హన్మకొండ అర్బన్ : రైతులు సుఖ సంతోషాలతో ఉంటేనే సమాజం సుఖ సంతోషాలతో ఉంటుందని.. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. గురువారం వరంగల్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ జిల్లాలో 90శాతంమంది వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తునారని.. వారికి అవసరమైన సహకారాన్ని సేవా దృక్పథంతో అందించాలన్నారు.
ప్రస్తుతం రైతు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంకులు పంటరుణాలు ఇచ్చేందుకు అవసరమైన పత్రాలు రెవెన్యూ అధికారులు సకాలంలో అందజేయాలన్నారు. అర్హత ఉన్న రైతులకు బ్యాంకులు వారి ఇంటి వద్దనే రుణంఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీహెచ్ నియంత్రణాధికారి మాట్లాడుతూ అర్హత ఉన్న రైతులు రుణం పొందిన తర్వాత పంటలు చేతికి వచ్చినా... రుణం తిరిగి చెల్లించడం లేదన్నారు. గ్రామాల వారీగా బకాలయిల వివరాలు ఇస్తే గ్రామ సభల్లో వివరాలు చెప్పి, రుణం తిరిగి చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
రైతులకు సేవా దృక్పథంతో సహకారం అందించాలి
Published Fri, May 29 2015 4:54 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement