- రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్
మెదక్ (సిద్దిపేట): దళిత గిరిజనుల హక్కుల సాధనకు భవిష్యత్తులో సమిష్టి ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘాల అధ్యక్షుడు గణేష్‌నాయక్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేడు ఆరు శాతంతోనే నోటిఫికేషన్‌ల జారీకి సిద్ధం కావడం విచారకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా ప్రాతిపదికన ఆరు శాతాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణలో 12 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం భర్తి చేయనున్న రెండు లక్షల ఉద్యోగాల్లో ఎస్టీల శాతం వాటాను ప్రకటించాలన్నారు. ప్రభుత్వం హామీ మేరకు 12 శాతం అమలుతోనే గిరిజనులకు లబ్ధి చేకూరే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కావడం లేదన్నారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు మంత్రిని వెంటనే నియమించి పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుకు సెర్ఫ్ రూపొందించిన నిబంధనలను వెంటనే ఆమోదించాలన్నారు. చట్టంలోని లోపాలను సవరించి దళిత గిరిజన సమగ్ర అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించి స్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు. సబ్ ప్లాన్ నిధులను నేరుగా ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజన్సీలకు అప్పగించాలన్నారు. నిధుల కేటాయింపు, పర్యవేక్షణ తదితర అధికారాలన్నింటిని నోడల్ ఏజన్సీకి కల్పించాలన్నారు. సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ మహిళ సంక్షేమ అభివృద్ధి పథకాలకు కేటాయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం మార్చి 10న చలో అసెంబ్లీ పేరిట హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి చలో అసెంబ్లీకి ర్యాలీ ప్రారంభం కానుందన్నారు.
దళిత, గిరిజన హక్కులకోసం సమిష్టిపోరు
Published Sat, Feb 28 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement