నిధుల వినియోగంలో విఫలం
నీలగిరి :ఇందిర జలప్రభ, మెగావాటర్ షెడ్ నిధులు వినియోగించుకోవడంలో ప్రభుత్వ శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11. 30 గంటలకు 2 వ గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం, మధ్యాహ్నం 3 గంటలకు 4వ విద్య ,వైద్య స్థాయీ సంఘం కమిటీ సమావేశాలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల అమలుతీరును ఆయన స మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వాటర్ షెడ్ నిధులు కోట్ల రూపాయ లు మూలుగుతున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో పాటు నిరుపేద ఎస్సీ, ఎస్టీ భూమల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఇందిరజలప్రభ పథకం లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. ఇందిరజలప్రభ అమలు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ విద్యుత్ శాఖ పై ఒత్తిడి పెంచి కనెక్షన్లు ఇప్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. పలు దఫాలుగా విద్యు త్ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించామని..వారి పనితీరులో మార్పురానట్లయితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మెగావాటర్ షెడ్ నిధులతో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, గ్రామీణాభివృద్ధి శా ఖ, పట్టు పరిశ్రమ, మత్స్య శాఖలకు రూ.21 కోట్లు కేటాయించామని పీడీ తెలిపారు. దీంట్లో ఆయా శాఖలు కేవలం కోటి రూపాయలు మాత్రమే వినియోగించాయని చెప్పా రు.
దీని పై చైర్మన్ జోక్యం చేసుకుని సంబంధిత శాఖల అధికారులను ప్రశ్నించారు. నిధు ల వినియోగానికి సంబంధించి అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిధుల విడుదలో జాప్యం జరుగుతోందని సభ్యులు ఫిర్యాదు చేశారు. దీని పై డ్వామా పీడీ మాట్లాడుతూ...వివిధ కారణాల దృష్ట్యా మూడు మాసాల పాటు నిధు లు నిలిచిపోయాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అయితే ఇంది రమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన మరుగుదొడ్లకు, పూర్తయిన పనులకు మాత్రం డ్వామా నుంచి చెల్లింపులు చేయడం వీలుకాదని సభ్యు లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జిల్లాలో ఈ ఏడాది లక్ష మరుగుదొడ్లు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీనిపై జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు గ్రామాలను దత్తత తీసుకుని మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు సహరించాలన్నారు.
పాఠశాలల సమస్యలుపరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణపనులు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. బీఆర్‌జీఎఫ్‌ను వంటగదులకు కేటాయించినందున త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల జీతాల విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని డీడీకి సూచించారు. ఈ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళతామని చైర్మన్ హామీ ఇచ్చారు. చౌటుప్పుల్ పరిసర ప్రాంతాల్లో తాగునీరు కలుషితవుతోందని సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వాతావరణ కాలుష్య నియంత్రణ అధికారులను చైర్మన్ ఆదేశించారు. దీంతో పాటు వైద్య, ఎక్సైజ్ శా ఖల పై కూడా చైర్మన్ సమీక్షించారు. అధికారులు పరస్పర సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని చైర్మన్ సూచించారు. ఈ సమావేశానికి అధికారులు హాజరయ్యారు.