khammam police
-
‘సూది’ మర్డర్ వెనుక అసలు కథ ఇదే.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..
సాక్షి, ఖమ్మం జిల్లా: ముదిగొండ మండలం వల్లభి గ్రామ శివారులో జరిగిన సూదిమందు హత్య కేసులో భార్యనే విలన్‌గా తేల్చారు పోలీసులు. హత్యలో ప్రమేయం ఉన్న ఆరుగురిని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. ఏ1 గోదా మోహన్‌రావు, ఏ2 బండి వెంకన్న, ఏ3 నర్సింశెట్టి వెంకటేష్, ఏ4 షేక్ ఇమాంబీ, ఏ5 బందెల యశ్వంత్, ఏ6 పోరళ్ల సాంబశివరావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్ చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోదా మోహన్‌రావుతో జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడని.. ఈ విషయం జమాల్ సాహెబ్‌కు తెలియడంతో భార్యను మందలించాడన్నారు. దీంతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న జమాల్ బీ.. ప్రియుడు మోహన్‌రావుతో కలిసి పథకం వేసిందని ఏసీపీ చెప్పారు. నామవరంలో ఆర్ఎంపీగా పని చేస్తున్న బండి వెంకన్నకు తమ వివాహేతర సంబంధం గురించి చెప్పి అతని ద్వారా హత్యకు ఉపయోగించే ఇంజెక్షన్లు కావాలని కోరాడని ఏసీపీ తెలిపారు. దీంతో వెంకన్న తన స్నేహితులైన యశ్వంత్, సాంబశివరావు ద్వారా ఇంజెక్షన్లు తెప్పించి వాటిని వెంకటేష్ ద్వారా జమాల్‌కి ఇప్పించాలని పథకం అమలు చేసారని చెప్పారు. జమాల్ తన కూతురు గండ్రాయిలో ఉండటంతో అక్కడికి వెళ్తున్న సమయంలో వల్లబి శివారులో బైక్ లిఫ్ట్ అడిగిన బండి వెంకన్న అతను ఎక్కించుకున్న అనంతరం అతనికి ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే దిగి తన స్నేహితుడు వెంకటేష్ తీసుకొచ్చిన బైక్ ఎక్కి పారిపోయాడని తెలిపారు. ఇంజెక్షన్ ప్రభావంతో జమాల్ సృహ కోల్పోయి స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడని ఏసీపీ చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు బైక్‌లు,ఆరు సెల్ ఫోన్లు, ఇంజెక్షన్, సిరంజీ, స్టరైల్ వాటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి చెప్పారు. -
వివాహేతర సంబంధంతోనే ‘సూది’ మర్డర్!
చింతకాని/ముదిగొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇంజక్షన్ హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురు వ్యక్తులు పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడ్డారని.. లిఫ్ట్ అడగడం, అధిక డోసు మత్తు ఇంజక్షన్ గుచ్చడం, నంబర్ లేని ద్విచక్ర వాహనాన్ని వినియోగించడం అంతా పక్కాగా అమలు చేశారని పోలీసులు తేల్చారు. ఈ ఘటనతో ప్రత్యక్షంగా సంబంధమున్న ముగ్గురు నిందితులను గుర్తించారు. అందులో ఇద్దరిని మంగళవారం రాత్రి చింతకాని మండలం మత్కేపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. పరారీలో ఉన్న మరొకరికోసం గాలింపు కొనసాగుతోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు బుధవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది. 24 గంటల్లోనే తేల్చిన పోలీసులు చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ముదిగొండ మండలం వల్లభి గ్రామ సమీపంలో అధిక డోసు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా ఎస్పీ సీపీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా పుటేజీలు, సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా వల్లభి గ్రామంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. జమాల్ సాహెబ్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై పారిపోయిన విషయం తెలిసి.. సెల్‌ఫోన్ లొకేషన్, కాల్‌డేటా ఆధారంగా చింతకాని మండలం మత్కేపల్లిలో విచారణ చేపట్టారు. మత్కేపల్లిలో గోద మోహన్‌రావు వద్ద ఉన్న ద్విచక్ర వాహనానికి నంబర్ లేదని తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఆందోళన చెందిన మోహన్‌రావు పారిపోయినట్టు తెలిసింది. గాలింపు చేపట్టిన పోలీసులు.. గ్రామంలోనే తలదాచుకున్న మోహన్‌రావును, జమాల్ సాహెబ్‌కు ఇంజక్షన్ గుచ్చిన నర్సింశెట్టి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని విచారించగా ఈ మత్తు ఇంజక్షన్‌ను మోహన్‌రావు బంధువైన ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకన్న సరఫరా చేసినట్టు గుర్తించినట్టు సమాచారం. బండి వెంకన్న పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. కాగా.. హత్య సమయంలో వాడిన నంబర్ ప్లేట్ లేని సదరు వాహనానికి మంగళవారం ఉదయం కొత్త నంబర్ ప్లేట్ పెట్టుకున్నట్టు గుర్తించారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారం.. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన గోద మోహన్‌రావు ఓ రైతు వద్ద గుమస్తాగా పనిచేస్తుండగా, నర్సింశెట్టి వెంకటేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి జమాల్ సాహెబ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. బండి వెంకన్నను కలిసి అధిక డోసు మత్తు ఇంజక్షన్‌ను సిద్ధం చేసుకున్నారు. జమాల్ సాహెబ్ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో ఉంటున్న తన పెద్దకుమార్తె వద్దకు వెళ్లేందుకు బొప్పారం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన గోద మోహన్‌రావు, నర్సింశెట్టి వెంకటేశ్ తమ ప్లాన్ అమలు చేశారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బాణాపురం గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. వెంకటేశ్ రోడ్డుపై వేచి ఉండగా.. మోహన్‌రావు చాటుగా దాక్కున్నాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న జమాల్ సాహెబ్‌ను వెంకటేశ్ లిఫ్ట్ అడిగి వెనుకాల ఎక్కాడు. ప్రయాణిస్తుండగా కొంతసేపటి తర్వాత జమాల్ సాహెబ్‌కు మత్తు ఇంజక్షన్ గుచ్చాడు. జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనాన్ని ఆపగానే వెంకటేశ్ దిగి పరుగెత్తాడు. వెనకాలే వస్తున్న మోహన్‌రావు అతడిని బైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు. మరోవైపు జమాల్ సాహెబ్ షాక్‌లోకి వెళ్లిపోయి చనిపోయాడు. -
ఏపీ టూ మహారాష్ట్ర వయా తెలంగాణ: వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..
ఖమ్మం రూరల్: మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డులో పోలీసులు రూ.25 లక్షల విలువైన 1.7 క్వింటాళ్ల గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామానికి చెందిన కోళ్లు తరలించే వ్యాన్ డ్రైవర్ బొబ్బిలి సాయి, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మరో డ్రైవర్ గుంజి వెంకట్రావు, విశాఖపట్నానికి చెందిన తేలు నాగా వెంకట సత్యనారాయణ, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన విశాల్ అంకుష్ కలిసి గంజాయి తరలిస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి, ఖమ్మం మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కోళ్లు తరలించే రెండు వ్యాన్లలో తీసుకెళ్తున్నారు. కోదాడ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు కోళ్లు తరలించే వ్యాన్లలో ఉన్న వారిపై అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా, వ్యాన్‌పైన మామూలుగానే ఉన్నా కింద ప్రత్యేక అరలు ఏర్పాటుచేసి ప్యాక్ చేసిన గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
మద్యంలో విషం కలిపి...
ఖమ్మం క్రైం: వారంతా అన్నదమ్ముల పిల్లలే. అయినా ఏళ్ల తరబడి కొనసాగుతున్న పాత కక్షలతో సొంత సోదరులనే అంతమొందించారు. సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య మిస్టరీని పోలీసులు చేధించగా, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సోమవారం వివరాలు వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో అన్నాదమ్ముళ్ల కుటుంబాలకు చెందిన బోడా మల్సూర్, బోడా హరిదాస్, బోడా భద్రు కలిసిమెలిసి జీవించేవారు. అయితే, వీరితో ఇదే తండాకు చెందిన బోడా బిచ్చా, ఆయన కుమారులు అర్జున్, చిన్నాకు పడేది కాదు. భూవివాదాలు మొదలు అనేక విషయాల్లో ఘర్షణలు ఉండగా పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. అన్ని విషయాల్లో మల్సూర్, హరిదాస్, భద్రు తమకంటే పైచేయిగా ఉన్నారని ఆక్రోశంతో బిచ్చా కుమారులు రగిలిపోయారు. ముగ్గురిని హతమారిస్తే తమదే పెత్తనమవుతుందని బోడా చిన్నా నిర్ణయించుకుని తండాకే చెందిన «తన బం«ధువు, స్నేహితుడైన ధరావత్ సింగ్‌కు చెప్పి సాయం కోరాడు. ఆయన చంద్రుగొండకు చెందిన నందనూరి సుదర్శన్‌ను చిన్నాకు పరిచయం చేయగా, బంగారం దుకాణంలో పనిచేసే భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీం వద్దకు సుదర్శన్ తీసుకెళ్లాడు. అక్కడ రూ.15 వేలకు ఆభరణాల తయారీలో ఉపయోగించే సెనైడ్ కొనుగోలు చేశారు. కర్మకాండలే వేదికగా హత్యాపథకం ఆరు నెలలుగా హరిదాస్, మల్సూర్, భద్రులను హత్య చేసేందుకు సమయం కోసం చూస్తుండగా, బిచ్చా కుమారుడు అర్జున్ మరణించాడు. దీంతో ఈనెల 14వ తేదీన అర్జున్ కర్మకాండలకు ముగ్గురినీ ఆహ్వానించారు. అయితే మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లిన కారణంగా వారు హాజరుకాలేదు. దీంతో చిన్నా అదేరోజు సాయంత్రం వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హరిదాస్, మల్సూర్, భద్రుతో పాటు వారి కుటుంబసభ్యులు మరో ముగ్గురు వచ్చారు. ఈ మేరకు వారు భోజనానికి సిద్ధమవుతుండగా, చిన్నా ముందుగానే సైనేడ్ కలిపిన మద్యం తీసుకొచ్చి వారికి అందించడంతో ఆయన కుట్ర తెలియని ఆ ముగ్గురూ మద్యం సేవించారు. దీంతో హరిదాస్, మల్సూర్ అక్కడిక్కడే మృతిచెందగా, భద్రు ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం బోడా చిన్నా, ధరావత్ సింగ్, నందనూరి సుదర్శన్, మహ్మద్ సలీంను అరెస్ట్ చేయగా బోడా బిచ్చా పరారీలో ఉన్నాడు. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించిన కూసుమంచి సీఐ సతీశ్, ఎస్సైలు రఘు, నన్దీప్, అశోక్‌తోపాటు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ స్నేహమోహ్రా, ఏసీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
IPL-2021: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఖమ్మం: ఐపీఎల్-2021 మ్యాచ్‌లపై బెట్టింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. మ్యాచ్‌లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఈ బెట్టింగ్‌ను కొత్త తరహాలో చేస్తుండడం గమనార్హం. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురుని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బ్యాచ్ గూగుల్ పే ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. రూ.రెండు లక్షల రూపాయల వరకు బెట్టింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆన్లైన్లో లావాదేవీలు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఏసీపీ వెల్లడించారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: మరో హీరో.. ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ -
అభయారణ్యంలో ఎదురుకాల్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు: మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అభయారణ్యంలో బుధవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్ట్ యాక్షన్ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో మూడు రోజులుగా పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరకగూడెం, ఆళ్లపల్లి సరిహద్దు మల్లేపల్లితోగు వద్ద మావోయిస్టులు తారసపడటంతో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. 10 మంది వరకు మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో వారి సామగ్రి లభించింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను మోహరించి కూంబింగ్ ముమ్మరం చేశారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు హైదరాబాద్ తరలించారు. కాగా ఆ ప్రాంతంలో ఎక్కువమంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో.. మావోయిస్టులపై పోరులో భాగంగా పోలీసు బలగాలు గోదావరి పరీవాహక ప్రాంతం వ్యాప్తంగా కూంబింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాయి. గతంలో ఎండాకాలంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో, తెలంగాణలోని అభయారణ్యంలో పోరు జరిగేది. అయితే ప్రస్తుతం మాత్రం ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ పోరు నడుస్తోంది. ఈ నెల 13న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలోని మాంగీ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ నుంచి నలుగురు మావోయిస్టులు తప్పించుకోగా, వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మంచిర్యాల–ఆదిలాబాద్ డివిజన్ కార్యదర్శి మైలవరపు అడేళ్లు అలియాస్ భాస్కర్ కూడా ఉన్నట్లు సమాచారం. పోడు భూముల సమస్య నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ జిల్లాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల మీదుగా వచ్చి గోదావరి దాటి మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల మీదుగా ఇతర జిల్లాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గోదావరి పరీవాహక అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కాగా కూంబింగ్ కొనసాగుతుందని ఏఎస్పీ (ఆపరేషన్స్) రమణారెడ్డి తెలిపారు. ఉలిక్కిపడ్డ ఏజెన్సీ ఎదురుకాల్పుల సంఘటనతో ఏజెన్సీ ఉలిక్కి పడింది. మూడు రోజులుగా ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు సబ్ డివిజన్లలో స్పెషల్ పార్టీ బలగాలతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న వరంగల్, భద్రాద్రి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మణుగూరు ఏరియాలోని మల్లేపల్లితోగు అటవీ ప్రాంతంలో ఉదయం 9గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ప్రకటించారు. దామోదర్, భద్రూ, శాంత, భాస్కర్లతో కూడిన సుమారు 10 మంది మావోయిస్టుల కోసం అన్వేషిస్తుండగా, మణుగూరు ఏరియా మల్లేపల్లితోగు, రంగాపురం అటవీ ప్రాంతంలో నక్సల్స్ తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పుల నేపథ్యంలో గుండాల మండలంలోని దామరతోగు, చెట్టుపల్లి అటవీ ప్రాంతం, తాడ్వాయి మండలంలోని దుబ్బగూడెం, గంగారం మండలంలోని పాకాల ఏరియా, ఇల్లెందు, గుండాల మండలాల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. 2019 ఆగస్టు 21 తెల్లారుజామున మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గుండాల మండలం దామరతోగుకు చెందిన జాడి వీరస్వామి అలియాస్ రఘు మృతి చెందాడు. ఏడాదిలోపు అదే ప్రాంతంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఏజెన్సీలో ఆందోళన నెలకొంది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతుండగా, ఇదే అదునుగా మావోయిస్టులు ఏజెన్సీలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా వర్షాకాలంలో ఆకు పచ్చబడ్డ తర్వాత ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. వర్షాల కారణంగా ఇప్పటికే అటవీ ప్రాంతం కూడా పచ్చబడింది. గతేడాది కూడా గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో న్యూడెమోక్రసీ దళనేత లింగన్న ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలానికి ఆనుకునే ఉన్న ములుగు జిల్లాలోని మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెంలలో రెండు రోజుల క్రితమే మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. మణుగూరురూరల్: ఎదురుకాల్పుల ఘటనతో మణుగూరు సబ్‌డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ ఎంఏ షుకూర్ నేతృత్వంలో బుగ్గ, ఖమ్మంతోగు ప్రాంతాలకు వెళ్లే అటవీప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో ఆదివాసీగూడేలు వణికిపోతున్నాయి. -
రూ.7కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడమే లక్ష్యం. పేరుకు కోళ్లు, పాల వ్యాపారం చేస్తున్నా.. లోపల మాత్రం నకిలీ నోట్లు చలామణి చేయడం. అసలు నోట్లు రూ.2లక్షలు ఇస్తే.. ఐదు రెట్లు నకిలీవి ఇస్తానని నమ్మించడం. ఆ తర్వాత నకిలీ నోట్లు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడడం. దీనినే నిత్యకృత్యంగా మార్చుకుంది ఆ ముఠా. సత్తుపల్లి పోలీసులు పన్నిన వలకు చిక్కిన ముఠా నుంచి రూ.7కోట్ల విలువైన నకిలీ నోట్లతోపాటు రెండు కార్లు స్వాధీనం చేసుకుని.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ దొంగ నోట్ల ముఠా వివరాలను వెల్లడించారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెంకు చెందిన షేక్ మదార్ పాలు, కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. 20 ఏళ్లుగా నకిలీ నోట్లు చలామణి చేయడం ప్రవృత్తిగా పెట్టుకుని.. అసలు నోట్లు రూ.2లక్షలు ఇస్తే.. 5 రెట్లు నకిలీ నోట్లు ఇస్తానని మధ్యవర్తుల ద్వారా అమాయక ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తీరా వారి వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ నోట్లు ఇవ్వకుండా.. ఎదురు తిరిగిన వారిని కత్తులు, చాకులతో బెదిరించేవాడు. భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మేనల్లుడు నౌషద్, తోట హన్మంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మోడెం సాయమ్మలతో కలిసి మోసాలు చేస్తూ రూ.లక్షలు సంపాదించాడు. వీరిలో మదార్, రమీజ్ మరికొందరిపై ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. రూ.2వేల నోట్లే లక్ష్యంగా.. కేంద్రం త్వరలోనే రూ.2వేల నోట్లు రద్దు చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో భారీగా రూ.2వేల నకిలీ నోట్లను తెచ్చి మదార్ నిల్వ చేశాడు. తన వద్ద రూ.100కోట్లకు పైగా రూ.2వేల నోట్ల కట్టలు ఉన్నాయని, వీటిని వైట్ మనీగా మార్చాలని ప్రచారం చేసేవాడు. ఎవరైనా రూ.80కోట్లు ఇస్తే.. రూ.100కోట్లు ఇస్తానని.. తీసుకున్న వారికి రూ.20కోట్లు మిగులుతాయని ఆశ చూపించేవాడు. ఇలా అమాయకులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు రాబట్టేవాడు. ఇంట్లోనే నోట్ల తయారీ.. నకిలీ కరెన్సీ ముఠా ఇంట్లోనే నకిలీ నోట్లను తయారు చేసి చలామణి చేసేది. వీరికి అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాతో కూడా సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రంలోని ముఠాలతో కూడా వీరికి సంబంధాలు ఉండేవి. ముఠా నాయకుడు మదార్‌పై ఖమ్మంతోపాటు సత్తుపల్లి, దమ్మపేట, కొత్తగూడెం పోలీస్స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో మోసం.. ఈ ముఠా రద్దయిన నోట్లతో అనేక మోసాలకు పాల్పడేది. కేంద్రం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను ఇంకా మార్చుకునే అవకాశం ఉందని అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు కాజేసింది. నకిలీ బంగారు బిస్కెట్ల పేరుతో.. నకిలీ నోట్లే కాకుండా బంగారు బిస్కెట్ల పేరుతో అనేక మందిని ముఠా నాయకుడు మోసం చేశాడు. దుబాయ్, సౌదీ అరేబియాలో తనకు బంధువులు ఉన్నారని, వారి ద్వారా షిప్‌లలో బంగారం బిస్కెట్లు తెప్పిస్తానని నమ్మబలికేవాడు. ఇలా చాలా మందిని తన మాటల ద్వారా బుట్టలో పడేసేవాడు. అక్కడి నుంచి తెప్పించిన బంగారు బిస్కెట్లను తక్కువ ధరకు ఇస్తానని చెప్పి బిస్కెట్లకు బంగారు పూత పూసి.. నకిలీ గోల్డ్ బిస్కెట్లు చూపించి అనేక మంది వద్ద రూ.లక్షలు ఆర్జించాడు. ప్లాస్టిక్ కాగితపు కరెన్సీతో.. ప్లాస్టిక్ కాగితపు కరెన్సీని ఉపయోగించి అనేక మందిని మోసం చేశాడు. తాను ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారా వచ్చే కస్టమర్లకు తన వద్ద ఎక్కువ మొత్తంలో బ్లాక్‌మనీ ఉందని నమ్మించేవాడు. ఒక అట్ట పెట్టెను తయారు చేసి పిల్లలు ఆడుకునే, సినిమాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ కాగితపు కరెన్సీ నోట్లు అంటించి పెద్ద మొత్తంలో ఉన్నాయని చూపించేవాడు. అంతేకాక టెక్నిక్‌గా వీడియో తీసి.. తాను మోసం చేయబోయే వ్యక్తులు మరింత నమ్మేందుకు వీడియో చూపించేవాడు. తన వద్ద ఉన్న నోట్లు చూడాలని ముందుగా టోకెన్ అమౌంట్ రూ.5లక్షలు చెల్లించాలంటూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని వివిధ రకాలుగా మోసాలకు పాల్పడేవాడు. పైన నోట్లు.. లోపల తెల్ల పేపర్లు.. పైన అసలు నోట్లు.. లోపల తెల్ల పేపర్లు పెట్టి కట్టలుగా కట్టి అనేక మందిని మోసం చేశాడు. తన వద్ద ఉన్న ఒరిజినల్ కరెన్సీ నోట్లకు అయోడిన్ పూసి అట్ట పెట్టెల్లో పెట్టి.. పైన ఒరిజినల్ నోటు పెట్టి మధ్యలో తెల్ల పేపర్లు పెట్టి కట్టలుగా తయారు చేసేవాడు. నోట్ల కట్టల నుంచి అయోడిన్‌లో ముంచిన ఒరిజినల్ నోటును తీసి దానిని హైపో ద్రావణంలో ముంచి కస్టమర్లకు చూపించేవాడు. మిగతా నోట్ల కట్టలన్నీ అలాగే ఉంటాయని నమ్మించి వారిని మోసం చేసి లక్షల్లో డబ్బులు సంపాదించాడని సీపీ వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, పూజ, మాధవరావు, సత్తుపల్లి ఏసీపీ వెంకటేశ్, వైరా ఏసీపీ సత్యనారాయణ, సత్తుపల్లి టౌన్ సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
శంకర్‌రెడ్డి దొరికాడు..
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెజవాడ శంకర్‌రెడ్డి పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటంతో పాటు లైంగి కంగా వేధింపులకు పాల్పడగా ఫిబ్రవరి 2న అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ ఘటనతో పరారీలో ఉన్న హెచ్ఎంను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మంరూరల్ ఏసీపీ రామోజీ రమేష్ వివరాలను వెల్లడించారు. హెచ్ఎం శంకర్‌రెడ్డి పాఠశాలలోని పలువురు విద్యార్థినులపై చేతులు వేయటం, వారిని తనపై కూర్చోబెట్టుకోవటం, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 2న బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతన్ని డీఈఓ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న హెచ్ఎం గుజరాత్, హైదరాబాద్ ప్రాంతాల్లో తలదాచుకోగా పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇటీవల రైలులో ఖమ్మం వస్తున్న విషయాన్ని తెలుసుకుని సిబ్బంది అప్రమత్తం కాగా గమనించి పరారయ్యాడు. మంగళవారం ఉదయం కూసుమంచిలో తనకు తెలిసిన వారిని కలిసేందుకు రాగా సమాచారం తెలుసుకుని ఎస్ఐ అశోక్ అతన్ని అరెస్ట్ చేశారు. విద్యార్థినులను వేధించిన ఫిర్యాదుపై తాము అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శంకర్‌రెడ్డిపై పోస్కో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. -
కర్ర కదలొద్దు..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు.. ఉన్న అడవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఊళ్లను వనాలు చేసేందుకు.. అడవి వదిలి జంతువులు బయటకు రాకుండా ఉండేందుకు తీరొక్క ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. అడవుల్లో మహా వృక్షాలను రక్షించేందుకు.. వాటిపై వేటు వేసే అక్రమార్కుల జాడ తెలుసుకునేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. నిఘా కెమెరాలు గతంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కెమెరాల సంఖ్యను పెంచింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. తనిఖీలను ముమ్మరం చేయనున్నది. ఇటువంటి చర్యలతో అక్రమార్కుల పని పట్టేందుకు, అటవీ సంపదను, విస్తీర్ణాన్ని కాపాడుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 64వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో 20వేల హెక్టార్లు ఖమ్మం డివిజన్లో.. 44వేల హెక్టార్లు సత్తుపల్లి డివిజన్లో ఉంది. గతంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టినప్పటికీ ఏదో ఒక మార్గంలో కలప తరలిపోవడంతోపాటు ఇతర అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కువగా రాత్రి వేళల్లోనే అడవుల నుంచి కలప తరలిపోతుండడంతో అధికారులు దీనికి చెక్ పెట్టడంతోపాటు అక్రమంగా పోడు కొట్టకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. ఇటువంటి పకడ్బందీ చర్యలతో జిల్లాలో అడవుల సంరక్షణకు అవకాశం ఏర్పడింది. 12 కెమెరాల ఏర్పాటు.. అటవీ ప్రాంతాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ ఆయా ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానం ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టం చేసేందుకు అటవీ అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని గుబ్బగుర్తి, భీమవరం, చీమలపాడు అటవీ ప్రాంతాల్లో.. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని కనకగిరి అడవులు, లంకపల్లి అడవుల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా ప్రాంతాల్లో 4 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో కూడా అటవీ అధికారులు ఎల్లవేళలా నిఘా ఏర్పాటు చేసి.. గస్తీ తిరగడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. గస్తీ తిరుగుతున్న ప్రాంతంలో కాకుండా.. మరో ప్రాంతంలో అక్రమాలు చోటుచేసుకునే వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నిఘా కెమెరాల సంఖ్యను మరింత పెంచింది. మరో 8 కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అటవీ విస్తీర్ణంలో నిఘా కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు అడవిలోకి ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలు రికార్డు అవుతుండడంతో స్మగ్లర్లు, ఇతరులు అడవిలో అక్రమాలకు పాల్పడేందుకు సాహసించడం లేదు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి నిఘా కెమెరాల్లో రికార్డు అయిన పుటేజీని అటవీ శాఖ సిబ్బంది తీసుకొచ్చి ఆయా డివిజన్ కార్యాలయాల్లో అందజేస్తారు. అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పుటేజీని పంపుతారు. దానిని పరిశీలించిన అధికారులు ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లు రికార్డు అయితే.. వాటిపై చర్యలు తీసుకునేందుకు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తారు. అలాగే పుటేజీని భద్రపరుస్తారు. పెరగనున్న చెక్‌పోస్టులు.. ఇప్పటికే అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిపోకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి, ముత్తగూడెం, తల్లాడ, పాలేరు, ఖమ్మం ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం తనిఖీలు చేస్తుంటారు. వీటితోపాటు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు గల ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయా ప్రాంతాల్లో మరో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అడవులను సంరక్షించేందుకు.. జిల్లాలో అడవులను రక్షించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా నిఘా కెమెరాల సంఖ్యను పెంచాం. దీంతో కలప అక్రమ రవాణాను నివారించే అవకాశం ఉంది. అలాగే మరో రెండు చెక్‌పోస్టులను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని ఏర్పాటు చేయనున్నాం. – బి.సతీష్‌కుమార్, ఇన్చార్జి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, ఖమ్మం -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తామని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఉద్ఘాటించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శనివారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశం ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతూ.. అగ్రగామిగా నిలిచిందన్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లా పురోగతిపై ఆయన మాటల్లోనే.. రైతుల ఆర్థికాభివృద్ధికై.. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల గురించి రైతులకు వివరించి.. వారి ఆర్థికాభివృద్ధి కోసం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఖరీఫ్ లో రూ.1,170కోట్ల పంట రుణాలు అందించాం. రబీ సీజన్లో రూ.541.51కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించాం. రబీ విత్తన ప్రణాళిక కింద జిల్లాలో 4,286 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశాం. ఆత్మ ద్వారా 2018–19లో 72 క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి.. వివిధ రైతు సంక్షేమ కార్య క్రమాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాం. భూరికార్డుల సమీకరణలో భాగంగా జిల్లాలో మొత్తం 9.57 లక్షల ఎకరాల భూముల రికార్డులను సమీకరించాం. 380 రెవెన్యూ గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా చేపట్టాం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా రెండు విడతల్లో 2,71,574 పుస్తకాలను రైతులకు అందించాం. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 2,45,848 ఖాతాలను ఆన్లైన్ చేయడంతోపాటు 1,84,805 మంది రైతులకు రూ.185.48కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. వాటిలో నాబార్డు సౌజన్యంతో రూ.36కోట్లతో 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 12 గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి. ముగింపు దశలో మిషన్ భగీరథ మిషన్ భగీరథ పనులు ముగింపు దశలో ఉన్నాయి. పాలేరు, వైరా సెగ్మెంట్ల ద్వారా రూ.1,308కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టాం. ఇక మిషన్ కాకతీయ మొదటి మూడు దశల్లో రూ.309.52కోట్లతో 1,437 చెరువులను పునరుద్ధరించాం. నాలుగో దశ కింద రూ.29.27కోట్లతో మరో 120 పనులను చేపట్టి.. ఇప్ప టికే 72 పనులను పూర్తి చేశాం.సాగర్ ఆధు నికీకరణకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రూ.572.22కోట్లతో పనులు చేపట్టాం. అలాగే జిల్లాలో రోడ్ల విస్తరణ, నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. రూ.43కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లను రెండు వరుసలుగా విస్తరించాం. రెండు వరుసల రోడ్ల ను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.165కోట్లతో 11 పనులు చేపట్టాం. ఖమ్మం–సూర్యాపేట, ఖమ్మం–కోదాడ, ఖమ్మం–దేవరపల్లి, ఖమ్మం–వరంగల్, ఖమ్మం–విజయవాడ రోడ్లను జాతీయ రహదారులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ను అందిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం 1,12,303 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులను ఉచితంగా పంపిణీ చేశాం. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాకు 14,560 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 9,019 నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం. 5,527 ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. 2,158 గృహాలు పూర్తి చేసుకుని.. 620 ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ద్వారా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. మరింత మెరుగైన విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో ఇప్పటివరకు రూ.1,304కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అంతేకాక 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.21కోట్లతో మరో 14 సబ్స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సబ్సిడీ పథకం కింద ఐదేళ్లలో రూ.255.5కోట్ల సబ్సిడీ అందించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. జిల్లా ప్రధా న ఆస్పత్రిలో 150 పడకలతో ప్రారంభించిన మాతా, శిశు సంరక్షణ కేంద్రం ద్వారా మాతా, శిశు సేవలు అందిస్తున్నాం. 10 పడకలతో ఐసీయూ, 12 పడకలతో డయాలసిస్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షే మానికి జిల్లాలో వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నాం. జిల్లాలోని 39 ఎస్సీ వసతి గృహాల్లో 4,107 మంది, 23 బీసీ వసతి గృహాల్లో 2,546 మంది, ఏడు మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో 1,840 మంది, 11 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 6,980 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాం. పేదింటి ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదనే సంకల్పంతో అమలవుతున్న షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 11,944 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ లబ్ధిదారులకు రూ.83,7,36,000 అందించాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పలు కార్య క్రమాలను అమలు చేస్తున్నాం. ఉపాధిహామీ పథకం కింద 201819 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.96.06కోట్లతో 53.36 లక్షల పని దినాలను కల్పించాం. 3 లక్షల జన్‌ధన్ ఖాతాల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నాం. ప్రధానమంత్రి సురక్షా యోజన పథకం కింద 52,396 కుటుంబాలకు బీమా చేయిం చడంతోపాటు మరణించిన 168 మంది కూలీల కుటుంబాలకు రూ.3.36కోట్లు అందించాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక పద్ధతుల ద్వారా జిల్లాలో 4,04,697 వివిధ కార్డుదారులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. జిల్లాలో పరిశ్రమలను వేగవంతంగా విస్తరించేందుకు ఔత్సాహికులను ప్రోత్సహించడంలో భాగంగా టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నాం. లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ.. గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో 15,099 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.133.32కోట్లతో యూనిట్లను పంపిణీ చేశాం. పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో రూ.3.32కోట్లతో 416 పాడిగేదెలను పంపిణీ చేశాం. హరితహారంలో భాగంగా మూడేళ్లలో 10.02 కోట్ల మొక్కలు నాటాం. 2019లో 395.60 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో మొక్కలను పెంచుతున్నాం. రూ.4కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.13.73కోట్లతో డివైడర్ల నిర్మాణం, రూ.2.50 కోట్లతో పారిశుద్ధ్య పనుల కోసం వాహనాలు కొనుగోలు చేశాం. వయోవృద్ధుల సౌకర్యార్థం నగరంలోని గాంధీపార్కులో రూ.40లక్షలతో డేకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. వీటితోపాటు అనేక సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జేసీ ఆయేషా మస్రత్ ఖానం, ఇన్చార్జి జెడ్పీ సీఈఓ హన్మంతు కొడింబా, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు పోలీస్ కమిషనర్ మురళీధర్ పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
సాక్షి, ఖమ్మంక్రైం : సైబర్ క్రైం–క్రిమినల్స్ ఇతివృత్తంతో ఇటీవల విడుదలైన ‘అభిమన్యుడు’ సినిమాను చూశారా..? సైబర్ నేరాలు జరిగే తీరును ఇది కళ్లకు కట్టినట్లు చూపింది. విద్యావంతులైనా, మేధావులైనా, గొప్పోళ్లయినా.. ఎవరైనా సరే, సైబర్ నేరగాళ్లకు చిక్కి ఎలా మోసపోతారో ఆ సినిమా వివరించింది. ‘‘అది సినిమా..! అలా ఎలా మోసం చేస్తారు? అది సాధ్యమా..?’’ అనుకున్న వాళ్లు కూడా ఉండి ఉంటారు. బయట జరుగుతున్న సైబర్ మోసాలే ఆ సినిమాకు ఇతివృత్తంగా మారాయని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే, ఆ సినిమాలో మాదిరిగానే, రెండేళ్ల నుంచి బ్యాంక్ ఖాతాదారుల నెత్తిన టోపీ పెట్టిన–పెడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లే దొంగలు... ఐదుగురితో కూడిన సైబర్ నేరగాళ ముఠాను అరెస్ట్ చేసినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ (సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఆయన శుక్రవారం సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఉల్లింటి సలీం మాలిక్ అలియాస్ సలీం, నారాయణపల్లి అబ్దుల్, ముద్దనూరు మండలం కొలవలి గ్రామస్తుడు బట్టు రామాంజనేయులు అలియాస్ రాంజీ, మైలవరం మండలానికి చెందిన దండి వేణుగోపాల్ అలియాస్ వేణు, ఇదే మండలంలోని వేపరాళ్ల గ్రామస్తుడు బడిగించాల మనోహర్ కలిసి న్యూఢిల్లీలో రెండేళ్ల క్రితం ‘ఏఏఏ’, ‘న్యూహోమ్’, ‘ఫాస్ట్ అండ్ ఈజీ’ అనే కాల్ సెంటర్లలో టెలీకాలర్స్‌గా పనిచేశారు. అక్కడ వీరి పనేమిటంటే... రోజుకు 100 నుంచి 120 మంది బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్ చేయడం. ‘మేము ఫలానా బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈ ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలి. ఆధార్ కార్డు లింక్ చేయాలి’ అని చెప్పడం. ఖాతాదారుల ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్ సేకరించడం. వాటిని తమ కాల్ సెంటర్ యజమానికి ఇవ్వడం. తమ యజమానులు చేస్తున్నది ఆన్లైన్ మోసమన్న విషయం వీరికి తెలుసు. సదరు సంస్థ నుంచి వీరికి దండిగానే డబ్బు ముట్టడంతో వీరు విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసలయ్యారు. దీంతో డబ్బు సరిపోలేదు. ‘ఎవరి తరఫునో ఎందుకు..? మనమే డైరెక్టుగా జనాలను మోసగించి డబ్బు గడించొచ్చు కదా..’ అనుకున్నారు. ఈ ఐదుగురూ తమ సంస్థల నుంచి బయటపడ్డారు. ముఠాగా ఏర్పడ్డారు. గడించిన అనుభవంతో, రెండేళ్ల క్రితం సైబర్ నేరాలకు దిగారు. ప్రతి మూడు–నాలుగు నెలలోకాసారి సైబర్ నేరాల పద్ధతులు మార్చసాగారు. ఇలా మొదలైంది.. వీరు 2017 ఆగస్టులో నేరాలు మొదలుపెట్టారు. పూర్వం, తమ సంస్థ నుంచి ఎలాగైతే ఫోన్ చేసి వివరాలు సేకరించేవారే, అచ్చం అలాగే చేయసాగారు. ఖాతాదారులకు ఫోన్ చేసి ఏటీఎం, సీవీవీ నంబర్, ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) తెలుసుకునే వారు. వాటి ద్వారా సదరు ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను తమ అకౌంట్లలోకి మళ్లించేవారు. ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేవారు. ఇలా విలాసవంతమైన జీవితం గడపసాగారు. ఆ సంవత్సరం డిసెంబర్ వరకు ఇలాగే చేశారు. జనవరి 2018లో రూటు మార్చారు. తాము సేకరించిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసేవారు. పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీల పేర్లు చెప్పి, వాటి కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించేవాళ్లు. ‘లక్కీ డ్రాలో మీ నంబర్ ఎంపికైంది. 25వేల నుంచి 30వేల రూపాయల విలువైన ఫోన్/వస్తువు మీకు కేవలం మూడువేల నుంచి నాలుగువేల రూపాయలకే వస్తుంది. మీ పూర్తి అడ్రస్ చెబితే పంపిస్తాం. డబ్బును మా అకౌంట్లో వేయాలి’ అని, అకౌంట్ నంబర్ ఇచ్చేవాళ్లు. ఏవేవో పనికిరాని వస్తువులను ప్యాక్ చేసి వీపీపీ/సీఓడీ పద్ధతిలో పార్శిల్ పంపేవారు. సదరు చిరునామాదారులు వాటిని చూసుకుని, వాటిని పంపిన సంస్థకు వెంటనే ఫోన్ చేసేవారు. తమ డబ్బు తిరిగిచ్చేయాలని అడిగేవారు. అప్పుడు ఆ సైబర్ మోసగాళ్లు.. ‘సరే, మీ డబ్బును వాపస్ చేస్తాం. మీ ఏటీఎం కార్డ్, సీవీవీ నంబర్ చెప్పండి. కొద్దిసేపటి తరువాత ఓటీపీ నంబర్ మెసేజ్ వస్తుంది. దానిని చూసి చెప్పగానే మీకు డబ్బు వచ్చేస్తుంది’ అని నమ్మించేవారు. సదరు చిరునామాదారులు చెప్పిన ఓటీపీ నంబర్ ఆధారంగా ఈ మోసగాళ్లు తమ మొబైల్ వాలెట్‌లోకి (చిరునామాదారుడి ఖాతాలోని) డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. ఆ తరువాత బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకునేవారు. 2018 మార్చిలో వీరు మరోసారి రూటు మార్చారు. ఈసారి ఇంకో పద్ధతిలో మోసగించడం మొదలెట్టారు. వివిధ రకాల షాషింగ్ వెబ్సైట్లలో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకునేవారు. దానిని ఏదో ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫేక్ లింక్ పంపి, దానిని హ్యాక్ చేసేవారు. ఆ ఫేస్బుక్ ఖాతాదారు ఐడీ, పాస్వర్డ్ తస్కరించేవారు. అతని/ఆమె పేరుతో దగ్గరి మిత్రులతో చాట్ చేసేవారు. ‘ఏటీఎం కార్డు ఫొటో పెడితే డబ్బులు వస్తాయి’ అని నమ్మించేవారు. ఏటీఎం పిక్ ద్వారా కార్డు, సీవీవీ నెంబర్ తెలుసుకునేవారు. ఆ తరువాత ‘వేరే ఫ్రెండ్‌ను ఇన్వైట్ చేస్తే (ఆహ్వానిస్తే) డబ్బులు వస్తాయి’ అని చెప్పి ఓటీపీ నంబర్ కూడా చాటింగ్‌లోనే మెసేజ్ చేయాలని చెప్పేవారు. అలా బ్యాంక్ ఖాతా నుంచి నగదును ఈ నేరగాళ్లు తమ మనీ వాలెట్‌లోకి, అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసుకునేవారు. ఇలా మే నెల వరకు మోసగించారు. ఇలా చిక్కారు... ఇలా వీరి సైబర్ దందా రెండేళ్లపాటు నిరాటంకంగా సాగింది. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ముగ్గురు ఖాతాదారుల నుంచి డబ్బును ఓటీపీ ద్వారా తస్కరించారు. బాధితులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివే... ఖమ్మం వన్ టౌన్లో రెండు, సత్తుపల్లిలో రెండు, వైరాలో ఒకటి సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. వీటిపై సీపీ తఫ్సీర్ ఇక్బాల్ దృష్టి సారించారు. ఆయన మార్గదర్శకత్వంలో ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్ సీఐ వెంకన్నబాబు, సైబర్ క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రత్యేక పోలీస్ బృందం తీవ్రంగానే కసరత్తు చేసింది. వెతకగా.. వెతకగా... తీగ దొరికింది. దానిని పట్టుకుని లాగితే.. డొంకంతా కదిలింది. సైబర్ నేరగాళ్ల వివరాలు తెలిశాయి. ఈ ముఠాను వైఎస్సార్ జిల్లాలో, ఢిల్లీలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముఠా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బ్యాంక్ ఖాతాదారుల నుంచి దాదాపుగా రూ.4లక్షలకు పైగా కాజేసినట్టు తేలింది. నేరగాళ్ల మనీ వాలెట్ల నుంచి రూ.1,07,000ను బాధితుల అకౌంట్లలోకి తిరిగి జమ చేయించారు. ఈ నేరగాళ్ల నుంచి రూ.1.39లక్షల విలువైన పది సెల్ఫోన్లు, రూ.1.04లక్షల నగదు, 15 సిమ్ కార్డులు స్వాధీనపర్చుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. -
రాంజీ ముఠా దొరికింది..!
ఖమ్మంక్రైం: అక్కడొక కారు ఆగింది. డ్రైవర్ వద్దకు ఎవడో వచ్చాడు. ‘‘ఇక్కడ నోట్లు పడిపోయాయి. మీవేనా సార్..’’ అన్నాడు. ఆ డ్రైవర్ కిందికి దిగాడు. కింద చెల్లాచెదరుగా పడిపోయిన 50 రూపాయల నోట్లను ఏరుకోసాగాడు. అవి తనవి కాకపోవచ్చేమోన్న అనుమానం ఆ డ్రైవర్‌కు ఏమాత్రం కలగలేదు. ఆ నోట్లన్నీ ఏరుకుని చూసేసరికి.. కారులోని సూట్ కేసు మాయమైంది. నోట్లు పడిపోయాయని చెప్పిన మాయగాడు.. మాయమయ్యాడు..! ఖమ్మంలోని భద్రాద్రి బ్యాంక్ వద్ద, వైరా రోడ్డులోని వాసన్ ఐ కేర్ వద్ద సోమవారం ఇవి జరిగాయి. బ్యాంక్ వద్ద మాయమైన సూట్‌కేసులో పాతికలక్షల విలువైన నగలున్నాయి. ఐ కేర్ వద్ద మాయమైన సూట్‌కేసులో ల్యాప్‌టాప్, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఈ రెండుచోట్ల సూట్‌కేసులను మాయం చేసింది.. రాంజీ ముఠా..! ఈ ముఠాలోని నలుగురిని వెంటనే పట్టేశారు.. ఖమ్మం పోలీసులు..!! ఎక్కడిదీ ‘రాంజీ ముఠా’..? కరెన్సీ నోట్లను ఎరగా వేయడం, విలువైనవి (నగలు–నగదు) కాజేయడం.. ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. రద్దీగా ఉండేచోట (బ్యాంకులు, నగల దుకాణాలు, ప్రధాన ప్రదేశాలు) ఈ ముఠా మాటు వేస్తుంది. ఎవరిని దోచుకుంటే గిట్టుబాటవుతుందో అంచనా వేస్తుంది. ఆ తరువాత పనిలోకి దిగుతుంది. క్షణాల్లో ముగిస్తుంది. నిముషాల్లో మాయమవుతుంది. దీని పేరే.. రాంజీ ముఠా. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి వద్ద ‘రాంజీనగర్’ అనే ప్రాంతం ఉంది. అక్కడికి చెందిన కొందరు దోపిడీ ముఠాగా ఏర్పడ్డారు. ఇదిగో.. ఇలా ఈ ముఠా దోపిడీలు సాగిస్తోంది. రాంజీనగర్ నుంచి వచ్చిన ఈ ముఠాకు అదే పేరు స్థిరపడింది. దోపిడీ ఎలా చేశారంటే.... ఈ ముఠా, దోపిడీ చేసిన తీరును గమనిస్తే.. సామాన్యులమైన మనకు ఆశ్చర్యమేస్తుంది. పట్టపగలు.. రద్దీ ప్రదేశంలో.. కేవలం కొన్ని క్షణాల్లోనే.. కారు అద్దం పగలగొట్టి/లాక్ చేసిన డోర్ తీసి, సూట్‌కేసుతో మాయమవడం.. అంత తేలికైన విషయం కాదు. ఇది ఈ ముఠా ప్రత్యేకత. లాక్ చేసిన కారు అద్దాలను ఏమాత్రం శబ్దం రాకుండా ఈ ముఠా పగలగొట్టగలదు. ఒక రకమైన పదార్థాన్ని ఉండలా చేసి, కారు అద్దానికి గట్టిగా కొడతారు. అంతే.. ఆ పదార్థం అంటుకున్నంత వరకు అద్దం ఏమాత్రం శబ్దం లేకుండా పగులుతుంది. అందులో చేయి పెట్టి కారు లాక్ తీస్తారు. లేదా.. చేతికందినవి తీస్తారు. ఖమ్మంలో ఇలాగే చేశారు. ఎలా పట్టుకున్నారు..? దోపిడీ జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు, శరవేగంగా కదిలారు. ఎంత వేగంగా అంటే... కేవలం గంటల్లోనే, జిల్లా సరిహద్దులు దాటక ముందే పట్టేశారు. దోపిడీ సమాచారం అందిన వెంటనే ఖమ్మం రూరల్ ఏసీపీ నరేష్‌రెడ్డి, అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాను రంగంలోకి దిగారు. నగరంలోని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అనుమానితులను గమనించారు. కోదాడ వైపు వెళుతున్న బస్సును ముదిగొండ వద్ద పోలీసులు ఆపారు. ఖమ్మం నుంచి అప్పటికే వారికి పక్కా సమాచారం అందింది. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. అంచనా తప్పలేదు..! నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు అధికారులు విచారించారు. తాము రాంజీ ముఠా సభ్యులమేనని ఆ నలుగురు ఒప్పుకున్నారు. ‘‘మేం మొత్తం పదిమందికి పైగా వచ్చాం. నగల సూట్‌కేసుతో మావాళ్లు వెళ్లిపోయారు. ఖమ్మంలో రెండుచోట్ల సూట్‌కేసులు మాయం చేసింది మేమే’’ అని చెప్పారు(ట). ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో చోరీ చేసింది కూడా ఇదే ముఠా కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘సీసీసీ’లు.. వారెవ్వా...! ‘‘ఒకే ఒక్క సీసీసీ (క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా)... వందమంది పోలీసులతో సమానం..!’’ ఇటీవల, ఓ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ చెప్పిన అక్షర సత్యమన్న విషయం.. ఇక్కడ రుజువైంది. రాంజీ ముఠాను పట్టించింది.. ఈ నిఘా నేత్రాలే!! కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. దోపిడీ జరిగిన రెండు ప్రాంతాలతోపాటు ఇతరచోట్ల కొన్న ?సీసీ కెమెరాలు అంత నాణ్యతగా లేవు. కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా ముఠా కదలికలను పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. చలో చెన్నై...! ఈ ముఠాలోని మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసుల బృందం చెన్నైకి బయల్దేరినట్టు తెలిసింది. ఈ ముఠా మొత్తం చిక్కితే.. వీరి గుట్టంతా రట్టవుతుంది. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎలా దోచుకుందీ తెలుస్తుంది. మింగినదంతా కక్కించేందుకు వీలవుతుంది. శరవేగంగా స్పందించి, అంతే వేగంగా దోపిడీ దొంగలను పట్టుకున్న ఖమ్మం కమిషనరేట్ పోలీసులకు నగర ప్రజలు సలాం చేస్తున్నారు. -
ఖమ్మం రైతులపై పోలీసుల అమానుషం
ఖమ్మం : అన్నదాతల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కేసు విచారణ నిమిత్తం రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు. మార్కెట్ యార్డ్‌పై దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు ఇది. కేసు విచారణ నిమిత్తం గురువారం పదిమంది రైతులను పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు. అయితే నిబంధనలు పాటించిని పోలీసులపై రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు ఏ నేరం కింద బేడీలు వేశారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ చర్యను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. -
ఖమ్మం రైతులపై పోలీసుల అమానుషం
-
ఆర్టీసీ బస్సులో రంగురాళ్ల తరలింపు
-ఖమ్మంలో నిలిపివేసిన పోలీసులు -ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం -సిబ్బంది పాత్రపై అనుమానం తిరువూరు బియ్యం బస్తాల్లో రంగురాళ్ళు నింపి హైదరాబాదుకు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఖమ్మం పోలీసులు జరిపిన తనిఖీలో వెలుగుచూసింది. తిరువూరు నుంచి హైదరాబాదు వెళుతున్న ఆర్టీసీ బస్సులో 5 బస్తాలను గుర్తుతెలియని వ్యక్తులు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఖమ్మం బస్టాండులో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. తొలుత బియ్యం బస్తాలుగా భావించినప్పటికీ విసృ్తత తనిఖీలు జరపడంతో బియ్యం మధ్యలో రంగురాళ్ళను నింపి హైదరాబాదుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ బస్తాలు ఎవరు బస్సులో వేశారు, ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారాన్ని బస్ డ్రైవరు వెల్లడించకపోవడంతో అతనిని అక్కడికక్కడే విధుల నుంచి దింపివేశారు. బస్సును సీజ్ చేయడానికి పోలీసులు యత్నించగా విజయవాడ ఆర్టీసీ రీజనల్ అధికారులు కలుగజేసుకుని ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా వేరొక డ్రైవరుతో బస్సును హైదరాబాదు పంపారు. డ్రైవరుపై చర్యలకు నిర్ణయం బస్సులో రంగురాళ్ళను తరలిస్తున్న వైనంపై ఆర్టీసీ అధికారులు సైతం సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సిబ్బంది ప్రమేయం లేకుండా బస్సులో లగేజీ తరలించడం సాధ్యపడదని భావించిన అధికారులు తిరువూరు డిపోలో కొందరు డ్రైవర్లపై చర్యకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే తనిఖీలో పట్టుబడిన బస్ డ్రైవరును విచారిస్తున్న అధికారులు మరింత సమాచారం కోసం యత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ కంట్రోలర్లు తమకు కేటాయించిన రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయకపోవడంతో అసలు ఏం జరుగుతోందనే విషయం యాజమాన్యానికి అంతుబట్టట్లేదు. విచారణ జరుపుతున్నాం తిరువూరు డిపో బస్సులో బియ్యం బస్తాల పేరుతో రంగురాళ్ళను తరలిస్తున్న విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నాం. సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు రుజువైతే సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. - సత్యనారాయణ, తిరువూరు ఆర్టీసీ డిపో మేనేజర్ -
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అప్రమత్తమైన పోలీసులు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీస్ కొరియర్ల పోలీస్ కొరియర్ల పేరుతో మావోయిస్టులు గిరిజనులను కిడ్నాప్ చేయడంతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీసులు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం, ప్రతీకారంగా మావోలు పోలీసులపై కాల్పులు జరిపి హతమార్చడం వంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కొరియర్లపై పోలీసులు డేగకన్ను వేశారు. కాగా మావోయిస్టులు కూడా తొట్టెంతోగు ఎన్‌కౌంటర్‌పై విచారణ పేరుతో కొందరు గిరిజనులను కిడ్నాప్ చేశారు. పోలీస్ కొరియర్లను గుర్తించి మావోయిస్టులు కిడ్నాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు గిరిజనులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు దుమ్ముగూడెం ఎస్ఐ కడారి ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు వాహన తనిఖీలు విస్తృతంగా చేయడంతో పాటు సరిహద్దులో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు దండకారణ్యం దాటి తెలంగాణలోకి రాకుండా గట్టి జాగ్రత్తలు చేపట్టినట్లు సమాచారం.అటు మావోలు ఇటు పోలీసులు ప్రతీకారంతో రగిలిపోతూ వేస్తున్న ఎత్తులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో ఎవరి నుంచి ఏ ముప్పు వస్తుందో అని వణికిపోతున్నారు. కొందరు గిరిజనులు ఇళ్ల వద్ద ఉండకుండా బయట ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్లు సమాచారం. -
పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!!
చర్ల: మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు సున్నం బొజ్జి అలియాస్ అంజన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లేందుకు దండకారణ్యం నుంచి సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామానికి చేరుకున్న అంజన్న పోలీసులకు చిక్కినట్లు సమాచారం. సున్నం బొజ్జి అలియాస్ అంజన్న స్వగ్రామం ఖమ్మం జిల్లా చర్ల మండలం బత్తినిపల్లి గ్రామం. ఆరేళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిరమణను సంప్రదించగా, తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. -
ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగల మకాం..!
మూడు రోజులుగా లాడ్జిలో తిష్ట అర్థరాత్రి వేళ పోలీసుల దాడులు తప్పించుకుని కారులో పరారు... నల్లగొండ జిల్లా చిట్యాలలో పట్టివేత ఖమ్మం క్రైం నలుగురు సభ్యుల అంతర్రాష్ట దొంగల ముఠాను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ ముఠా మూడు రోజుల కిందటే నగరానికి వచ్చింది. గాంధీచౌక్‌లోని లాడ్జిలో మకాం వేసింది. ఇంతకీ, ఈ ముఠా ఎలా పట్టుబడిందంటే... నగరంలోని మున్సిపల్ రోడ్డులోగల సెల్ షాపునకు శుక్రవారం రాత్రి ఓ యువకుడు వచ్చాడు. సెల్ ఫోన్ కొన్నాడు. డబ్బు చెల్లించేందుకు తన వద్దనున్న క్రెడిట్ కార్డుతో స్వైప్ చేశాడు. కొద్ది క్షణాల్లోనే.. ఆ షాపునకు ఫోన్ కాల్ వచ్చింది. ‘‘ఇప్పుడు స్వైప్ చేసిన క్రెడిట్ కార్డు నాది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆ వ్యక్తిని అక్కడే ఉంచి, వెంటనే పోలీసులకు చెప్పండి’’ అని కోరారు. ఆ షాపు సిబ్బంది అప్రమత్తమయ్యూరు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేంత వరకు ఆ వ్యక్తిని మాటల్లో పెట్టారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జిలో మకాం ఆ యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రాజస్థాన్‌కు చెందిన తాము మొత్తం నలుగురం ఉన్నామని, ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నామని చెప్పాడు. గాంధీచౌక్‌లోని లాడ్జిలో రూమ్ తీసుకున్నామని, మూడు రోజులుగా అక్కడే ఉంటున్నామని తెలిపాడు. అర్థరాత్రి దాటిన తరువాత, పోలీసులు ఆ లాడ్జిలోని రూముకు వెళ్లి సోదా చేశారు. అప్పటికే అక్కడి నుంచి ఆ ముగ్గురు వ్యక్తులు కారులో ఎటో పారిపోయూరు. చిట్యాలలో దొరికారు కారు నెంబరు, ఇతర ఆనవాళ్లను జిల్లాలోని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు, నల్గొండ జిల్లా పోలీసులకు పంపించారు. ఆయూ ప్రాంతాల పోలీసులు వేగంగా స్పందించి ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసుల తనిఖీలో ఈ కారు పట్టుబడింది. ఇందులోని ముగ్గురు వ్యక్తులను అక్కడి ఎస్సై అదుపులోకి తీసుకుని, ఖమ్మం పోలీసులకు సమాచారమిచ్చారు. వీరు అక్కడకు వెళ్లి, ఆ ముగ్గురినీ తీసుకొచ్చి విచారిస్తున్నారు. భారీ చోరీలు తాము నలుగురం ముఠాగా ఏర్పడ్డామని, భారీగా దొంగతనాలు చేస్తున్నామని వీరు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. నగరానికి చెందిన వారే ఈ లాడ్జిలో తమకు రూమ్ బుక్ చేసినట్టుగా చెప్పారని, అరుుతే వారి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదని సమాచారం. మూడు రోజులుగా లాడ్జిలో ఉంటున్న ఈ నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు..? వారి కారు నెంబర్ ఎంత..? అడ్రస్ ఎక్కడ..? ఎందుకోసం వచ్చారు..? తదితర వివరాలను లాడ్జి సిబ్బంది నమోదు చేయలేదని తెలిసింది. పగలంతా బయట.. అర్థరాత్రి రాక రాజస్థాన్‌కు చెందిన ఈ నలుగురు వ్యక్తులు పగటి పూట తమ గదిలో నుంచి బయటకు వెళ్లి, ఎప్పుడో అర్థరాత్రి దాటిన తరువాత తిరిగి వచ్చేవారని పోలీసులతో లాడ్జి సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. ‘‘రూమ్‌లోకి వెళ్లిన తర్వాత వారు అసలు బయటకు వచ్చే వారు కాదు. హోటల్ బాయ్స్ లోపలికి వెళ్లినప్పుడు.. వారంతా ఫోన్లో హిందీలో మాట్లాడుతూ కనిపించేవారు. ఖమ్మంలో ముఖ్యమైన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగారు’’ అని, పోలీసులతో ఈ లాడ్జి సిబ్బంది చెప్పినట్టు సమాచారం. గాంధీచౌక్‌లోని ఓ హోటల్లో భోజనం, స్టేషన్ రోడ్డులోగల రాజస్థానీ హోటళ్లలో అల్పాహారం చేసేవాళ్లమని ఈ నలుగురు పోలీసులతో చెప్పినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వీరిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.