సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి
Published Thu, Jul 13 2017 5:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
సంగారెడ్డి: తమ భూమి గుండా హైటెన్షన్ విద్యుత్ లైన్లు వేసిన అధికారులు నష్ట పరిహారంలో అన్యాయం చేశారని ఆరోపిస్తూ రైతులు సంగారెడ్డి కలెక‍్టరేట్‌ను ముట్టడించారు. సరైన పరిహారం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వారు పురుగుమందు డబ్బాలను పట్టుకుని హెచ్చరించారు. హత్నూర, సంగారెడ్డి, కంది, పుల్కల్ మండలాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు ఆర్డీవో రఘురాం శర్మను కలిసి తమ సమస్యను వివరించారు. సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వటంతో రైతులు నిరసన విరమించారు.
Advertisement
Advertisement