చిగురుమామిడి (కరీంనగర్) : అప్పులబాధ తాళ లేక ఓ మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నవాబుపేట గ్రామానికి చెందిన సాగరిక(24) అనే
వివాహిత ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పండిస్తోంది.
ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగ్గా లేక అప్పులే మిగులుతున్నాయి. ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందని ఆశలు పెట్టుకున్న సాగరికకు ఎండిపోయిన పత్తి చేను కనిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సాగరికకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మహిళా రైతు ఆత్మహత్య
Published Mon, Sep 21 2015 3:54 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement