'తండ్రీ, కొడుకు, ఓ అబద్ధాల అల్లుడు' | 'Father, son a lie son-in-law' | Sakshi
Sakshi News home page

'తండ్రీ, కొడుకు, ఓ అబద్ధాల అల్లుడు'

Published Sat, Nov 29 2014 5:30 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

రేవంత్ రెడ్డి - Sakshi

రేవంత్ రెడ్డి

హైదరాబాద్:  తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఒక మయసభగా ఉపయోగించుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి తండ్రీ, కొడుకు, ఓ అబద్ధాల అల్లుడు త్వరలోనే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. ఈ బడ్జెట్ మొత్తం హరీష్ రావు, కేటీఆర్లకు పంచినట్లయిందన్నారు.

అమరవీరుల త్యాగాలు భావితరాలు స్మరించుకునేలా బుద్ధుని విగ్రహం వద్ద వెయ్యి కోట్ల రూపాయలతో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయాలని కోరారు.  కేవలం కేసీఆర్ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందంటున్నారన్నారు. అమరవీరుల త్యాగాలు చరిత్రలో రాయవలసి వస్తుందని స్థూపంపై మాట్లాడటంలేదని విమర్శించారు.  భవిష్యత్లో తాము అధికారంలోకి వస్తే బుద్ధ విగ్రహం వద్ద అమరవీరుల స్థూపం ఏర్పాటు చేస్తామని రేవంత్ చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement