హైదరాబాద్ సిటీ : ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుందని, ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి బొజ్జా తారకం అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ రంగంలో దిగ్గజాలైన ఎన్నో సంస్థల్లో ఏ కారణం చూపకుండా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులను తొలగిస్తున్నారని ఇది కార్మిక వ్యతిరేక విధానమని, ఇది వారి జీవించే హక్కును హరించడమే నని తారకం అన్నారు.
భారతదేశంలో ఏ రంగానికీ ఇవ్వని ట్యాక్స్ మినహాయింపు ఐటీ రంగానికి ఇస్తున్నారని, ట్యాక్స్ కట్టే సాధారణ పౌరుని డబ్బులను తీసుకు వెళ్లి ఐటీ రంగాలకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారని దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర అద్యక్షుడు టి. నర్సింహ్మ, సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధా భాస్కర్, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి సూర్యం, ఫరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కో - ఆర్డినెటర్ నాజర్ తదితరులు పాల్గొన్నారు.