ్‌లో అదనంగా 10 శాతం లక్ష్యాన్ని రైల్వే బోర్డు పెంచిందని, దీన్ని చేరుకోవాలంటే రైళ్లు, ట్రాక్ జాయింట్స్ వైఫల్యాలు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రణాళికతో రూపొందించిన మాన్సూన్-2015 పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. -
దశలవారీగా రైల్వేస్టేషన్ల అభివృద్ధి
దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ జిల్లావ్యాప్తంగా తనిఖీలు వరంగల్‌లో ఎస్కలేటర్ ప్రారంభం జిల్లాలోని రైల్వేస్టేషన్లను దశలవారీగా అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను తనిఖీ చేశారు.. మట్టెవాడ :జిల్లాలోని రైల్వే స్టేషన్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ అన్నారు. జిల్లాలో శుక్రవారం ఆయన పలు రైల్వేస్టేసన్లలో తనిఖీలు నిర్వహించారు.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్‌ను సాయంత్రం సందర్శించిన ఆయన శివనగర్ వైపు ఉన్న కార్‌పార్కింగ్, ప్రయాణికుల షెడ్డును పరిశీలించారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్తోపాటు స్టేషన్ ఆవరణలోని 108 అంబులెన్స్ సేవల షెడ్డు, అంబులెన్స్‌ను ప్రారంభించారు. అదేవిధంగా ప్లాట్ ఫాం-1 వైపు ఉన్న హై క్లాస్ వేయిటింగ్ హాల్‌ను పరిశీలించారు. అంతేకాకుండా స్టేషన్‌లోని జ్యూస్ పాయింట్స్, టాయిలెట్స్ కూడా పరిశీలించారు. వరంగల్‌లో వాషబుల్ అఫ్రాన్ ఏర్పాటు కావాలంటే సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వ్యయమవుతుందని, అయినా ఇక్కడ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కొందరు ప్రయూణికులు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని ఆయన సమాధానమిచ్చారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వరంగల్ హాల్టింగ్ కల్పించాలని కోరగా, స్థానిక ప్రజా ప్రతినిధులతో రైల్వే శాఖ మంత్రి, ఉన్నతాధికారులపై ఒత్తితి తేస్తే సాధ్యమవుతుందని చెప్పారు. అంతకు ముందు స్టేషన్‌లోని ప్లాట్ ఫాం-3లో జీఎం శ్రీవాత్సవకు సౌత్ సెంట్రల్ రైల్వే హమాలీ యూనియన్ ఘన స్వాగతం పలికింది. ఆయన వెంట డీఆర్ఎం ఎస్కే.మిశ్రా, సీనియర్ డీసీఎం రవీందర్ పాడె, సీనియర్ డీఈఈ కోటేశ్వర్రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ప్రజాప్రతినిధులు ఎవరూ రాకపోవడం ప్రయూణికులను విస్మయూనికి గురిచేసింది. -
జీఎం గారు.. ఆలకించరూ..
ఫుట్ఓవర్ బ్రిడ్జి లేక శివనగర్‌వాసుల తిప్పలు కానరాని డిస్‌ప్లేబోర్డులు, టీవీలు నేడు వరంగల్ రైల్వే స్టేషన్‌కు జీఎం రాక ఎంతో ఆదాయం సమకూర్చుతున్నా పలు రైల్వేస్టేషన్లను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ఆవశ్యకత ఎక్కువగా కన్పిస్తోంది. కానీ ఈ దిశగా చర్యలు శూన్యం. ప్లాట్‌ఫాంలు కూడా నిర్మించాల్సి ఉన్నా పట్టించుకున్న నాథుడు లేడు. కొన్నిచోట్ల నిధులు మంజూరైనా పనులు జరగని పరిస్థితి. నేడు జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ సందర్శించనున్నారు. తమ కష్టాలను ఇప్పటికైనా పట్టించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మట్టెవాడ: నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు.. వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే వరంగల్ రైల్వేస్టేషన్లో వసతులు కరువయ్యూరుు. శివనగర్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదు. వరంగల్ బస్టాండుకు వచ్చే వారికి రైల్వేస్టేషన్లో టీటీఈలు తరచూ ఫైన్లు కూడా రాస్తున్నారు. కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాకుంటే రైల్వే ప్లాట్ ఫాం-1 నుంచి 3 వరకు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని శివనగర్, వరంగల్ బస్టేషన్ వరకు పొడిగించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఏ రైలు ఎన్నిగంటలకు వస్తుందో.. ఏరైలు బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియక తికమకపడుతున్నారు. వీటి వివరాలుండే డిస్ప్లే బోర్డులు రెండేళ్లుగా కన్పించడం లేదు.టీవీలూ లేవు, సరిపడా మంది టీటీఈలు వరంగల్ స్టేషన్లో లేరు. రైల్వే స్టేషన్‌కు భద్రత కూడా కరువైంది. స్టేషన్‌కు వచ్చే ప్రయూణికులు ప్రధాన ద్వారం నుంచి వచ్చి టికెట్ తీసుకుని ప్లాట్ ఫాంకు వెళ్లాలి. అలాగే రైలు నుంచి దిగిన ప్రయూణికులు స్టేషన్‌లోని ఎగ్జిట్ గేటు నుంచి బయటకు వెళ్తారు. కానీఇక్కడ మాత్రం స్టేషన్‌కు అటు శివనగర్ వైపు, ఇటు వరంగల్ వైపు ఎన్నోదారులున్నాయి. చింతలపల్లి, డోర్నకల్‌లోనూ.. సంగెం: చింతలపల్లి రైల్వేస్టేషన్‌ను రైల్వే జీఎం శ్రీవాస్తవ్ శుక్రవారం సందర్శించనున్నారు. స్టేషన్‌ను గతంలో మోడల్ రైల్వేస్టేషన్‌గా ప్రకటించారు. ఆ స్థాయికి తగ్గట్లు అభివృద్ధి చేయడం లేదు. స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రయూణికులు కోరుతున్నారు. సంగెం-చింతలపల్లి మధ్య ఉన్న 67 గేట్ వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, స్టేషన్ సమీపంలోని 66వ గేట్‌కు దూరంగా క్యాబిన్ ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గేట్ పక్కనే క్యాబిన్‌ను నిర్మించాలని కోరుతున్నారు. చింతలపల్లి స్టేషన్లో గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్నూ జీఎం శుక్రవారం సందర్శించారు. చిల్డ్రన్స పార్క, కమ్యూనిటీహాల్‌ను ప్రారంభిస్తారు. -
విశాఖ జోన్‌తో కడప వాసులకు తిప్పలు
కడపకు రైల్వే పచ్చజెండా ఊపాలి.. సాక్షి, విజయవాడ బ్యూరో : విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే గుంతకల్లు డివిజన్ పరిధిలోని కడప వాసులు జోనల్ కార్యాలయానికి వెళ్లాలంటే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. గుంతకల్లు డివిజన్‌ను యథాతథంగా సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వేలోనే కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవను కోరారు. గుంటూరు, విజయవాడ కేంద్రంంగా కొత్త జోన్ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అన్నారు. కడప జిల్లాలో రైల్వే సేవలను మెరుగుపరిచేలా అవినాష్‌రెడ్డి పలు ప్రతిపాదనలు అందజేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఎంపీల సమావేశంలో అవినాష్‌రెడ్డి ఈ ప్రతిపాదనలు చేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ పునరుద్దరించాలి. తిరుపతి నుంచి షిర్డీకి ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్, బనగానపల్లి నుంచి వేలూరు వరకు పాసింజర్ రైలు, బనగానపల్లి నుంచి అరక్కోణం వరకు పాసింజర్ రైలు వేయాలని కోరారు. తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకు పొడిగించాలి. విజయవాడ మీదుగా తిరుపతి వచ్చే మచిలీపట్నం, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను కడప వరకు పొడిగించాలి. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, బాలాజీ ఎక్స్‌ప్రెస్‌లను ప్రతిరోజు నడపాలి. యర్రగుంట్ల-నంద్యాల, కడప-బెంగళూరు రైల్వే మార్గాలను త్వరగా పూర్తి చేయాలి. కడపలో అన్ని రైళ్ళకు ఐదు నిముషాలు హాల్ట్ ఇవ్వాలి. కడపలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. కడప స్టేషన్లో ఎస్కలేటర్ నిర్మించాలి. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించే రైల్వే స్టేషన్లను రోడ్డు మార్గానికి ఆనుకుని నిర్మించాలి.. కొండాపురం, ముద్దనూరు, కమలాపురం రైల్వేస్టేషన్లలో డబుల్‌డెక్కర్ రైల్‌కు హాల్ట్ ఇవ్వాలి. కాచిగూడ-చెన్నై, లోకమాన్య తిలక్(బాలాజీ)-మదురై, జయంతి ఎక్స్‌ప్రెస్‌లను కమలాపురం, ముద్దనూరు, కొండాపురం రైల్వేస్టేషన్లలో హాల్ట్ ఇవ్వాలి.. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రైల్వేలైనుకు అవసరమైన చోట్ల అండర్‌పాసింగ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలి. మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు డ్రీమ్డ్ ప్రాజెక్టు అయిన యర్రగుంట్ల-నంద్యాల రైల్వేలైను నిర్మాణం 30 ఏళ్లగా సాగుతోంది. దాన్ని త్వరితగతిన పూర్తిచేస్తే రాష్ట్ర రాజధాని విజయవాడకు చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. 1987లో చేపట్టిన ఈ ప్రాజెక్టు 93కిలోమీటర్లు పూరైంది. మరో 30కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది.. జిల్లా కేంద్రమైన కడప నుంచి నంద్యాల మీదుగా గుంటూరు, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు యర్రగుంట్ల-నంద్యాల లైను కీలకంగా అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషితో సాధించిన కడప-బెంగళూరు రైలు మార్గం నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలి. ఏపీలో 257కిలోమీటర్లు, కర్నాటకలో 22కిలోమీటర్లు మేర రైల్వేలైను నిర్మించేలా మంజూరు చేశారు. ఈ కీలక ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు కేటాయించాల్సి ఉంది. వైఎస్ హయాంలో నిధులు విడుదల చేయడంతో 25కిలోమీటర్ల వరకు ట్రాక్ ఏర్పాటు పూర్తి అయింది. తరువాత వచ్చిన పాలకులు నిధులు ఇవ్వకపోవడంతో రైల్వేలైనుకు అవసరమైన భూ సేకరణ కూడా నిలిచిపోయింది.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. -
రాజమార్గం అవశ్యం
సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు సిటీ / సంగడిగుంట : నూతన రాజధానిలో రైల్వే సేవలను విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవను పలువురు ఎంపీలు కోరారు. రైల్వే సేవల విస్తరణ కోసం ముందుగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. రైల్వే బడ్జెట్ రూపకల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించేం దుకు మంగళవారం ఎంపీలతో రైల్వే జీఎం విజయవాడలో సమావేశం నిర్వహించారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, విజయవాడ, బందరు, ఏలూరు, రాజమండ్రి, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, మాల్యాద్రి, కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు రాజధాని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రాజెక్టులను కేటాయించాలని జీఎంను కోరారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో విస్తరించే రాజధాని ప్రాంతానికి రైల్వే సేవలను చేరువచేసేలా ఈసారి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎవరేమన్నారంటే... రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఏర్పడిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే రైల్వే ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కేటాయించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఎంపీలంతా ఏకతాటిపైకి వచ్చి రాజధాని ప్రాంతానికి రైల్వే ప్రాజెక్టులు సాధిస్తారని తెలిపారు. కొత్త రాజధాని నుంచి దేశం నలుమూలలకు వెళ్లేలా రైల్వే జంక్షన్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు నుంచి కొత్త రైళ్లను కూడా ఏర్పాటు చేయాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబ శివరావు కోరారు. నల్లపాడు, న్యూ గుంటూరు, రేపల్లె, మచిలీపట్నంలో కొత్త పిట్లైన్లు ఏర్పాటు చేసి రైళ్లు నడిచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. డెల్టా ప్యాసింజర్ సమయాన్ని గతంలో మాదిరే ఉంచాలన్నారు. డబుల్ డెక్కర్‌ను సూపర్‌ఫాస్ట్‌గా కాకుండా సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా నడిపి సీతాఫల్మండి - నడికుడి - సత్తెనపల్లిలో కూడా ఆగేలా చూడాలన్నారు. రద్దు చేసిన నాగార్జున ఎక్స్‌ప్రెస్ రైలును తిరిగి పునరుద్ధరించాలన్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు సత్తెనపల్లిలో హాల్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్లోని అన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని రాయపాటి ప్రతిపాదించారు. ఇక గుంటూరు రైల్వే స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బాపట్ల ఎంపీ మాల్యాద్రి మట్లాడుతూ తెనాలి పశ్చిమ వైపున రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తెనాలి - రేపల్లె మధ్య నడుస్తున్న ప్యాసింజరును గుంటూరు వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. వేమూరుతోపాటు భట్టిప్రోలులో అదనపు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి తగినట్టుగా విజయవాడ రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని కోరారు. విజయవాడ నుంచి ముంబయి, కొచ్చి, త్రివేండ్రం, సూరత్, గౌహౌతి, కోయంబత్తురుకు రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. బందరు పోర్టును దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం కేంద్రంగా రైల్వే కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని ఎంపీ కొనకళ్ల నారాయణరావు కోరారు. బందరు నుంచి కోటిపల్లి, రేపల్లె రైల్వేలైన్లను విస్తరిస్తే భవిష్యత్తులో కోస్తా రైలుమార్గం కీలకంగా మారుతుందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాజధాని ప్రాంతానికి చేరుకునేలా రైళ్లను నడపాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కోరారు. నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ ఏర్పాటుకు ఖర్చు తక్కువ అవుతుందని, రైల్వే శాఖకు ఎక్కువ ఆదాయం తెచ్చే కీలక లైన్‌గా మారుతుందని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. కొవ్వూరు నుంచి భద్రాచలం వరకు రైల్వేలైన్ విస్తరణ పూర్తిచేయాలని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కోరారు. రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ కోసం కొత్త రైళ్లు వేయాలని కోరారు. మచిలీపట్నం నుంచి తిరుపతి రైలును కడప వరకు పొడిగించాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కోరారు. ఈసారి ఏపీ ఎంపీలు చేసిన ప్రతిపాదనల్లో 75 శాతం వరకు సాధించుకునే అవకాశం ఉందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. గతం నుంచి ఎన్ని పర్యాయాలు ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చినా రైల్వే బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉందని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప పెదవి విరిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తమ నియోజకవర్గాల పరిధిలో రైల్వే బడ్జెట్లో తగిన న్యాయం చేయాలంటూ రైల్వే జీఎం శ్రీవాస్తవకు పలు ప్రతిపాదనలు అందించారు. -
కాపలాలేని రైల్వే క్రాసింగుల తనిఖీ
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బోర్డులు, స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కాపలాలేని రైల్వేలెవల్ క్రాసింగుల వద్ద వెంటనే గేట్లను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. పక్షంరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో రైల్వే నిర్లక్ష్యంపై విమర్శల జడివాన కురుస్తోంది. అక్కడ గేటు ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదని, గేటు ఏర్పాటులో జాప్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సోమవారం ఆరు డివిజన్ల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి స్పెషల్‌డ్రైవ్ పై సూచనలు చేశారు. లెవల్‌క్రాసింగ్‌ల వద్ద ఆర్పీఎఫ్ నిఘా గేట్లు ఉన్న చోట అవి పడ్డ తర్వాత దానికింద నుంచి ద్విచక్రవాహనాలు దూరి వెళ్లడాన్ని జీఎం తీవ్రంగా పరిగణించారు. దాన్ని నివారించేందుకు జంటనగరాల్లోని కొన్ని కీలకగేట్ల వ ద్ద ప్రత్యేకంగా ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. రైలువచ్చే సమయంలో కొన్ని నిమిషాల సేపు మాత్రమే గేటు మూస్తారని, ఆ కొద్ది సమయంలో ఓపికతో ఉండాలని, ఈలోపే గేటు కిందనుంచి దూరి ప్రమాదాలకు గురికావడం సరికాదంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు. ఇది వారంపాటు సాగుతుందని సీపీఆర్ఓ సాంబశివరావు తెలిపారు. ఆ తర్వాత సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి, రూ.వేయి జరిమానా, ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్‌వేలు ఏర్పాటు చే స్తాం... గేట్లను ఏర్పాటు చేయటమే కాకుండా సబ్‌వేలు, ఆర్యూబీల నిర్మాణం, పక్క మార్గాలకు మళ్లించి ఆ దారులను మూసివేయడం లాంటి ప్రత్యామ్నాయాలను అనుసరిస్తున్నట్టు సీపీఆర్ఓ వివరించా రు. నెలకు 20 వేల వాహనాలు ప్రయాణించే మా ర్గాల్లోనే గేట్లు ఏర్పాటు చేయాలనడం సరికాదని, రైళ్లు, రోడ్డు వాహనాల సంఖ్యను సంయుక్తంగా పరిగణిస్తూ (టీవీయూ) రోజుకు 3 వేల టీవీయూలుండే మార్గాలను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు.