మార్కెట్‌యార్డులో యువరైతు ఆత్మహత్యాయత్నం | Farmer Suicide Attempt At Kondamallepally Market Yard In Nalgonda | Sakshi
Sakshi News home page

మార్కెట్‌యార్డులో యువరైతు ఆత్మహత్యాయత్నం

Published Thu, May 16 2019 8:30 PM | Last Updated on Thu, May 16 2019 8:34 PM

Farmer Suicide Attempt At Kondamallepally Market Yard In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మార్కెట్‌ యార్డులో గురువారం జరిగింది. హకుల్‌ అనే రైతు పదిహేను రోజుల క్రితం వరిధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చాడు. కానీ, తేమ ఉందని చెప్పిన అధికారులు అతని ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారీలు తెచ్చిన ధాన్యాన్ని మాత్రం ఏ అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయడం గమనించిన హకుల్‌ వారితో గొడవకు దిగాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో అని అధికారులు సమాధానమివ్వడంతో మనస్తాపం చెందిన ఆ రైతన్న మార్కెట్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న వారు స్పందించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement