ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి | father killed his son in karimnagar district | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి

Published Sun, May 31 2015 9:36 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

father killed his son in karimnagar district

కరీంనగర్:

కన్నతండ్రే కాలయముడిగా మారాడు. కుటుంబకలహాల నేపథ్యంలో ఆరేళ్ల కుమారుడిని వ్యవసాయ బావిలో విసిరేయడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం భూషణ్‌రావుపేటలో జరిగింది. మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన మల్లేశం, అతడి భార్య మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మల్లేశంభార్య కుమారుడు మణివర్ధన్, కుమార్తెతో కలసి భూషణ్‌రావుపేటలోని తల్లిగారింట్లో ఉంటోంది.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మల్లేశం భూషణ్‌రావుపేటలోని తన అత్తగారింటికి వచ్చాడు. తినుబండారాలు కొనిస్తానని చెప్పి కుమారుడు మణివర్ధన్‌ను బయటకు తీసుకొచ్చి గ్రామ శివార్లలోని వ్యవసాయ బావిలో విసిరేసి వెళ్లిపోయాడు. దీంతో మణివర్ధన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం స్థానికులు బావిలో చిన్నారి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు మల్లేశం పరారీలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement