రైతులు అంగీకరిస్తే 123జీఓ ప్రకారం భూసేకరణ చేపడతామని, లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం విషయంలో తమకు నష్టం జరుగకుండా చూడాలని రైతులు కోరగా రైతులు నష్టపోకుండా చూస్తామని జేసీ అన్నారు. ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లక్షి్మనారాయణ, సోషల్ వెల్ఫేర్ అధికారి విజయ్‌కుమార్, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్, తహసీల్దార్లు, రైతులు పాల్గొన్నారు.
రైతులు నష్టపోకుండా భూసేకరణ చేపడతాం
Published Thu, Mar 2 2017 7:37 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
► జేసీ శివకుమార్‌నాయుడు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జాతీయ రహదారి 167లో రైతులు నష్టపోకుండా భూసేకరణ చేపడతామని జేసీ శివకుమార్‌నాయుడు అన్నారు. బుధవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, రైతులతో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర, సీసీకుంట, మరికల్, మాగనూర్, ధన్వాడ మండలాల్లో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 20ఎకరాల భూమిని సేకరించేందుకు రైతులు సహకరించాలన్నారు. సేకరించాల్సిన భూమి బేసిక్ విలువ రూ.60వేలు ఉందని అన్నారు.
రైతులు అంగీకరిస్తే 123జీఓ ప్రకారం భూసేకరణ చేపడతామని, లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం విషయంలో తమకు నష్టం జరుగకుండా చూడాలని రైతులు కోరగా రైతులు నష్టపోకుండా చూస్తామని జేసీ అన్నారు. ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లక్షి్మనారాయణ, సోషల్ వెల్ఫేర్ అధికారి విజయ్‌కుమార్, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్, తహసీల్దార్లు, రైతులు పాల్గొన్నారు.
రైతులు అంగీకరిస్తే 123జీఓ ప్రకారం భూసేకరణ చేపడతామని, లేదంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం విషయంలో తమకు నష్టం జరుగకుండా చూడాలని రైతులు కోరగా రైతులు నష్టపోకుండా చూస్తామని జేసీ అన్నారు. ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లక్షి్మనారాయణ, సోషల్ వెల్ఫేర్ అధికారి విజయ్‌కుమార్, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్, తహసీల్దార్లు, రైతులు పాల్గొన్నారు.
భూ కొనుగోలు పథకంపై సమీక్ష: జిల్లాలో భూ కొనుగోలు పథకంలో భాగంగా భూములు అమ్మేవారిని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని జేసీ శివకుమార్‌నాయుడు తహసీల్దార్లకు సూచించారు. నిబంధనల ప్రకారం భూములకు ధరలను నిర్ణయించాలన్నారు. హన్వాడ, భూత్పూర్ మండలాల నుంచి వచ్చిన భూములు అమ్మే రైతులతో జేసీ మాట్లాడారు.
Advertisement