కరెంటు కోసం రైతన్న ఆందోళన
దోమకొండ, లింగంపేట, రెంజల్, వర్ని : వ్యవసాయ బావులవద్ద నిరంత రంగా ఏడు గం టల పాటు కరెంట్ ఇవ్వాలంటూ దోమకొండ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద రైతులు రాస్తారోకో చేశారు. దోమకొండతో పాటు గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఏఈ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు.
వర్షాలు కురవక పంటలు వేయలేదని, బోరుబావుల కింద వేసిన పంటలు కరెంటు లేక ఎండిపోతున్నాయని వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న లైన్ ఇన్స్‌పెక్టర్ గోపాల్ అక్కడికి చేరుకోగా రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. రైతులు మైసాగౌడ్, సందెల నర్సింహులు, రాజయ్య, రాజిరెడ్డి, నారాయణ, కిష్టయ్య తదితరులు ఉన్నారు.
రెంజల్‌లో
త్రీఫేజ్ కరెంట్‌ను సక్రమంగా అందించాలని డి మాండ్ చేస్తూ మండలంలోని వీరన్నగుట్టకు చెందిన రైతులు రెంజల్‌లోని సబ్‌స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఏఈ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. రైతులు ఫోన్‌చేసినా ఏఈ లక్ష్మీనారాయ ణ స్పందించలేదు.
అధికారులు స్పందించకుం టే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతులు ఆసాని రమణ, కృష్ణ, గంగారెడ్డి, రవి, లక్ష్మణ్, నగేష్, వెంకట్, యూసూఫ్, రామలక్ష్మణ్ పాల్గొన్నారు.
లింగంపేట మండలంలో
మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన రైతులు గ్రామ శివారులోని సబ్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో ఉన్న లైన్‌మెన్ శంకర్, జేఎల్‌ఎం బాలయ్య, తిరుపతిరెడ్డిలను సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్ గదిలో అరగంట సేపు నిర్బందించారు. సబ్‌స్టేషన్ పరిధిలో కన్నాపూర్,పోతాయిపల్లి,పోల్కంపేట పీడర్లు ఉండగా పోతాయిపల్లి పీడర్‌కు ఎక్కువ సమయం కరెంట్ సరఫరా చేస్తున్నారనీ ఆరోపించారు.
అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదని ఆరోపించారు. కరెంట్ కోతల వల్ల వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం జేశారు. పోల్కంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న నలుగురు ఆపరేటర్లను వెంటనే మార్చాలని లేకుంటే, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. గ్రామ మాజీ సర్పంచ్ బండారు రమేశ్‌రెడ్డి, రైతులు దివిటిబాగయ్య,రమేశ్, రాజశేఖర్‌రెడ్డి, వడ్లఎల్లేషం మాసుల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
వర్ని మండలంలో
మండలంలోని లక్ష్మాపూర్, చందూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు ఆందోళన చేపట్టారు. చందూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్‌నిస్తామని ప్రకటించి మూడు గంటలే ఇస్తున్నారని ఆరోపించారు. లక్ష్మాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మేడిపల్లి, లక్ష్మీసాగర్ తాండా, లకా్ష్మపూర్ రైతులు మూకుమ్మడిగా తరలి వెళ్లారు.
అక్కడ అపరేటర్ ఒక్కరే ఉండటంతో ఏఈ చందూర్‌లో ఉన్న విషయాన్ని తెలుసుకుని సబ్‌స్టేషన్‌కు తాళం వేసి చందూర్‌కు వచ్చారు. ట్రాన్స్‌కో ఏఈ గోపిని నిలదీశారు. వారంరోజులుగా విద్యుత్ సరాఫరాలో తీవ్ర అటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి సబ్‌స్టేషన్ కార్యాలయానికీ తాళం వేసి ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్బధించారు. కరెంటును నిరాటంకంగా సరాఫరా చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో చందూర్, గోవూర్ రైతులు పాల్గొన్నారు.