‘ఫీజు’ పోరు ఉధృతం
ఫీజు కోసం విద్యార్థులు ఫైట్ చేస్తున్నారు..ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లించే వరకు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.. వారం రోజులుగా జిల్లాలో తీరొక్క విధంగా నిరసన తెలుపుతున్నారు.. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహిస్తున్నారు.. అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ బకారుులు చెల్లించాలని వేడుకుంటున్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.. కేసీఆర్ సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబడుతున్నా.. మంజూరు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. పెండింగ్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయూలని డివూండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడ్డారుు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలతో తమ పోరును ఉధృతం చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు రన్‌ఫర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట విద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ నగర అధ్యక్షుడు రావుల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల త్యాగలతో సాధించుకున్ను తెలంగాణ నూతన రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్స్ చెల్లించకుండా కేసీఆర్ సర్కార్ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఆందోళన సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. రాకేష్, గూడ వాసు, దినాకర్, కోటి, రాజ్‌కుమార్, సృజన తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో
ఏబీవీపీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని ఆర్డీఓ కార్యాలయుం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు., ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి, వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద వూనవహారంతోపాటు ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ బాగ్ కన్వీనర్ బోడ నవీన్‌నాయుక్ , ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి దిడ్డి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయుకులు టౌన్ సీఐ జాన్‌దివాకర్ ఆధ్వర్యంలో విరమింపజేశారు.
ములుగులో...
ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ములుగులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు కుమ్మరి సాగర్, కమిటీ సభ్యులు సందీప్, రియాజ్, రాంబాబు పాల్గొన్నారు.
మరిపెడలో...
మండల కేంద్రంలో ఆర్‌జేఆర్‌ఎం డిగ్రీ కళాశాలతోపాటు శ్రీనివాస, ఠాగూర్, సాయిశివాణి జూనియర్ కళాశాలల విద్యార్థులు బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ మండల కన్వీనర్ రావుల సుమంత్ రెడ్డి, మహేష్‌బాబు, నవీన్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తిలో...
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మండల కేంద్రంలో రన్ ఫర్ రీరుుంబర్స్‌మెంట్ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో బీజేపీ నియోజక వర్గ కన్వీనర్ దొంగరి మహేందర్ జెండా ఊపి ప్రారంభించగా... గుడివాడ మీదుగా కార్యక్రమం కొనసాగింది. వాగ్దేవి, ఎస్‌పీ,ఠాగూర్, ఎస్‌ఎస్‌ఎన్‌ఎల్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, ఏబీపీపీ మండల కన్వీనర్ కమ్మగాని శ్రీకాంత్, నరేష్ పాల్గొన్నారు.
జనగామలో...
ఏబీవీపీ జనగామ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు రన్ ఫర్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూపార్క్ వరకు పరుగు నిర్వహించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాధం సంపత్ తదితరులు పాల్గొన్నారు.
నర్మెటలో...
మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలోరన్ ఫర్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాల నుంచి చౌరస్తా వరకు పరుగెత్తి ప్రధాన చౌరస్తాలో ధర్నా ని ర్వహించారు. ఏబీవీపీ మండలకన్వీనర్ ఉదయ్, వి జయ్, సందీప్, చందు, వినోద్, నరేష్ పాల్గొన్నారు.