భూసేకరణకు రైతులు సహకరించాలి | Farmers cooperate with land acquisition -Nituprasad collector | Sakshi
Sakshi News home page

భూసేకరణకు రైతులు సహకరించాలి

Published Sun, Mar 27 2016 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

భూసేకరణకు రైతులు సహకరించాలి

భూసేకరణకు రైతులు సహకరించాలి

ముకరంపుర : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, రైతులతో భూముల ధరల నిర్ణయంపై సమావేశం నిర్వహించారు. 123 జీవో ప్రకారం రైతులకు నష్టం జరగకుండా రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని ధర నిర్ణయిస్తామన్నారు. నిర్ణయించిన ధరకు రైతులు భూములిచ్చి సహకరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దనే అధికారులు చెక్కులు అందజేస్తారన్నారు. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్, వేములవాడ, కరీంనగర్ మండలం ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల గ్రామాల్లోని భూములకు ధర నిర్ణయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం గ్రామంలో పెండింగ్‌లో ఉన్న కట్టడాలకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

వచ్చే జూన్, జూలై వరకు ప్రాజెక్టుల్లో నీరు నిలుస్తుందని, పరిహారం చెల్లిస్తే నిర్వాసితులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటారని తెలిపారు. రుద్రారం పునరావాస కాలనీలో త్రీ ఫేజ్‌లైన్ ఏర్పాటు చేయాలని, పునరావాస కాలనీలలో మిగిలి ఉన్న ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, చింతల్‌ఠాణా నిర్వాసితులకు పునరావాస కాలనీలో ప్లాట్లు కేటాయించి, కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు. స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రిజిస్ట్రార్ రమణారావు, కరీంనగర్, సిరిసిల్ల, ఆర్డీవోలు చంద్రశేఖర్, భిక్షానాయక్, నారాయణరెడ్డి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్, శంకర్, నటరాజ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement