
ఖమ్మం రైతులపై పోలీసుల అమానుషం
ఖమ్మం : అన్నదాతల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కేసు విచారణ నిమిత్తం రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు. మార్కెట్ యార్డ్‌పై దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు ఇది. కేసు విచారణ నిమిత్తం గురువారం పదిమంది రైతులను పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు.
అయితే నిబంధనలు పాటించిని పోలీసులపై రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు ఏ నేరం కింద బేడీలు వేశారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ చర్యను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు.