
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. తెలంగాణలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సైక్లింగ్ పోలింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై ఎన్నిక కమిషన్ విచారణకు ఆదేశించింది. స్పిరిట్‌తో సిరాచుక్కను చెరిపేందుకు ప్రత్యేక వ్యక్తులను కొన్ని పార్టీలు నియమించి, మహిళలతో మళ్లీ మళ్లీ ఓట్లు వేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైక్లింగ్ ఓటింగ్ జోరుగా సాగింది. ఒక్కో వ్యక్తితో వందల సంఖ్యలో ఓట్లు వేయించారు.
Comments
Please login to add a commentAdd a comment