ఆదిలాబాద్(చెన్నూరు): ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామంలో పొలానికి క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తూ అపస్మారకస్థితిలోకి వెళ్లిన వ్యవసాయకూలీ గాదరి రాజు(20) గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. పొలంలో మధ్యాహ్నాం అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే రాజుని చికిత్స నిమిత్తం స్థానిక చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ కు తీసుకెళ్లగా అక్కడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం అర్థరాత్రి మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.