అప్పుల బాధతోమరో అన్నదాత ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మల్యాల మండలంలోని మానాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మానాలకు చెందిన రైతు జంగిపెల్లి లక్ష్మణ్ (50) అప్పులు చేసి పంటలు వేశాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మిగిలాయి. దీంతో అప్పులు ఎలా తీర్చాలో అనే దిగులుతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.