సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు వాస్తవరూపం ఇవ్వడానికి పోరాటాలు త ప్ప మరో మార్గం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ రెండో వార్షికోత్సవానికల్లా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీపీఎం.. ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీనిద్వారా దేశ ఎజెండాలోనే మార్పు వచ్చిందన్నారు. ఫ్యూడల్ పాలన వల్ల ఎదురైన సమస్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందన్న సంతోషం తప్ప ఏడాదిలో సాధించినదేదీ కనిపించట్లేదన్నారు.
నియంతృత్వం దిశగా మోదీ సర్కార్..
ప్రధాని మోదీ విధానాలతో కేంద్రం నియంతృత్వం దిశగా సాగుతున్నట్లుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దిగజారుతూ కొత్త రకమైన ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీడబ్ల్యూజేఎఫ్, హేచ్‌యూజేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పోరాటాలే శరణ్యం
Published Wed, Jun 3 2015 3:37 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
Advertisement