
సాక్షి, కరీంనగర్ : సాగునీటి కోసం ఓ రైతు వినూత్న నిరసన చేపట్టాడు. రామడుగు మండలం దత్తోజిపేట గ్రామానికి చెందని రైతు లక్ష్మారెడ్డి లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌజ్ వద్ద బాహుబలి మోటర్లను ఎత్తిపోసే గ్రావిటీ కాలువలో బైఠాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ సమీపంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తమ గ్రామాలకు సాగునీరు అందడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారుల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చే వరకు కాలువలోనే కూర్చొని ఉంటానని హెచ్చరించారు. ల స్థానిక రైతులు, గ్రామ ప్రజలు లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment