
(ఫైల్ ఫొటో)
ఖమ్మం: ఐపీఎల్-2021 మ్యాచ్‌లపై బెట్టింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. మ్యాచ్‌లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఈ బెట్టింగ్‌ను కొత్త తరహాలో చేస్తుండడం గమనార్హం. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురుని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఈ బ్యాచ్ గూగుల్ పే ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. రూ.రెండు లక్షల రూపాయల వరకు బెట్టింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో లావాదేవీలు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఏసీపీ వెల్లడించారు.
చదవండి: మా రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టబోం
చదవండి: మరో హీరో.. ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్
Comments
Please login to add a commentAdd a comment