desires
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : అర్థము అంటే..!!!
సుఖాన్ని... కామాన్ని ధర్మము చేత కట్టాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. అందుకే కన్యాదాత కన్యను తీసుకొచ్చి ధర్మపత్నిగా ఇచ్చేటప్పుడు వరుడితో... ‘కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై’ అంటాడు. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి నీరు... అలాగే కామం ఒక ప్రయోజనం కోసం... అందువల్ల అది ధర్మంచేత కట్టబడాలి. ఆయనకు సంతానం కలిగి పితృరుణంనుండి విముక్తుడు కావాలి. ఆయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. వివాహం చేయాలంటే పత్ని ఉండాలి. ఆమె లేనప్పుడు ఈ కార్యక్రమాలు వేటికీ కూడా ఆయన అర్హుడు కాడు... ఈ నియమాలు ఎవరో ఒకరు పెట్టినవి కావు. శాస్త్రం నిర్దేశించినవి. అంటే ధర్మపత్నిని స్వీకరించకుండా పుణ్యకార్యాలు చేయడం, తరించడం ఎలా సాధ్యం? అందుకే జీవితం పండించుకోవడానికి అవసరమయిన సాధనాన్ని కన్యాదాత ఇస్తున్నాడు. నిజం చె΄్పాలంటే ... కొడుకు పుడితే.. వాడు ప్రయోజకుడయితే.. వాడు ధార్మికంగా బతికితే... అప్పుడు తల్లీదండ్రీ, ఆపైన ఉన్నవాళ్ళు .. తరువాత అత్తగారు, మామగారు తరిస్తారు. పుత్ అను పేరుగల నరకం నుంచి త్రాయతే.. రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. కుమార్తెను కన్యాదానం చేశాను.. అనుకోండి. అప్పుడు నాకు పది తరాల ముందూ, పది తరాల వెనకా నాతో కలిపి 21 తరాలు తరించి΄ోతాయి. ఈ సంతానం కలగడానికి కారణం ఎవరు? నా ధర్మపత్ని. ఆమె వల్ల సంతానం కలిగితే ఇంత గొప్ప ప్రయోజనం సిద్ధించింది. అందువల్ల కామము ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలంటే.. భార్యాభర్తలు చెలియలికట్ట దాటకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ‘చెలియలికట్ట’ అనే సాంఘిక నవల రాశారు. అందులో... వివాహం ద్వారా కామము ధర్మం చేత ఎందుకు కట్టబడుతుందో ప్రతి΄ాదించారు. సముద్రం అనంత జలరాశి. చాలా శక్తిమంతం. అది అనుకుంటే ఊళ్ళను సునాయాసంగా ముంచేయగలదు. అయినా దానికదిగా .. చెలియలికట్ట దాటకూడదని.. ఒక నియమం పెట్టుకుంది. ఆడుకుంటున్నట్లుగా అక్కడిదాకా వస్తాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆచారాలు కడిగి అలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాళ్ళు కడిగాయి కదా అని అతి చేసి తెగించి మరింత ముందుకు వెడితే.. ప్రమాదం ముంచుకొస్తుంది.‘ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతి చరితవ్యా..’ – ఇది ప్రమాణం. ‘మామగారూ! ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు నాకు ఇంతటి మహోపకరణాన్ని ఇచ్చారు. నేను ఈమెను అతిక్రమించను. ఈమె నాకు ప్రధానంగా ధర్మబద్ధ జీవితానికి ఒక సాధనం. ఈమెను నేను ధర్మపత్నిగా స్వీకరించినందుకు నా జీవితం పండాలి. చేయగలిగిన పుణ్యకార్యాలు చేయాలి. అసలు నేను నా భార్యతో కలిసి చేయవలసివేమిటో నాకు తెలియాలి. మేమిద్దరం చేయీచేయీ పట్టుకుని ప్రయాణించాలి. తద్వారా నేనూ తరించాలి, ఆమే తరించాలి.’ అనుకుని ఆచరిస్తాడు. అలా కామము ధర్మము తో కలిసినప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అర్థము – అంటే? బంగారం, ఇళ్ళు, వస్తు, వాహనాలు కాదు... మరి నిజమైన సంపద ఏది? పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలే అసలు సిసలైన సంపద. అదే అర్థము ప్రభవించడం అంటే.-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..
ఒక రోజున బుద్ధుడు అబిరవతి నదీ తీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే ఒక ఆరామం కూడా ఉంది. బుద్ధుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఆ పరిసర గ్రామ వాసులు ఎందరో అక్కడికి వచ్చారు. బుద్ధుని ధర్మోపదేశం పూర్తి చేయగానే... ఒక యువకుడు లేచి నమస్కరించి... ‘‘భగవాన్! కోరికలు చెడ్డవా? వాటి వల్ల ప్రయోజనం ఉండదా? వివరించి చెప్పగలరు’’ అని ప్రార్థించాడు. ‘‘ఓ యువకా! జాగ్రత్తగా విను. ఒక మాంసం వ్యాపారి తన దుకాణం దగ్గరకు వచ్చిన కుక్కకు మాంసం గీకేసిన ఎముకను వేస్తాడు. ఆ ఎముకకు మాంసం చెమ్మ, కొద్దిగా రక్తం మాత్రమే అంటి ఉంటాయి. కానీ... ఆ కుక్క ఆ ఎముకను కరచుకొని నానా తంటాలు పడుతుంది. దానివల్ల దాని ఆకలి తీరదు. దౌర్బల్యమూ తొలగదు. కోరికల వల్ల దొరికేది కూడా ఇంతే! అలాగే... వెలుగు కోసం ఒకడు ఒక గడ్డిదివిటీని పట్టుకుని గాలికి ఎదురుగా పరుగులు తీస్తుంటాడు. దివిటీ మంట చెలరేగి, పెద్దదవుతుంది. దివిటీని పట్టుకున్న వాని ముఖం మీదకే జ్వాలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు వాడు ఆ దివిటీని వదిలి పెట్టకపోతే.. తన దివిటీనే తనని కాల్చేస్తుంది. మనలో రేగిన కామాగ్నులు కూడా మనల్ని అలానే దహిస్తాయి. నిలువెత్తు లోతులో నిప్పుల గుండం ఉంటుంది. అది రగిలి చల్లారింది. పైకి మంట గానీ, పొగ గానే లేవడం లేదు. పైపై బొగ్గులన్నీ చల్లారాయి. కానీ... దానిలో దిగిన వాడు మాత్రం నిప్పుల్లో దిగబడిపోతాడు. మాడి బొగ్గులా మారిపోతాడు. కామం అనే నిప్పుల గుండంలో దిగబడిన వారు కూడా అలానే నశించిపోతారు. అలాగే... ఒకడు స్వప్నంలో అందమైన పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. రంగురంగుల పూలచెట్లు, అందమైన సీతాకోకచిలుకలు, తుమ్మెదల ఝుంకార నాదాలూ... మత్తు కలిగించే చల్లని గాలి, వాడు ఆనందం లో తేలిపోయి, మైమరచిపోతాడు. అంతలో మెలకువ వస్తుంది. ఆనంద దృశ్యాలన్నీ అదృశ్యమై పోతాయి. మధురానుభూతి మాయమైపోతూ ఉంటుంది. కామ సుఖాలు కూడా అలాంటివే... ఇంకా ఒకరు అందమైన, విలువైన నగల్ని అరువు తెచ్చుకుంటారు. ధరిస్తారు. దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తారు. అక్కడ అంగడిలో వాటిని అమ్మకానికి పెడతారు. బేరం జరుగుతూ ఉండగా, అసలైన నగల యజమాని వస్తాడు. దూషించి తన నగలు తాను పట్టుకుపోతాడు. అవమానంతో బేలతనంతో ఆ అరువు తెచ్చుకున్న వారు హేళన పాలవుతారు. కామాలు అంటే కోరికలు కూడా మనకి చివరికి అవమానాల్ని తెస్తాయి. హేళన పాల్జేస్తాయి. కాబట్టి కోరికలల వెంటపడి పరుగుతీసే మన మనస్సుని మనం నియంత్రించుకోవాలి.’’ అని చెప్పాడు. ఆ యువకునితో పాటు, అక్కడ ఉన్న వారందరికీ కోర్కెల వల్ల కలిగే కీడు అర్థమైంది. ఆ యువకుడు లేచి, బుద్ధునికి వంగి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు) -
ఆ రెండు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కత్తి మహేశ్
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలు వివాదాస్పద అంశాలతో చర్చకు తెరతీసి పాపులర్ అయిన కత్తి మహేశ్‌కు సోషల్ మీడియాలోనూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీలు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేసిన కత్తి మహేశ్..రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు పనిచేశారు. 2015లో పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. అయితే నటుడిగా రాణించాలనే కోరికతో హృదయ కాలేయం,కొబ్బరి మట్ట సహా కొన్ని చిత్రాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఎప్పటికైనా నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులతో పాటు స్నేహితులతోనూ పదేపదే చెప్పేవారట. అంతేకాకుండా రాజకీయాల్లోనూ రాణించాలని భావించారట. అయితే దురదృష్టవశాత్తూ యాక్టింగ్, పాలిటిక్స్..ఈ రెండింటిలోనూ ఆయన ప్రారంభ దశలో ఉండగానే అకస్మాత్తుగా కన్నుమూశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినా అప్పుడు కుదరలేదు. మొత్తానికి నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన గుర్తింపు సంపాదించాలన్న కత్తి మహేశ్..ఆ రెండు కోరికలు తీరకుండానే తుదిశ్వాస విడిచారు. -
తనకున్న కోరికలేంటో చెప్పేసిన కృతి సనన్
సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘1: నేనొక్కడినే’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. అయితే తెలుగులో ఈ భామకు సరైన హిట్ లేకపోయినా బాలీవుడ్లో మాత్రం సక్సెస్ అందుకుంది. అప్పట్నుంచి హిందీ చిత్రాలకే పరిమితమైన ఈ భామ..ఆ తర్వాత వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం 7 భారీ బడ్జెట్ చిత్రాలతో గత కొన్ని నెలలుగా ఫుల్ బిజీగా ఉంది కృతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ..తనకున్న మూడు కోరికలను బయటపెట్టేసింది. అందులో మొదటిది..ఓ పెద్ద ఇళ్లు..అక్కడే పెద్ద గార్డెన్లో కూర్చొని హాయిగా టీ తాగుతూ సేదతీరాలి. రెండోది స్కై డేవింగ్, ఇక మూడోది నేషనల్ అవార్డ్‌ని అందుకోవాలి అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఈ కోరికలు త్వరగా నెరవాలని కోరుకుంటున్నానని కృతి పేర్కొంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘అదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృతి చేతిలో ప్రస్తుతం 7 సినిమాలు ఉన్నాయి. దీంతో కరోనా రాకుండా పలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్లో పాల్గొంటుంది ఈ భామ. చదవండి : పుష్ప టీజర్‌పై కాంట్రవర్సీ..'కాపీ' అంటూ నెటిజన్లు ఫైర్ నటితో బిగ్‌బాస్ విన్నర్ లిప్‌లాక్.. వీడియో వైరల్ -
త్వరలో చనిపోతా..తిట్టాలంటే..
సాక్షి, ముంబై: వివాదస్పద మూవీ సమీక్షకుడు బాలీవుడ్ నిర్మాత, నటుడు, కమాల్ రషీద్ ఖాన్ (కెఆర్కె) మరోసారి కలకలం సృష్టించాడు. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలపై వివాదాస్పద రివ్యూలతో పాపులర్ అయన కమాల్ ఆర్ ఖాన్ ఈసారి ఓ విషాద వార్తతో సంచలనం రేపాడు. తనకు స్టమక్ కాన్సర్ (జీర్ణాశయ క్యాన్సర్) సోకిందని ట్విటర్లో వెల్లడించాడు. ఈ మేరకు కేఆర్కే బాక్స్ ఆఫీస్ ట్విటర్లో నిన్న (మంగళవారం) విడుదల చేసిన ఒక ప్రకటన వైరల్ అయింది. తనకు సోకిన క్యాన్సర్ వ్యాధి థర్డ్ స్టేజ్‌లో ఉందని మహా అయితే తాను ఒకట్రెండేళ్లు మాత్రమే బతికి వుంటానని ట్వీట్ చేశాడు. దీంతోపాటు తనను ఎవరైనా తిట్టాలనుకున్నా.. ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే ఎప్పటిలాగే కొనసాగించవచ్చని..కానీ కాల్స్ మాత్రం చేయవద్దని కోరాడు. అయితే, తనపై ఎవరూ జాలిపడొద్దని, తనను ఓదార్చేందుకు ఫోన్లు చేయద్దని కోరాడు. ఇన్నాళ్లూ తనను తిట్టిన వారికి, ద్వేషించిన వారికి అభినందనలు తెలియజేసిన కమాల్, అందరూ తనను ద్వేషించినా, తాను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు. అయితే ఎప్పటికీ నెరవేరని రెండే రెండు కోరికలు మిగిలిపోయాయని తెలిపాడు. ‘ఒకటి: గొప్ప (ఏ గ్రేడ్) ప్రొడ్యూసర్ కావాలనుకున్నా.. రెండు: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేయాలనుకున్నా. కానీ ఇవి రెండూ నాతో పాటే సమసిపోనున్నాయంటూ’ ఖాన్ తన ప్రకటనలో వెల్లడించాడు. ఇక నుంచీ కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఇన్నాళ్లూ అతన్ని ద్వేషించిన వారు కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు. కాగా 2008లో భోజ్‌పురి సినీ నిర్మాతగా కరియర్‌ను ప్రారంభించిన కమాల్ ఆర్ ఖాన్ వివాదాస్పద బాలీవుడ్, టాలీవుడ్ మూవీ రివ్యూలు, సినిమా ప్రముఖులపై ముఖ్యంగా అమీర్‌ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలతో వెలుగులో వచ్చాడు. దీంతో అప్పట్లో ట్విటర్ అతని ఖాతాను కూడా తొలగించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 తనకు నచ్చలేదంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. This is press release of #KRK about his health. pic.twitter.com/0UlscVD4wq — KRKBOXOFFICE (@KRKBoxOffice) April 3, 2018 -
హేమంతి
‘‘ఆ పిల్ల వచ్చెళ్లిందిరా నీ కోసం’’ అంది అమ్మ. ఆ పిల్ల అంటే.. హేమంతి! ‘‘నా కోసం ఎందుకొస్తుంది? పండక్కి వచ్చిందేమో’’ అన్నాను. ‘‘పండక్కే ఊరొచ్చి, నీ కోసం మనింటికి వచ్చింది. బిడ్డని చంకనేసుకొచ్చింది. ముద్దుగా ఉందది’’ చెప్పింది అమ్మ. ‘‘ఏంటటా?’’ అన్నాను. ‘‘వాడు పండక్కి రాలేదా ఆంటీ అని అడిగింది’’. వాడు అంటే నేనే. మా అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నన్ను ‘రేయ్’ అని ఒక్క హేమంతే అంటుంది. నాన్న కూడా నన్ను రేయ్ అనరు. ‘బాబూ’ అనేది ఆయన పిలుపు. ‘‘అయినా నువ్వేంట్రా, ఎవరైనా పండక్కి వస్తారు. పండక్కని చెప్పి నువ్వు పండక్కి ముందో, పండగ తర్వాతో వచ్చెళతావు. తను వచ్చినప్పుడు నువ్వు ఉండుంటే బాగుండేది కదా!’’ అంది అమ్మ.\ ‘‘ఊ’’ అన్నాను. ‘‘వాడి ఫోన్ నెంబరు ఇవ్వనా అమ్మా అంటే, ‘వద్దాంటీ’ అని.. ‘ఇదిగో ఈ కవరు వాడికివ్వండి’ అని చెప్పి వెళ్లింది’’ అంది అమ్మ. కవర్ తీసుకున్నాను. అంటించి ఉంది. లోపల అసలు ఏమైనా ఉందా లేదా అన్నంత పలుచగా ఉంది కవరు. మూడేళ్లయింది హేమంతిని చూసి! హేమంతి పేరు హేమంతి కాదు. అది నేను పెట్టుకున్న పేరు. ఆ సంగతి హేమంతికి కూడా తెలీదు. టెన్త్‌లో నా క్లాస్మేట్ హేమంతి. ఏదో ఊర్నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. రోజూ మా ఇంటికి వచ్చేది. ఇంటి ముందు సన్నజాజి పందిరి కింద నిలబడి మాట్లాడుకునేవాళ్లం. ‘ఆడపిల్లల్తో మాటలేంట్రా?’ అంది అమ్మ ఓ రోజు, హేమంతితో మాట్లాడి ఇంట్లోకి రాగానే. ‘అదేంటమ్మా..’ అన్నాను. అమ్మేం మాట్లాడలేదు. ఇంటర్లో కూడా హేమంతి, నేను కలిసే చదువుకున్నాం. అప్పుడు పెట్టుకున్నదే హేమంతికి నేను ఆ పేరు. ఆ సంగతి తనకి చెప్పలేదు. అది నా సొంత విషయం అనుకున్నాను. హేమంతి బాగుంటుందని కాలేజ్‌లో అందరూ అనేవారు. అమ్మ కూడా అంటుండేది.. ‘చక్కటి పిల్లరా’ అని. ఎందుకనో అమ్మాయిలందరూ నాకు చక్కగానే కనిపించేవారు. హేమంతి.. ఇంకాస్త చక్కటి అమ్మాయి కావచ్చు. అయితే చక్కగా ఉంటుందని తనకు నేను హేమంతి అనే పేరు పెట్టుకోలేదు. హేమంతాన్ని, చామంతిని కలిపేసి.. హేమంతి అనే పదాన్ని క్రియేట్ చేశాను. ఆ క్రియేషన్ నాకు చాలా నచ్చింది. తనకి పెట్టుకోవాలనిపించింది. పెట్టుకున్నాను. ఇంటర్లోకి వచ్చాక కూడా అమ్మ నాకు చెబుతుండేది.. ‘ఆడపిల్లల్తో ఎక్కువగా మాట్లాడకు’ అని! చిన్నప్పుడు నాన్న నన్ను కొట్టి, నేను ఏడుస్తూ ఉంటే దగ్గరకు తీసుకుని ‘అబ్బెబ్బే.. మగపిల్లలు ఎక్కడైనా ఏడుస్తారా?’ అని కళ్లు తుడిచేవారు. ఎందుకు ఏడవకూడదు? నాన్న నన్ను కొట్టడం తప్పు కానప్పుడు, నేను ఏడ్వడం తప్పెలా అవుతుంది? చాలాసేపు ఆలోచించేవాడిని. తర్వాత నాన్నే కరెక్ట్ అని తెలిసింది. సినిమాల్లో హీరో, విలన్ ఒకర్నొకరు కొట్టుకుంటూ ఉంటారు. హీరో ఏడ్వడు, విలనూ ఏడ్వడు. మగాళ్లు ఏడ్వరనీ, ఏడ్వకూడదనీ అలా నా మనసులో పడిపోయింది. ఆడపిల్లల్తో ఎక్కువ మాట్లాడకూడదని ఎప్పుడూ అమ్మ చెబుతుండే మాట కూడా అలాగే నా మనసులో పడిపోయింది. తర్వాత్తర్వాత.. అమ్మ అలా చెప్పడానికి నేనొక కారణాన్ని కనిపెట్టాను. నేను బాగుండను! బాగుండను అంటే.. అమ్మాయిలకు నచ్చేంత బాగుండను. ఆ సంగతి నాకు తెలుసు. నేనెవరినైనా ఇష్టపడి, వాళ్లు కాదంటే మనసు నొచ్చుకుంటానని, ముందు జాగ్రత్తగా అమ్మ అలా చెప్పేదేమో! హేమంతికి నేను పేరు పెట్టుకున్నానే కానీ, హేమంతిపై ఆశలు పెట్టుకోలేదు. హేమంతికి కాలేజ్ నిండా ఫ్రెండ్సే. ఇంటి దగ్గర మాత్రమే తనకి నాతో మాట్లాడే టైమ్ దొరుకుతుంది. హేమంతికి, నాకు కామన్ ఫ్రెండ్ ఒకడున్నాడు. హేమంతిని వాడు భలే నవ్వించేవాడు. పొట్ట చేత్తో పట్టుకుని మరీ నవ్వుతుంది హేమంతి. అలా నవ్వుతున్నప్పుడు హేమంతి ఇంకా బాగుండేది. వాడికి బైక్ ఉంది. ఆ బైక్ మీద ఎప్పుడైనా ఇద్దరూ కలిసి కనిపించేవారు. ఓరోజు నన్నూ ఎక్కమన్నాడు వాడు. ‘ముగ్గురమా!’ అన్నాను. ‘ఎక్కరా పర్లేదు’ అన్నాడు. అప్పటికే వాడి వెనుక హేమంతి కూర్చొని ఉంది. హేమంతి వెనుక నేను కూర్చోబోయాను. ‘ఫట్’మని నా చెంప మీద కొట్టాడు వాడు. ‘ఆడపిల్లని మధ్యలో కూర్చోబెట్టుకుంటార్రా ఎవరైనా?’ అన్నాడు! ‘లేదూ.. నీ ఫ్రెండ్ కదా. నీ వెనకే ఉంటే బాగుంటుందనీ..’ అన్నాను. ఈసారి ‘ఫట్’మని హేమంతి నా చెంప మీద కొట్టింది. వాడి కన్నా గట్టిగా కొట్టింది. ‘ఎవరికిరా బాగుండేది? నీకా’ అని మళ్లీ కొట్టింది. ‘నేను రాను. మీరు వెళ్లండి’ అన్నాను. అదే కాలేజ్‌లో మా డిగ్రీ. థర్డ్ ఇయర్లో ఉండగా.. రోజూ వచ్చినట్లే.. మా ఇంటికొచ్చింది హేమంతి. ఎప్పటిలా సన్నజాజి పందిరి కింద నిలబడి మాట్లాడుకుంటున్నాం. హేమంతి డల్‌గా ఉంది. ‘నాన్న ఒప్పుకోవడం లేదు. మంచి సంబంధం అంటున్నారు’ అంది. ‘చేసుకోవచ్చు కదా’ అన్నాను. ‘నీకేం అనిపించడం లేదా?’ అంది హేమంతి. ‘పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అన్నారు కదా. ఇంకేంటి?’ అన్నాను. హేమంతి వెళ్లిపోయింది. ‘పెళ్లి ఖాయం అయ్యేలా ఉంది. వెళ్లిపోతాం ఇక్కణ్నుంచి’ అంది హేమంతి మళ్లీ ఒకరోజు వచ్చి. ‘అవునా?’ అన్నాను. ‘నీకేం అనిపించడం లేదా?’ అంది. ‘ఏంటి అనిపించడం?’ అన్నాను. హేమంతి మాట్లాడలేదు అదే చివరిసారి నేను హేమంతిని చూడడం. ఇంట్లోకొచ్చి ఎందుకనో అద్దం చూసుకున్నాను. కళ్లు మామూలుగానే ఉన్నాయి. కళ్లల్లో నీళ్లు లేవంటే మనిషి ఏడ్వడం లేదనేనా?! గదిలోకి వెళ్లాక, అమ్మకు హేమంతి ఇచ్చి వెళ్లిన కవరు తెరిచి చూశాను. లోపల చిన్న కాగితం ఉంది. అందులో రెండే వాక్యాలు. ‘కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలవుతారని అంటారు. మనసులో ప్రేమను పెట్టుకుని తిరిగే మనుషులకు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించు. చక్కటి పేర్లు పెట్టగలవు కదా!’ – హేమంతి -
అలసిన తెలంగాణ ఆకాంక్షలు
విశ్లేషణ ఎన్నికల్లో గెలిచాక ఇకపై ఉద్యమ పార్టీ కాదు అని తెరాస ప్రకటన వెలువడిన క్షణం నుంచే తెలంగాణ ప్రజల వాంఛలకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. కలాలు తలవంచాయి. కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యమయ్యాయి. మూడున్నరేళ్ల కాలంలో ‘తెలంగాణ’ ఎంత వెలిగిందో తేటతెల్లంగా మాట్లాడుకోలేకపోయాం. ఎవరు, ఏది మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. ప్రతిపక్షం అని నిందించడం మామూలైంది. లేదా ఎవరో ఒకరితో ఖండింపచేయడం ఆనవాయితీగా మారింది. ఉద్యోగాలు, అన్ని రంగాలలో వాటా, తెలంగాణ ఆత్మగౌరవ భావన, విద్య, భాష, సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన రంగాలలో జరిగిన అవమానం, అన్యాయం ఉద్యమానికి ముఖ్య కారణాలు. ఐతే రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాం క్షల్ని పక్కన పెట్టి తెరాస అధినాయకుల అభీష్టాల కోసం, ప్రయోజనాల కోసమే పాలన ఆరంభమైంది. నేడూ అదే కొనసాగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఇప్పుడిక తెరాస ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించారు. అన్ని బూర్జువా పార్టీలలాగే ఎన్నికల పార్టీ అనే సంకేతం ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడే ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావలసింది. అందుకు వ్యతిరేకంగా పోరాటం జరగవలసి ఉంది. మావోయిస్టు ఎజండా మా ఎజండా అని ప్రకటించిన అధినాయకుల ప్రకటన ఆంతర్యాన్ని బట్టబయలు చేయవలసి ఉంది. కాని ఎందుచేతనో దాని గురించి ఆలోచించలేదు. అదిగో! అప్పటి నుండే తెలంగాణ ప్రజల వాంఛలకు, బతుకులకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. ఇరవై శాతం పాలక వర్గాల ప్రయోజనాల ముందు ఎనభై శాతం ప్రజల మత సాంస్కృతిక సాహిత్య చరిత్రలు దిగదుడుపు అయ్యాయి. ఎక్కడా, ఏ రూపంలోనూ ఆలనలో, పాలనలో తెలంగాణ మాటలేదు. అంతా అధినాయకుల కీర్తనే. తెలంగాణ ఆత్మాభిమానం తాకట్టు పెట్టి వందకోట్లతో తెలుగుకు తారాజువ్వల వెలుగులు అద్దారు. ఆనాటి ఉద్యమ భావనలకు ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధం. ఇప్పుడు ‘పులగం పెడుతానన్న దొర సొట్ట గిన్నె కూడ లాక్కుపోయిండన్న’ చందంగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు బాగోలేవు. అందుకే పాత నానుడులు, జాతీయాలు, సామెతల వాడుక మెల్లి మెల్లిగా మొదలైంది. ఒక కొత్త విచారధార వారి పదాల్లో తొంగి చూస్తోంది. మాకు మా అసలు తెలంగాణ, కోరిన తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణ ఆత్మరహిత తెలంగాణ. ప్రజల అస్తిత్వం, కాంతి లేని రోల్డు గోల్డు తెలంగాణ వచ్చింది. వచ్చింది పాలకవర్గాల తెలంగాణే. ఇది ప్రజలు ఊహించని పరిణామం. మరోసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేర ఏర్పడిన పార్టీ, ప్రభుత్వం చేతిలో ఓడినట్లుగానే లెక్కిస్తున్నారు. ‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’ అన్నట్టు కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి ‘నియ్యత్ లేని నిప్పులే’ కానీ చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. ‘రోశాల పాటగాడికి వేశాలు మెండు’ అనే సామెత నిజం అయ్యిందని జనం బాధపడుతున్నారు. ఆనాడు పాటలు పాడిన, ఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడు తనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించిపోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. ఇప్పుడు, తెలంగాణ ఆత్మ, నాలుగు కోట్ల ప్రజల గుండెలను తట్టి లేపుతున్నది. ఉమ్మడి పాలనలో ‘మిస్’ అయిన సన్మానం, ప్రతి శాలువ తనకే కావాలని సర్కారీ కవులు కంకణబద్ధులయ్యారు. ఈ మూడున్నరేళ్ళలో కవుల మతలబు ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘నాలిక మీద ప్రేమ. నాభి కాడ కోపం’ కలిగిన పాలకుల అసలు స్వభావం అర్థం చేసుకున్నారు. ‘తొండకు దొరతనమిస్తే ప్రహరి గోడ మీద సవారి చేసింద’నే నానుడిని, ‘ఊసరవెల్లి అసలు రంగు మోసమే’ అని తేటతెల్లంగా గ్రహించారు. తెలంగాణలో జరగవలసినవి తక్కువ జరిగాయి. జరగకూడనివి అతి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి మధ్య సమతౌల్యం లేని కారణంగా తెలంగాణలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. అశాంతి గాలులు వీస్తున్నాయి. ఇప్పుడు ఏ పార్టీ, ఏ పంథా అయినా మరోసారి ‘తెలంగాణకు సై’ అంటుందో వారికే ఇక్కడ భవిష్యత్తు ఉంది. ఎన్నికలు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల పూర్తి కాని ఆకాం క్షలే ప్రధానం. ఇప్పుడు అధికారం కోసం రాజకీయాలు ఆపి పరిపూర్ణ తెలంగాణ కోసం పోరాడాలి. జైళ్ల కైనా వారు వెళ్లగలగాలి. ‘నూతిలో తుపాకి గుండేసి తూటు చూపియ్యి అన్నాడట’ వెనకటికో దొరగారు. ఆనాటికది సామెత! నేడు ప్రజలు తమ గుండెలు విప్పి చూపి అన్నీ తూటులే అని అంటున్నారు. తెలంగాణలో బంగారం అంతా ఎక్కడ ఎక్కువగా కుప్ప కూడుతున్నదో కళ్లు విప్పి చూస్తున్నారు. మొలిచే కొమ్ములను వంచడానికి మార్గం వెదుకుతున్నారు. చల్లబడిన సిద్ధాంతాలను పెనం మీద కాదు, అగ్గి కొలిమిని రాజేసి పరీక్షిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం గతం కాదు. అది రేపులో కదలాడుతున్నది. ‘గురిజెత్తు ఆశయం, గురి చూసి కొట్టే అమ్ముల పొది’లా ఉంది పరిస్థితి. తెలంగాణ ఎన్నడూ పాలకులకు సింహస్వప్నమే. అసలు సిసలు తెలంగాణ సాధన కోసం ఉద్యమం కొనసాగింపు దిశగా కదులుతుందా? తిరుమల రావు వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 99519 42242 -
క్రాంతిమయ పర్వదినమే సంక్రాంతి
తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప క్రాంతిమయ పర్వదినం సంక్రాంతి. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. మన కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా పొరపొచ్ఛాలు, భేదాభిప్రాయాలు ఉంటే అవి తొలగిపోయి అందరూ కలిసి మెలిసి జరుపుకునే పర్వదినాలే పండగలు. ‘సంక్రాంతి’ అనడం లో ‘‘సం’’ అంటే మిక్కిలి ‘‘క్రాంతి’’ అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని ‘సంక్రాంతి’ గా పెద్దలు వివరణ చెబుతూ ఉంటారు. అన్నదాతలు సంవత్సరమంతా కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకు చేరి, తద్వారా ధనలక్ష్మి నట్టింట కొలువుదీరే పండుగ మన సంక్రాంతి పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగ బంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే చేరటం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణ ం. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయణం. పన్నెండు నెలలలో ఆరు నెలల దక్షిణాయణం దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకుని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంతటి మహత్తరమైన పర్వదినం మకర సంక్రాంతి లేక పెద్ద పండుగ. ఈ పండగను భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలలోనే కాక, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో కూడా పాటిస్తారు. మనకు వచ్చే పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి పాటించే పండుగ. మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాï్రÙ్టయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. ఉత్తరాయణంలో సూర్యుని గమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమంగా పెరుగుతూ వస్తుంది. సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే సూర్యుని కిరణాలు ఎక్కువగా సోకినా మంచిదికాదు. ఎందుకంటే సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధ క్యాన్సర్‌ను ఇతర రుగ్మతలను కలిగిస్తాయి. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా వచ్చే కాలం ఇదే! ముఖ్యంగా మధ్య దినమైన రోజును ‘సంక్రాంతి’ అని పిలుచుకుంటాం. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగ పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహప్రాంగణాలతో, ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. పుష్యం అంటేనే పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు ఈ దినాలలో నిర్వర్తించాలి. సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. కాలచక్రానికి అనుగుణంగా సంచరిస్తూ ఉండే దేవతా స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి రావడమే మకర సంక్రమణం. అదే మకర సంక్రాంతి. సూర్యోదయానికి ముందే నువ్వులపిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాల బాధలు నివారించుకోవడానికి స్నానజలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయి న వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదలడం ఆచారం. మహిళలు ఎంతో అందంగా రంగవల్లులు తీర్చిదిద్దే రోజు సంక్రాంతి. దానికి ఆరోగ్య రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా ఎంతో ప్రాముఖ్యం ఉందని పెద్దలు చెప్తారు. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతంగా భావిస్తే, ఒక పద్దతిలో పెట్టే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం గా చెప్తారు. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుని స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితిశక్తికి (స్టాటిక్ ఫోర్స్) చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్) కు సంకేతాలనీ.. శ్రీచక్ర సమర్పణా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. మన నేటి మహిళ లు కాంక్రీట్ జంగిల్స్‌లో నివసిస్తూ రంగవల్లుల సంస్కృతిని మరచిపోకుండా రంగవల్లుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి నాడు దేవతలకూ, పితృ దేవతలకూ ఏయే పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకి సిద్ధిస్తాయని నమ్మకం. మగపిల్లలు పతంగులు (గాలి పటాలు) ఎగురవేసి ఆనందిస్తారు. ఇంటి ఆచారం ప్రకారం స్త్రీలు సావిత్రీ వ్రతం లాంటి నోములను నోచుకుంటారు. దీనివల్ల కుటుంబసౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సౌభాగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇరుగు పొరుగులను పిలిచి పండు తాంబూలాలను, నువ్వుండలను ఇచ్చి పెద్దల దగ్గర ఆశీర్వాదాలను తీసుకొంటారు. కొందరు సంక్రాంతి నాడు రాముని పూజచేస్తారు. రామునిలాగా ధర్మమార్గంలో నడవడానికి శక్తి కలగాలని రామాయణాన్నీ పఠిస్తారు. బలిచక్రవర్తికి ఉన్న త్యాగగుణం అలవడాలన్న కోరికతో వామన పురాణాన్ని కూడా వింటారు. తెలంగాణ అంతా నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవే కాక ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, తిలలు, వస్త్రాలు, తైలదీప దానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడి కాయను దానంచేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు తీరుతాయి. బుద్ధి వికాసం కలుగుతుంది. సంక్రాంతికి కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువును తీర్చి పేరంటాలూ చేస్తారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పన్నెండు సంవత్సరాలు బాలునిగా, వీర పద్మాసన భంగిమలో కూర్చుని, కుడిచేతిని చిన్ముద్రగా చేసుకుని ఆ కొండమీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్పలందరూ శబరిమలై చేరి మకరవిళక్కును నిర్వర్తించి మకరజ్యోతి దర్శనం చేసుకోవడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలకు, ఇంత విశిష్టతకు కారణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే కాబట్టి, ఆయనకు కృతజ్ఞతా సూచకంగా సంక్రాంతినాడు సూర్యభగవానుడిని పూజిస్తారు. శ్రద్ధాభక్తులతో ఆదిత్యహృదయాన్ని పారాయణ చేస్తారు. -
విన్నపాలు వినవలె.. వింతవింతలూ..!
1. హోస్టెస్ లియా 2. హోస్టెస్ హెదర్ పూల్ బస్సుకీ రైలుకీ తేడా ఉంటుంది. రైలుకీ విమానానికీ తేడా ఉంటుంది. అయితే బస్సైనా, రైలైనా, విమానం అయినా.. ప్రయాణికుల్లో మాత్రం తేడా ఉండదు! మనుషులం కదా. స్వభావాలన్నీ ఒకేలా ఉంటాయి. రోడ్డు మీద వెళుతున్నామని ఒకలా, పట్టాలపై జారుతున్నామని ఒకలా, గాల్లో ఎగురుతున్నామని ఒకలా బిహేవ్ చెయ్యం. బస్సులో, రైల్లో హోస్టెస్‌లు ఉండరు కాబట్టి మన వల్ల వారికి ప్రాబ్లం ఉండదు. విమానంలోనే.. పాపం ఎయిర్‌హోస్టెస్‌లు మనతో వేగవలసి వస్తుంది. ‘విన్నపాలు వినవలె వింత వింతలు’ అని అన్నమయ్య పాడినట్టు.. విమాన ప్రయాణికులు ఫ్లైట్‌లో కోరే కోరికలకు ఒక్కోసారి ఎయిర్ హోస్టెస్‌లకు మతిపోతుందట! అలా.. వాళ్లకు ఎదురైన కొన్ని అనుభవాలు ఎలా ఉన్నాయో చూడండి. నీతో కలిసి డ్యాన్స్ చెయ్యొచ్చా? హెదర్ పూల్ యు.ఎస్. ఎయిర్ హోస్టెస్. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక పెద్దాయన విమాన ప్రయాణంలో ఆమెను అడిగాడట.. ‘అమ్మాయ్... నీతో కలిసి నేనిక్కడ డాన్స్ చెయ్యొచ్చా?’ అని! ఇక్కడ.. అంటే ఫ్లయిట్ లోపల ప్రయాణికులు కూర్చునే రెండు వరుసల మధ్య ఖాళీ స్థలంలో! ఆ రిక్వెస్టుకు ఆమె ఒప్పుకుంది. ఆయనతో కలిసి డాన్స్ చేసింది. నిబంధలన ప్రకారం అయితే ఎయిర్‌హోస్టెస్ అలా చేయడానికి లేదు. ఈ సంగతిని హెదర్ పూల్ ‘క్రూయిజింగ్ యాటిట్యూడ్: టేల్స్ ఆఫ్ క్రాష్ప్యాడ్, క్రూ డ్రామా అండ్ క్రేజీ ప్యాజింజర్స్’ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఆ పుస్తకం.. కొన్నాళ్ల పాటు న్యూయర్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్‌గా నిలబడింది. ఈ నేప్కిన్ తనకి ఇవ్వగలరా? ‘8సి’లో ఒక అందమైన ప్రయాణికురాలు కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని చూసి అదే ఫ్లయిట్లో ఉన్న ఇంకో ప్రయాణికుడు మనసు పారేసుకున్నాడు. ‘ఐ లవ్ యు’ అని ఆమెకు చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పడానికి బిడియపడుతున్నాడు. ఎయిర్ హోస్టెన్ను పిలిచాడు. హోస్టెస్ లియా వోల్పే చిరునవ్వు నవ్వి ‘చెప్పండి.. మీకేం సహాయం చేయగలనో’ అని అడిగింది. నేప్కిన్ మీద తన పేరు, తన ఫోన్ నెంబరు రాసి, 8సి ప్యాసింజర్‌కు ఇవ్వమని కోరాడు! లియా వోల్పే అదే చిరునవ్వుతో, అతడిచ్చిన నేప్కిన్ తీసుకెళ్లి 8సి అమ్మాయికి ఇచ్చింది. నేప్కిన్ అందుకున్న అమ్మాయి బుగ్గల్లో సిగ్గులు, ఇక్కడ ఈ అబ్బాయి కళ్లల్లో మెరుపులు. ఫ్లయిట్ గమ్యానికి చేరాక.. ఆ అమ్మాయి, ఆమెకు ప్రపోజ్ చేసిన అతను ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. పిల్లాడిని పైనే ఉంచేయండి ప్లీజ్! నెత్తిపైన లగేజీ పెట్టుకునే ప్లేస్‌ని విమానాల్లో ‘ఓవర్‌హెడ్ బిన్’ అంటారు. ఫ్లయిట్ సిబ్బంది అంతా రెడీ అయి, లోపలి చెకింగ్స్ అన్నీ అయ్యాక ఫ్లయిట్ పైకి లేవబోతుండగా ఓవర్‌హెడ్ బిన్లో రెండు బ్యాగుల మధ్య ఒత్తేసినట్లున్న నెలల పిల్లాడిని చూసి ఎయిర్‌హెస్టెస్ హెదర్ పూల్ షాక్ తింది! ఆ బిడ్డను జాగ్రత్తగా రెండు చేతులతో కిందికి దింపి, తల్లి చేతుల్లో పెట్టింది. కానీ ఆ తల్లి.. ‘బేబీకి అక్కడ కంఫర్ట్‌గా ఉంది, అక్కడే ఉంచేయండి’ అని కోరింది. హెదర్ పూల్‌కి అది రెండో షాక్! ‘‘లేదు.. లేదు.. ఫ్లయిట్ నిబంధనలు ఒప్పుకోవు’ అని ఆ తల్లిని ఒప్పించడానికి పూల్ నానా తిప్పలు పడింది. మీ షూజ్ మెయిల్ చెయ్యండి..! ఏ వృత్తిలో ఉన్న వాళ్లు ఆ వృత్తిలోని సూక్ష్మమైన విషయాలను ఇట్టే గ్రహించేస్తుంటారు. ఓసారి ఫ్లయిట్లో ఓ ప్యాసింజర్.. ఎయిర్‌హోస్టెస్ హెదర్ పూల్ షూజ్‌ని గమనించి చెప్పాడు, ‘‘మీ షూజ్ రిపేరుకు వచ్చాయి. వాటిని ఓ బాక్స్‌లో పెట్టి నాకు మెయిల్ చెయ్యండి’ అని! హెదర్ పూల్ ఆశ్చర్యపోయి, తన షూజ్ చూసుకుంది. నిజమే. కాస్త దెబ్బ తిన్నాయి. షూజ్‌ని మెయిల్ చెయ్యమని చెప్పిన ఆ ప్రయాణికుడు ఓ ఫుట్‌వేర్ కంపెనీ ఓనర్. ‘ఇ–బే’లో ఎయిర్ హోస్టెస్‌లు వాడేసిన షూజ్కి మంచి ధర వస్తుంది. ఈ అడ్రెస్‌కి మీ షూజ్’ పంపండి అని అతడు తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్లాడు. మాబాధనుఅర్థంచేసుకోగలరా? ఓసారి విమానంలోకి హనీమూన్ జంట ఎక్కింది. ఆ కొత్త కపుల్ ఒకళ్ల చేతులను ఒకళ్లు క్షణమైనా వదిలిపెట్టి కూర్చోలేకపోతున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. మాటిమాటికీ హగ్ చేసుకుంటున్నారు. హోస్టెస్ లియా వోల్పే, వాళ్లను దాటుకుంటూ వెళుతుంటే ఆమెను ఆపి.. ‘మేము.. మైల్–హై క్లబ్ లో జాయిన్ కావచ్చా?’ అని అడిగారు. దీనర్థం ఏంటంటే.. కొన్ని నిమిషాల సెక్స్‌కి మాకు ఏకాంతం కల్పించగలరా అని! (విమానంలో ప్రయాణిస్తూనే సెక్సువల్ ఇంటర్కోర్సులో పాల్గొనడాన్ని ‘మైల్–హై’ అంటారు). పాపం మన హోస్టెస్.. ఆ దంపతుల బాధను అర్థం చేసుకున్నారు. తన బాధలేవో తను పడి వారికి అక్కడే ఓ మూల.. కొన్ని నిమిషాల పాటు ఏకాంతం కల్పించగలిగారు. ఒక్కటికూడాకాల్చలేదుతెలుసా?! విమానం ఎక్కే ప్రయాణికులు ఎవరైనా మొదట తెలుసుకోవలసింది.. విమానం లోపల సిగరెట్ తాగడానికి ఉండదని. కానీ ఓ ప్రయాణికుడైతే కాళ్లా వేళ్ల పడినంతగా హెదర్ పూల్‌ను ప్రాధేయపడ్డాడు. ‘సిగరెట్ తాగకుండా ఐదు గంటలు ఫ్లయిట్లో కూర్చొవడం నా వల్ల కావడం లేదు. నాలుక పీకేస్తోంది. ల్యావెట్రీలో కూర్చొని ఒక్క సిగరెట్ తాగొస్తాను ప్లీజ్’ అని అడిగాడు. డోర్ దగ్గర అతడు యాష్ ట్రే చూశాడట. అందుకనే అడిగాడు. కానీ ఆ ట్రే.. సిగరెట్ తాగాలనుకున్న వాళ్ల కోసం కాదు. దొంగచాటుగా సిగరెట్ తాగుతూ పట్టుబడిన వాళ్ల ‘పీకల్ని’ లాగి అందులో పడేయడానికి. ట్రాష్ క్యాన్‌లో ఆ సిగరెట్ పీకను వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని యాష్ ట్రే పెడతారు. ఇక్కడ కోడిగుడ్లు దొరుకుతాయా? ఒక ప్రయాణికురాలు కోడిగుడ్ల కోసం పట్టుపట్టింది. ‘సారీ మ్యామ్. స్టాక్ అయిపోయింది’ అని చెప్పిన పూల్ మీద గుడ్లు ఉరిమింది. ‘నా వెకేషనంతా పాడు చేశావ్ పిల్లా’ అని అర్థం వచ్చేలా తిట్ల దండకం ఎత్తుకుంది. బిజినెస్ క్లాస్‌లో గుడ్లు లేకపోవడం ఏంటని పెద్దగా అరిచేసింది. ‘‘పిల్లలకు గుడ్లు తినిపించడానికి లేదు. ఎంత పాపిష్టిదాన్ని, ఫ్లయిట్లో ఉంటాయిలెమ్మని గుడ్డిగా ఎక్కేశాను’’ అని కూడా ఆమె బాధపడిందట! పూల్ కూడా ఆ మాటకు ఫీల్ అయింది. కానీ తను మాత్రం ఏం చేస్తుంది? కోడిగుడ్ల కోసం అప్పటికప్పుడు ఫ్లయిట్‌ని ల్యాండ్ చేయించలేదు కదా. ఒక ఫ్లాజుంటివ్వమ్మో! డెంటల్ ఫ్లాస్ అంటే.. పళ్లను క్లీన్ చేసుకోడానికి వాడే సన్నటి దారం. మనం పుల్లలు పెట్టి పళ్లను గిల్లేస్తుంటాం కానీ, విదేశీయులలో చాలామందికి ఫ్లాస్ అలవాటు. ఏ రేంజ్ అలవాటంటే... పక్కవాళ్లను ‘ఓ ఫ్లాస్ ఉంటే ఇద్దురూ’ అని అడిగేంత అలవాటు. అప్పుడప్పుడు విమాన ప్రయాణికులు కూడా కొందరు.. ‘ఒక ఫ్లాజుంటివ్వమ్మో’ అని ఎయిర్ హోస్టెస్‌ని రిక్వెస్ట్ చేస్తుంటారట! పూల్‌కి కూడా ఇలాంటి అనుభవాలు ఒకటీ అరా ఉన్నాయి.‘వింతగా ఉంటుంది.. వాళ్లు మనల్ని ఫ్లాజ్ అడగడం, మనం వెళ్లి వాళ్ల కోసం ఇంకొకరిని ఫ్లాజ్ అడగడం’ అని నవ్వుతూ అంటారు పూల్. డాక్టర్ పెప్పర్ అండ్ రెడ్ వైన్ డాక్టర్ పెప్పర్ అనేది అమెరికన్ సాఫ్ట్ డ్రింక్. ఇక రెడ్ వైన్ అంటే తెలిసిందే. చిక్కటి ద్రాక్ష రసం. (మన భాషలో ద్రాక్ష సారాయి). ఈ రెండిటినీ మిక్స్ చేసి ఇమ్మని అడుగుతుంటారట కొంతమంది ప్రయాణికులు! అదేం కాంబినేషనో మరి. తర్వాత్తర్వాత ఎయిర్ హోస్టెస్ పూల్‌కి అర్థమైందట.. ఈ కాక్టైల్ ఫేమస్ అని. అన్నట్టు ఈ కాక్టైల్కో ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. కానీ లైకులే.. తక్కువ. ఇదేమంత వింత రిక్వెస్టు కాదు కానీ, కొన్నిసార్లు.. కాక్టైల్ సరిగా మిక్స్ అవలేదని ఎయిర్ హోస్టెస్‌ను తిడతారట! ప్లే గ్రౌండ్ లేకపోవడం ఏంటి?! ఒకావిడ పిల్లలతో ఫ్లయిట్ ఎక్కారు. ఫ్లయిట్ టేకాఫ్ అయింది. పిల్లలు ఆటలు మొదలు పెట్టారు. అన్నీ అవుట్ డోర్ గేమ్సే! ఆ తల్లి.. మన హోస్టెస్ హెదర్ పూల్‌ను పిలిచింది. ‘ఆట స్థలం ఎక్కడ?’ అని అడిగింది! పూల్ వేరే వైపు చూస్తూ నవ్వు ఆపుకుంది. ‘విమానంలో ఆట స్థలం ఉండదు మ్యామ్’ అని చెప్పింది. ఆ తల్లి చికాకు పడింది. ‘ఇంత పెద్ద విమానంలో ప్లే గ్రౌండ్ లేకపోవడం ఏమిటి?’ అని విసుక్కుంది. ‘ఇకనైనా ప్లే ఏరియాకు ప్లేన్‌లో కొంత ప్లేస్ ఉంచండి’ అని సలహా ఇచ్చింది. పూల్ ఏమంటుంది? ‘సరే మ్యామ్’ అంది. నాకేదోఅవుతోంది!అక్సిజన్తక్కువైందా? ఫ్లయిట్ టేకాఫ్ అవగానే ఓ పెద్దాయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ‘‘ఇక్కడేంటో తేడాగా ఉందమ్మాయ్. ఈ ప్రయాణమంతా నేనిలా ఆక్సిజన్ మాస్క్ పెట్టునే ఉండాలా?’’ అని వోల్పేని అడిగారు. ‘అవసరం లేదండీ.. ఎమర్జెన్సీలో ఎలాగూ ఫ్లయిట్లో అదనపు ఆక్సిజన్ ఉంటుంది’’ అని వోల్పే చెప్పింది. అయినప్పటికీ ప్రయాణమంతా ఆయన బ్రీథింగ్ ఎక్సర్సైజ్లు చేస్తున్నట్టుగా ఛాతీ నిండా గాలి పీల్చి వదులుతూనే ఉన్నారు. ఫస్ట్ టైమ్ ఫ్లయిట్ జర్నీలో కొందరికి ఇలా ఉండడం సహజమేనని వోల్పే నవ్వుతూ ప్రయాణికులకు ధైర్యం చెప్పేవారట. నాదినేనివ్వను..నీదినాక్కావాలి! ‘చార్జర్ ఒకసారి ఇస్తారా?’ అని అడిగేవారు ఎక్కడైనా ఉంటారు. విమానంలోనూ ఉంటారు. కానీ తన చార్జర్ అడిగితే మాత్రం చిరాగ్గా ఉంటుందట పూల్‌కి. ఎవరికి ఇచ్చానో గుర్తు తెచ్చుకుని వెళ్లి అడిగి తెచ్చుకునేంత టైమ్ ఉండదని ఆమె బాధ. నిజమే. హోస్టెస్ ఉన్నది విమాన సేవలు అందించడానికే కానీ, వ్యక్తిగతంగా సేవలు అందించడానికి కాదు కదా. ఒకవేళ అందించాలన్నా ప్రతిసారీ అలా కుదరదు. ఈ విషయం గ్రహించలేక కొంతమంది హోస్టెస్‌ల మీద మండిపడుతుంటారు. నిందలు వేస్తుంటారు. ఎవరి వస్తువులూ వారు ఇవ్వరు కానీ, అప్పుడప్పుడు తన జంప్ సీట్ (వేరుగా ఉండే సీటు)లో ఉండే ఎగ్ మెక్మఫిన్స్ మాయం అవుతుంటాయట! ఏమిటో ఈ మనుషులు అని నవ్వుతారు పూల్. -
బలమైన కోరిక కాబట్టే నెరవేరిందేమో!
‘‘పెద్దయ్యాక నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్?’’ అని చిన్నపిల్లలను అడిగితే, డాక్టర్ అనో, పోలీస్ అనో, హీరో అనో, హీరోయిన్ అనో.. ఇలా ఎవరికి తోచినది వాళ్లు చెబుతుంటారు. తమన్నా అయితే ‘నేను డాక్టర్ అవుతా... హీరోయిన్ అవుతా’ అని రెండు కోరికలు చెప్పేవారట. ఆ విషయం గురించి తమన్నా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడించాలని ‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని అడుగుతుంటారు. అప్పుడు పిల్లలు వాళ్ల నోటికి ఏది వస్తే అది చెప్పేస్తారు. చిన్నప్పుడు చెప్పిన ప్రొఫెషన్స్‌లో పెద్దయ్యాక సెటిల్ అయ్యేవాళ్లు ఏ కొద్దిమందో ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి. నన్నే తీసుకోండి. డాక్టర్, యాక్టర్ రెండు ప్రొఫెషన్స్ గురించి చెప్పేదాన్ని. కానీ, పెద్దయ్యాక వైద్య వృత్తి గురించి అస్సలు ఆలోచించలేదు. పదమూడేళ్ల వయసులో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చిన్నప్పుడు నేను చెప్పిన రెండు కోరికల్లో అది కూడా ఒకటి కాబట్టి, ఒప్పేసుకున్నాను. బహుశా ఎక్కడో ఒక మూల హీరోయిన్ కావాలనే కోరికే బలంగా ఉండి ఉంటుందేమో. అందుకే డాక్టర్ని కాకుండా యాక్టర్‌ని అయిపోయాను. ఒకవేళ సినిమాలకు అవకాశం రాకపోయి ఉంటే అప్పుడు డాక్టర్‌గా సెటిలై ఉండేదాన్నేమో’’ అని చెప్పారు. -
ప్రతిసారీ కొత్తగా కావాలంటే ఎలా?!
సందేహం నా వయసు 32. పెళ్లయ్యి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మావారు సెక్స్‌లో చాలా హుషారుగా ఉంటారు. నాకూ ఇష్టమే. కాకపోతే ఆయన కొత్త కొత్త భంగిమలు కావాలంటారు. ఇంగ్లిష్ ముద్దులు పెట్టమని అడుగుతారు. నా ఛాతిని ప్రెస్ చేయాలని ఆశపడతారు. పైగా నేనే పైకి వచ్చి చేయాలంటారు. నాకవేమీ ఇష్టం ఉండదు. నావల్ల కాదు అని చెబితే ఆయన నిరుత్సాహపడుతుంటారు. నేనేం చేయను? ఆయన కోరినవి చేయడం వల్ల ఏ ఇబ్బందులూ ఉండవా? నేను తనని ఎలా తృప్తి పర్చగలను? - వసుంధర, వైజాగ్ కొందరు ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు అవతలివాళ్లు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే బలవంత పెట్టకూడదు. మెల్లగా చెప్పి ఒప్పించాలి. భార్యాభర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికి కావలసినట్టు ఇంకొకరు నడచుకోవాలి. కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా అవతలి వారి కోసం కొన్ని అలవర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. మీవారు కోరకూడని వేమీ కోరలేదు. అవి పెద్ద ఇబ్బందికర మైనవీ కావు. వాటివల్ల ఏ సమస్యలూ కూడా రావు. కాబట్టి మీరు తనని అర్థం చేసుకోండి. తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆయన్ని తృప్తిపర్చగలుగుతారు. భార్య దగ్గర కాకపోతే భర్త తన కోరికలను ఎవరి దగ్గర చెప్పగలడు! కాబట్టి మీరు సిగ్గు, బిడియం వదిలి మీవారిని అనుసరిస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. నా వయసు 38. మా వారి వయసు 40. ఇద్దరం ఆరోగ్యంగానే ఉంటాం. అయితే నాకు పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. దాంతో సెక్స్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటోంది. మావారి అంగం పూర్తిగా లోనికి వెళ్లడం లేదు. దాంతో ఆయనకి, నాకు కూడా అసంతృప్తిగా ఉంటోంది. ఇద్దరం తృప్తి పొందడానికి వేరే ఏదైనా పద్ధతి ఉందా? లేదంటే నా పొట్ట తగ్గడానికి ఏదైనా మార్గం ఉందా? - సువర్ణ, తాడిమర్రి భార్యాభర్తల్లో ఎవరికైనా పొట్ట బాగా పెద్దగా ఉన్నప్పుడు, అది అడ్డు పడు తున్నప్పుడు సెక్స్‌లో ఇబ్బంది, అసంతృప్తి ఉండటం సహజం. అంతేకాక అధిక బరువు వల్ల, సెక్స్ చేసే సమయంలో ఆయాసం, ఇబ్బందిగా ఉండటం, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు కూడా ఉండవచ్చు. మొదట మీరు పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికోసం వాకింగ్, యోగా, అబ్డామినల్ వ్యాయామాలు చేస్తూ... మితాహారం తీసుకుంటూ... అవసరమైతే జిమ్, ఏరోబిక్స్ వంటివి కూడా చేస్తూ ఉంటే పొట్ట తగ్గుతుంది. అంత వరకూ వేరే భంగిమల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీరు మోకాళ్ల మీద వంగితే ఆయన వెనక నుంచి అంగ ప్రవేశానికి ప్రయత్నించ వచ్చు. లేదంటే ఆయన కింద, మీరు పైన ఉండి చేయవచ్చు. నా వయసు 25. పెళ్లై సంవత్సరం కావస్తోంది. ఈ మధ్య నీరసంగా ఉంటోందని పరీక్ష చేయించుకుంటే హెచ్.బి.ఎస్.ఎ.జి.పాజిటివ్ అని వచ్చింది. ఇది అంటువ్యాధి అంటున్నారు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మావారికి శారీరకంగా దగ్గర కావొచ్చా? - నళిని, గణపవరం, గుంటూరు హెచ్.బి.ఎస్.ఎ.జి. పాజిటివ్ అంటే హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది రక్తం ద్వారా లేదా సెక్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. సరిగ్గా పరీక్ష చెయ్యని రక్తం ఎక్కించడం లేదా ఒకరికి వాడిన సిరెంజులే మరొకరికి వాడటం వల్ల కూడా వ్యాపించవచ్చు. మీకు ఉంది కాబట్టి మీ వారికి కూడా ఉందో లేదో నిర్ధారించు కోవాలి. మీ వారికి కూడా వెంటనే పరీక్ష చెయ్యించండి. ఆయనకి కూడా ఉంటే... ఇద్దరూ ఒకేసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును సంప్రదించండి. ఇన్ఫెక్షన్ పాతదా లేక ఇప్పుడు మీ రక్తంలో ఆ వైరస్ యాక్టివ్‌గా ఉందా అన్నది తెలుసు కోవాలి. దానికోసం హెచ్‌బీఎస్ వైరల్ లోడ్ టెస్ట్, అలాగే లివర్ పైన ఏమైనా ప్రభావం ఉందా అన్నది తెలుసుకోడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని, దాన్నిబట్టి చికిత్స తీసుకోవాలి. మీవారికి లేకపోతే... హెపటైటిస్ వ్యాక్సిన్ మూడు డోసులు ఇప్పించండి. సమస్య తీరేవరకూ కలయిక సమయంలో కండోమ్ తప్పక వాడండి. నా వయసు 22. మరో మూడు నెలల్లో మా మేనమామతో నా పెళ్లి జరగబోతోంది. మేనరికం వల్ల చాలా సమస్యలు వస్తాయని, పిల్లలు లోపాలతో పుడతారని అంటారు. కానీ మేం చాలా పేదవాళ్లం. కాబట్టే ఇలా చేసుకో వాల్సి వస్తోంది. పిల్లలు బాగా పుట్టాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కలయిక సమయంలో ఏవైనా ప్రత్యేక పద్ధతులు పాటించాలా? మందుల వంటివి వేసుకోవాలా? - లక్ష్మి, కర్నూలు మేనరికం వల్ల అందరు పిల్లల్లోనూ అవయవ లోపాలు ఉండాలనేమీ లేదు. సాధారణంగా బిడ్డ ఏర్పడేటప్పుడు... తల్లిలో ఉండే 46 క్రోమోజోముల నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు సంక్రమిస్తాయి. ఈ క్రోమోజోముల మీద శరీరంలో ఉన్న ప్రతి అవయవం, వాటి పనితీరు, రంగు, రూపునకు సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఈ జన్యువుల్లో కొన్ని, కొన్నిసార్లు మార్పు చెంది డిఫెక్టివ్ జీన్సగా మారతాయి. అవి ఒకే కుటుంబంలోని పిల్లలకు సంక్రమిస్తాయి. అదే కుటుంబంలోని వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల డిఫెక్టివ్ జీన్స్ రెండు తల్లిదండ్రుల నుంచి బిడ్డకు సంక్రమించినప్పుడు... జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదృష్టం కొద్దీ ఒకటే డిఫెక్టివ్ జీన్ సంక్రమిస్తే సమస్యలు రాకపోవచ్చు. పుట్టబోయే బిడ్డలో సమస్యలు వస్తాయా, రావా అనేది గర్భం దాల్చకముందే చెప్పడం కష్టం. అవి రాకుండా చేయడం కూడా మన చేతిలో ఉండదు. ఎందుకంటే కణాల విభజన అనేది లోపల జరిగే ప్రక్రియ. దాన్ని బయటి నుంచి... అంటే మందులు, ఇంజెక్షన్ల ద్వారా అరికట్టలేం. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు నుంచే రోజుకొకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం, గర్భం దాల్చిన తర్వాత మూడో నెలలో ఎన్.టి.స్కాన్, డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్, ఐదో నెలలో ఖీఐఊఊఅ స్కాన్, 2డి ఎకో చెయ్యించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఏవైనా అవయవ లోపాలు, కొన్ని రకాల జన్యు సమస్యలు ఉంటే తెలుసు కోవచ్చు. అంతేకానీ అవి రాకుండా చేయగల ప్రత్యేక మందులు, పద్ధతులు ఏమీ లేవు. నా వయసు 22. మావారూ నేనూ రోజుకి రెండు మూడుసార్లు కలుస్తాం. అయితే ఈ మధ్య ఎందుకో నాకు కోరిక కలగడం లేదు. మావారికేమో ఆ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. ఎక్కువసార్లు కావాలంటారు. కానీ నేను సహకరించలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఫీలింగ్స్ రావడం లేదు. ఏవైనా సెక్స్ వీడియోలు చూస్తే మాత్రం వెంటనే ఫీలింగ్ వస్తోంది. లేకపోతే రావట్లేదు. దాంతో మావారు విసుక్కుంటున్నారు. ఇలా చేస్తే వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. నాకు కోరికలు పెరగాలంటే ఏం చేయాలి? - ఊరు, పేరు రాయలేదు రోజూ చేసే పనిమీద ఆసక్తి తగ్గడం లేదా ఆలోచనలు వేరే వాటి మీదకు మళ్లడం జరిగినప్పుడో... లేదంటే పని ఒత్తిడి వల్లో సెక్స్‌మీద ముందు ఉన్నంత కోరిక కలగకపోవచ్చు. మీదింకా చిన్న వయసు. కాబట్టి కోరికలు పెరగడానికి అప్పుడే మందులు వాడాల్సిన అవసరం లేదు. మనసుని ఆహ్లాదంగా ఉంచుకుని, జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ, సంతోషంగా ఉండగలిగితే... కోరికలు అవే పుట్టుకొస్తాయి. మీరిద్దరూ ఎక్కువసేపు ఫోర్‌ప్లే చేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఫీలింగ్స్ పెరుగుతాయి. అలానే రోజూ ఒకేలా కాకుండా రకరకాల భంగి మల్లో సెక్స్ చేయడానికి ట్రై చేయండి. ముందు ఈ విషయం గురించి మీవారితో మనసువిప్పి మాట్లాడండి. ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకుంటూ సంతోషంగా ఉండండి. నేను బీఎస్సీ రెండో సంవత్సరం చదువు తున్నాను. నా సీనియర్ని ప్రేమించాను. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా తనకి శారీరకంగా దగ్గరయ్యాను. ఈ నెల పీరియడ్స్ రాలేదు. పరీక్ష చేయిస్తే గర్భవతినని తేలింది. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బంది. నువ్వులు తిన్నా, బొప్పాయి తిన్నా అబార్షన్ అయిపోతుందని నా ఫ్రెండ్ చెప్పింది. అది నిజమేనా? అవి తింటే నా సమస్య తీరిపోతుందా? - మానస, రాజమండ్రి తప్పు చేసి ఇప్పుడు భయపడితే ఏమి లాభం? నువ్వులు, బొప్పాయి తినడం వల్ల అబార్షన్ కాదు. నువ్వులు, ఇంకా పండిన బొప్పాయిలో విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మితంగా తినడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిని తింటూ కాలం వృథా చేసుకోవద్దు. రోజులు పెరిగేకొద్దీ లోపల బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది. మొదట్లో, అంటే రెండు నెలల లోపలే అయితే 98 శాతం మందుల ద్వారా అబార్షన్ అయిపోతుంది. ఆలస్యం అయ్యేకొద్దీ ఆ అవకాశాలు తగ్గుతాయి. తర్వాత డీ అండ్ సీ ద్వారా గర్భాశయాన్ని శుభ్రపర్చాల్సి వస్తుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. పైగా ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు ఏర్పడి తర్వాతి కాలంలో గర్భం ధరించడానికి ఇబ్బంది కావొచ్చు. కాబట్టి కనీసం ప్రభుత్వాసుపత్రికైనా త్వరగా వెళ్లి డాక్టర్ని సంప్రదించండి. నా వయసు 29. పెళ్లై ఏడేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా కలయిక సమయంలో నాకు యోని బాగా నొప్పి పుడుతోంది. చర్మం కూడా కట్ అవుతోంది. మావారికి కూడా అలానే అవుతోంది. పైగా ఆయన అంగం పైన చర్మం పొరలుగా ఊడుతోంది. ఇలా ఎందుకు అవుతోంది? దీనికి పరిష్కారం ఏమిటి? - ఓ సోదరి కలయికలో నొప్పి వస్తోంది, చర్మం కట్ అవుతోంది అంటున్నారు. మీవారికి కూడా అలాగే అవుతోంది కాబట్టి ఇద్దరికీ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. కొన్నిసార్లు దంపతులిద్దరిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, కలయిక ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు గైనకాలజిస్టును, మీవారు డెర్మటాలజిస్టును కలిసి సమస్య వివరిం చండి. తగిన చికిత్స తీసుకోండి. చికిత్స పూర్తయ్యేవరకూ దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా కలిస్తే, ఇన్ఫెక్షన్ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అలాగే తగ్గిన తర్వాత కూడా ఒక వారం పాటు కండోమ్ వాడటం మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
కలలు చెప్పే కథలు...
డ్రీమ్స్ కలలకు అర్థాలు ఉండవు. అన్వయాలు మాత్రమే ఉంటాయి. అన్వయం అంటే... అలా జరిగింది కాబట్టి, ఇలా కల వచ్చింది అనుకోవడం. లేదా ఇలా కల వచ్చింది కనుక అలా జరగబోతోందని భావించడం. కల కలే. నిజం నిజమే. రెంటికీ పోలిక లేదు. పొంతన లేదు. అయినప్పటికీ కలలు.. ‘తేలిగ్గా తీసి అవతల పడేయవలసిన’ కేటగిరీలో ఉండిపోలేదు! కలలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. కలలకు అర్థాలను వెతుకుతున్నారు. అంతరార్థాలను బయటికి లాగుతున్నారు. ఎంత వెతికినా, ఎంత లాగినా... కల అంతు చూడ్డం మనిషికి ఒక కలలానే మిగిలిపోయింది. మరి.. కొన్ని కలలెందుకు నిజం అయ్యాయి? కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి? కల నిజం అవడం యాదృచ్ఛికం కావచ్చు. నిజం కల అవడం... కలవరింత కావచ్చు. ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్. అవి కొత్త లోకాలను చూపిస్తాయి. కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి. కొత్త భయాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఉన్న భయాలనూ పోగొడతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం ఏమంటే.. తీరని కోరికలు కలలుగా వస్తాయని! వస్తాయి సరే. తీరినట్టు వస్తాయా? తీరనట్టే వస్తాయా? ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చు. ఫ్రాయిడ్ పందొమ్మిదో శతాబ్దపు ఆస్ట్రియా న్యూరాలజిస్టు. సైకోఎనాలసిస్కి పితామహుడు. కలల్ని ఆయన డీసైఫర్ చేశారు. కలల కొలనులో ఈతకొట్టి లోపల ఏం మున్నదీ పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నిటీనీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు. ఏ కలని, ఆ కలగానే ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట! ఫ్రాయిడ్ తర్వాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గూఢార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్. ఆయన 1,80,000 కలల్ని కాచి వడబోశారు. ‘టాప్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకం రాశారు. అందుల్లోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకు వచ్చే కొన్ని కలలను ప్రత్యేకంగా వేరు చేసి, వాటికి వాలెస్ చెప్పిన అర్థాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కలలు... అర్థాలు * ఎవరో తరుముతున్నట్లుగా వస్తే: లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని పరిష్కరించుకోలేక, దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అదే కలలో మీరు పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ, మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం. * ఏం చేయాలి? మీలోని జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకోడానికి ఇదొక అవకాశం. మీ శక్తి ఏమిటో గ్రహించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యండి. * నలుగురి మధ్య దిగంబరంగా...: ఇలా కల వస్తే.. మీరు గుర్తింపు కోరుకుంటున్నారని. అది మీకు లభ్యం కావడం లేదని! ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తపిస్తున్నారని. ఏం చేయాలి? ధైర్యం చేయాలి. జనం మధ్యకు రావాలి. చొరవ చూపాలి. మీ శక్తియుక్తుల్ని నిరూపించుకోవాలి. * పరీక్షకు ప్రిపేర్ కానట్లు...: జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొలేనేమో అనే భయం మీలో ఉంది. ఓడిపోతానేమో, నెగ్గుకు రాలేనేమో, వైఫల్యం చెందుతానేమో, పరాజయం పాలౌతానేమో అనే నెగిటివ అలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు అర్థం. * ఏం చేయాలి? మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను కలిపి విజయసాధనకు కృషి చెయ్యాలి. * దెయ్యాలు: కలలో తరచు దెయ్యాలు కనిపిస్తుంటే కనుక.. జీవితానికి, సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క. * ఏం చెయ్యాలి? మనుషుల్లో కలవాలి. మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలి. * గాలిలో ఎగురుతున్నట్లు: సామాజిక పోకడలకు అనుగుణంగా వెళ్లాలని ఈ కల సూచిస్తోంది. అదే సమయంలో జీవితంలోని సమస్యల విషయంలో ఓపికగా, నేర్పు ప్రద ర్శించాలని చెబుతోంది. * ఏం చెయ్యాలి? మన జీవితం మీద మనం అదుపు సాధించాలి. పట్టువిడుపులతో ఒడుపుగా విజయ శిఖరాలను అందుకోవాలి. * పడిపోయినట్లు: మంచం మీది నుంచి పడిపోయినట్లు కనుక కల వస్తే... నిజ జీవితంలో దేని కోసమో మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారని. ఆ ప్రయత్నం విఫలం కాకూడదని దృఢనిశ్చయంతో ఉన్నారని. ఏం చేయాలి? మీ మీద మీరు నమ్మకం ఉంచండి. జరిగేది జరగనివ్వండి. మీరు చేయదలచుకున్నది చేసేయండి. * పళ్లు రాలిపోతున్నట్లు వస్తే: పళ్లు (దంతాలు) ఆత్మవిశ్వాసానికి, శక్తికి సంకేతాలు. పళ్లు రాలిపోతున్నట్టు కల వస్తే, ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు ఏవో మీ నిజ జీవితంలో జరగబోతున్నాయని అర్థం. * ఏం చేయాలి? జీవితంలో మీరు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఈ కల సూచన కావచ్చు. లేదా మీరు పరిష్కరించుకోవలసిన ఒక సమస్యను మీకు గుర్తు చేయడం అంతరార్థం కావచ్చు. సమస్య పరిష్కారం కోసం పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నించండి. * పాములు: పాములు... దాగి ఉన్న భయాలకు చిహ్నాలు. పాములు కలలోకి రావడం అన్నది ఓ హెచ్చరిక కావచ్చు. పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కావచ్చు. * ఏం చేయాలి? భయాలను ధైర్యంగా ఎదుర్కోండి. జీవితంలో ఎదురవుతున్న అవరోధాలను నేర్పుగా తొలగించుకుంటూ ముందుకు వెళ్లండి. * మరణం: జీవితంలో ఊహించని పరిణామాలు ఏవో సంభవించబోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలి. ఒక ముగింపునకు, ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలు. * ఏం చేయాలి? మరణానికి సంబంధించిన కలలు ఆత్మపరిశీలనకు, ఎదుగుదలకు సోపానాలు. * అదుపు తప్పిన వాహనాలు: విజయానికి చేరువ చేసే దారిలో మీ ప్రయాణం అదుపు తప్పుతోందని అర్థం కావచ్చు. ప్రస్తుతం ఉన్న ఒక చెడు అలవాటు త్వరలోనే ఒక దీర్ఘ వ్యసనంగా మారబోతోందన్న దానికి ఇదొక సూచన కావచ్చు. * ఏం చేయాలి? రిలాక్స్ అవండి. పట్టు వదలండి. దూకుడు తగ్గించి మీ గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేయండి. ముందే కలగన్నారు! 1. అబ్రహాం లింకన్ తన హత్య గురించి. 2. కార్ల్ జంగ్ ప్రపంచ యుద్ధం గురించి. 3. ప్రిన్సెస్ డయానా తన దుర్మరణం గురించి. 4. ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ రిలేటివిటీ’ గురించి. 5. ల్యారీ పేజ్ గూగుల్ ఐడియా గురించి. 6. కొంతమంది అమెరికన్లు 9/11 ఘటన గురించి. సృజనాత్మక స్వప్నాలు (క్రియేటివ్ డ్రీమ్స్) ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్: రాబర్ట్ లూయీ స్టెవెన్సన్ ఈ పుస్తకాన్ని తనకొచ్చిన కల ఆధారంగా రాశారు! అలా తొలి చిత్తు ప్రతిని కేవలం మూడు రోజుల్లో ఆయన పూర్తి చేశారట. కుబ్లా ఖాన్: సామ్యూల్ టేలర్ కొలెరిడ్జ్.. ఓపియం మత్తులో నిద్రలోకి జారి కనిన కలలోంచి గుర్తు చేసుకున్న సంఘటనల ఆధారంగా కుబ్లా ఖాన్ అనే కవితను రాశారు. టెర్మినేటర్: జేమ్స్ కామెరాన్ జ్వరంలో ఉన్నప్పుడు వచ్చిన కథ ఆధారంగానే టెర్మినేటర్ సినిమా తయారైంది. ఫ్రాంకెయిన్స్టెయిన్: మేరీ షెల్లీ చారిత్రక నవల ఫ్రాంకెయిన్స్టెయిన్ 1816లో ఆమెకు వచ్చిన ఒక కల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ పుస్తకం 1818లో పబ్లిష్ అయింది. ట్విలైట్ సీరీస్: 2003 జూన్ 2న స్టెఫీన్ మేయర్‌కి వచ్చిన ఒక కలే, ఆ తర్వాత ‘ట్విలైట్’ సీరీస్‌కి కథాంశం అయింది. కల వచ్చిన మూడు నెలల్లో ఆమె తొలి పుస్తకాన్ని పూర్తి చేశారు. -
పోరాటాలే శరణ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు వాస్తవరూపం ఇవ్వడానికి పోరాటాలు త ప్ప మరో మార్గం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ రెండో వార్షికోత్సవానికల్లా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీపీఎం.. ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీనిద్వారా దేశ ఎజెండాలోనే మార్పు వచ్చిందన్నారు. ఫ్యూడల్ పాలన వల్ల ఎదురైన సమస్యలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ వచ్చిందన్న సంతోషం తప్ప ఏడాదిలో సాధించినదేదీ కనిపించట్లేదన్నారు. నియంతృత్వం దిశగా మోదీ సర్కార్.. ప్రధాని మోదీ విధానాలతో కేంద్రం నియంతృత్వం దిశగా సాగుతున్నట్లుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దిగజారుతూ కొత్త రకమైన ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీడబ్ల్యూజేఎఫ్, హేచ్యూజేల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
కోర్కెల ఉచ్చు
బౌద్ధవాణి అన్ని దుఃఖాలకీ కోరికలే కారణం అనేది బుద్ధుడు చెప్పిన సత్యం. ఈ కోరికలకు మనసే మూలం అంటాడు బుద్ధుడు. మనస్సును అదుపులో ఉంచి, దురాశాపూరితమైన కోర్కెల్ని మనస్సులోకి రానీయకుండా ఉంటే దుఃఖం కలగదని చెప్తాడు. ఒక దురాశ బయలుదేరితే, అది మరో దురాశను రేపి బందీగా చేస్తుందని అంటాడు.ఈ విషయం మీద ఒకసారి మాట్లాడుతూ, ‘‘భిక్షువులారా! హిమాలయ ప్రాంతాల్లో మనుషులుగానీ, కోతులుగానీ సంచరించలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మనుషులు తిరగలేని ప్రదేశాల్లో కోతులు మాత్రమే తిరుగాడే ప్రదేశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో వేటగాళ్లు జిగురు పూసిన ఉచ్చుల్ని ఉపయోగిస్తారు. తెలివి గలిగిన కోతులు కొత్తగా కనిపించే ఆ ఉచ్చుల జోలికి వెళ్లవు. కానీ ‘అదేందో చూద్దాం’ అనే తుంటరి కోతులు వాటిని పట్టుకుని చిక్కుకుపోతాయి. ఇలాగే ఒక కోతి వెళ్లి తన ఎడమ చేత్తో ఆ ఉచ్చును పట్టుకుని లాగింది. దాని చేయి ఆ ఉచ్చుకు అతుక్కుపోయింది. వెంటనే అతుక్కుపోయిన ఉచ్చును విడిపించుకోడానికి కుడిచేతిని ఉపయోగించింది. అదీ అతుక్కుపోయింది. చేతుల బలం చాలడం లేదనుకుని రెండు కాళ్లనూ ఉపయోగించి తన్నిపట్టి లాగింది. దాంతో రెండు కాళ్లూ అతుక్కుపోయాయి. ఇక లాభం లేదనుకుని ఉచ్చును కొరికేయాలని పళ్లతో ఉచ్చుతాడును గట్టిగా కొరికింది. చివరికి దాని మూతి కూడా అతుక్కుపోయింది. కోర్కెల వెంట పడడం కూడా ఇలానే ఉంటుంది’’ అని చెప్పాడు బుద్ధ భగవానుడు. దాంతో కోర్కెల వలలో చిక్కుకోవడం ఎంత ప్రమాదమో వారందరికీ తెలిసివచ్చింది. - బొర్రా గోవర్ధన్ -
కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి
ఒకే దేవుడికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ముంబైలో ‘లాల్బాగ్ చా రాజా’ వినాయకుడు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. ఈ వినాయకుడిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ఈ వినాయకుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ముంబై నగరంలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన ఈ విఘ్ననాయకుడిని ‘లాల్బాగ్ చా రాజా’ అనే పిలుస్తారు. అదే పేరుతో ఇక్కడ గణేషోత్సవ మండలి ఏర్పడి, ఎనిమిది దశాబ్దాలుగా గణనాయకుడికి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నాయి. ఇక్కడ ప్రతిష్టించబడిన వినాయకుడి ని ‘నవ్సాచా గణపతి’ అంటే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేర్కొంటారు. 1934 నుంచి ప్రారంభం... లాల్బాగ్ ప్రాంతంలో 1934లో తొలుత గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన సమయంలో భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం జోరుగా కొనసాగుతోంది. అందువల్ల తొలినాళ్లలో ఈ మండలిని ‘సార్వజనీక్ గణేషోత్సవ్ మండల్ లాల్బాగ్’ అని పిలిచేవారు. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి వెనుక పెద్ద కథ ఉంది. 1932లో ‘పెరు చాల్’ వద్ద ఉన్న మార్కెట్ మూతపడడంతో ఇక్కడి చిరు వ్యాపారులు, మత్స్యకారులు ఆందోళన చెందారు. మార్కెట్ కోసం తమకు మంచి స్థలం లభిస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని మొక్కుకొన్నారు. ఫలితంగా వారికి లాల్‌బాగ్‌లో ప్రాంతంలో స్థలం లభించింది. దీంతో ఇదే లాల్బాగ్ మార్కెట్లో 1934 సెప్టెంబర్ 12వ తేదీ న ఉత్సవాలు ప్రారంభించారు. తొలినాళ్లలో చిన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ఇదే నేడు మహామండలిగా ఎదిగి లక్షలాది భక్తులకు తీర్థస్థలంగా మారింది. కాగా, నాటి నుంచి నేటి వరకు రత్నాకర్ కాంబ్లీ వంశస్తులు లాల్బాగ్చా రాజా గణపతి విగ్రహాన్ని తయారు చేస్తూ వస్తున్నారు. స్వచ్ఛందసేవ.... లాల్బాగ్చా రాజా మండలికి భారీ మొత్తంలో వచ్చే డబ్బు, బంగారం, ఇతర కానుకలు, విలువైన వస్తువులను మండలి స్వచ్ఛందంగా సేవల కోసం వినియోగిస్తోంది. బీహార్‌లో వరదలు వచ్చినప్పుడు, 1962, 1968 యుద్ధ సమయాల్లో కూడా భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. విద్యా సంస్థల భవనాల నిర్మాణం కోసం కొంత ధనాన్ని కేటాయిస్తున్నారు. భారత సైన్యం కోసం 1990లో లక్ష రూపాయల నిధితో ‘ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్’ ను ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ ద్వారా యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు లాల్బాగ్చా రాజా ఆర్థిక సహాయం అందజేస్తుంది. లాల్బాగ్చా రాజా తమ సొంత వెబ్‌సైట్‌ను 2000 సంవత్సరంలో www.lalbaugcharaja.comపేరుతో రూపొందించింది. - జి.ఎస్. ఫొటోలు: పి.ఆర్, సాక్షి ముంబై -
విలువైన జీవితాన్నివ్యర్థంగా వృథా చేసుకోవద్దు
సృష్టిలోని అన్నింటికంటే మనిషి అంటేనే భగవంతునికి ఇష్టమట. ఎందుకంటే, మరేప్రాణీ భగవంతునికి రెండు చేతులూ జోడించి ప్రార్థించలేవు. కేవలం మనిషి ఒక్కడే ఈ పని చేయగలడు. తను సృష్టించిన మనిషి తన గురించి గొప్పగా భక్తిశ్రద్ధలతో కీర్తిస్తుంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తాడట. దేవుణ్ణి ప్రార్థించడమనే గొప్ప అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం? మనం చేసే ప్రార్థనలో అర్థంలేని కోరికలు, విపరీతమైన ఆశలు, దేవుడి నుంచి ఎక్కువగా ఆశించటాలూ ఇమిడి ఉంటాయి. మన కోరికలు తీరగానే దేవుడు కరుణించాడని సంబరపడతాం. తీరకుంటే దేవుడు లేడని, ఉంటే.. ఇలా తన కష్టాలను చూస్తూ కూర్చోడనే తీర్మానానికి వచ్చేస్తాం. కానీ నిజమైన ప్రార్థనకు అర్థం అది కాదు. ప్రతిఫలం కోరనిదే నిజమైన ప్రార్థన. మన ప్రార్థనకే దేవుడు కదులుతాడు. అందుకే మన ప్రార్థనల్లో విపరీతమైన కోరికలు ఉండకూడదు. కోరికలే లేనప్పుడు మనం బాధపడే ప్రసక్తే లేదు. మనకేం కావాలో, ఏం వద్దో ఆ భగవంతుడికి తెలుసు. మనం చేయవలసిందల్లా మనల్ని పుట్టించినందుకు, ఈ స్థితి కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థించడమే! ఎనభై నాలుగు లక్షల జన్మల తరువాత లభించిన అదృష్టం ఈ మానవ జన్మ. ఇంత గొప్ప జన్మ ద్వారా లభించే జీవితం ఒకే ఒక్కటి. అది మళ్లీ మళ్లీ రాదు. అలాంటి అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామన్న దానిని బట్టి జీవిత పరమార్థం ఉంటుంది. చిన్న పిల్లలకు ఏదైనా వస్తువిస్తే ఏం చేస్తారు? తెలిసీ తెలియనితనంతో దాన్ని ఏ కీలుకి ఆ కీలు విడదీస్తారు. దాని స్వరూపాన్ని మార్చేస్తారు. చివరికి అదెందుకూ పనికిరాకుండా పోతుంది. ఇది తెలిసీ మరోసారి పిల్లలకు అలాంటి వస్తువులు ఇవ్వం కదా! దాని విలువను తెలుసుకున్నారనే నమ్మకం కలిగిన తర్వాతే ఇస్తాం. భగవంతుని ఎదుట మనం కూడా పిల్లలమే! తండ్రిలాంటి భగవంతుడు పిల్లలం వంటి మనకు ఈ విలువైన జీవితాన్నిచ్చాడు. మనం ఈ అవకాశాన్ని సార్థకం చేసుకోవాలి. అంతే తప్ప విందు వినోదాలు, ఆటపాటలతో, కోపతాపాలతో, కాలక్షేపం కబుర్లతో, అహంకార మమకారాలతో, సుఖాలపై మోజుతో, అర్థంపర్థం లేని కోరికలతో నిస్సారం చేసుకోకూడదు. మళ్లీ అలాంటి అవకాశం లభించక పోవచ్చు. అందుకనే జీవితాన్ని చక్కగా వినియోగించుకోవాలి. మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఫలితం ఆశించకుండా పని చేసుకుపోవాలి. చేతనైనంతలో తోటివారికి సాయపడాలని చెబుతుంటారు బాబా. శ్రీసాయి చేసిన ఉపదేశాల సారాన్ని పరిశీలిస్తే అహంకారాన్ని వదులుకొమ్మనే హితోక్తే ఎక్కువగా వినబడుతుంటుంది. తాను కూడ గురువు పాదాల వద్ద అహంకారాన్ని వదులుకున్నాక కానీ పరిపూర్ణ మానవుడిని కాలేకపోయానని చెప్పుకున్న గొప్ప నిరాడంబరులు బాబా. మనిషికి అహంకారం దీర్ఘశత్రువు. సమతా లక్షణం మచ్చుకైనా కలగనివ్వని చెడ్డగుణం ఇది. ఈ గుణం ఉన్న మనిషి ఎవరినీ తనతో సమానమని, అందరిలోనూ దేవుడున్నాడని అనుకోడు. అలా ఆలోచించనివ్వకపోవడమే అహంకార లక్షణం. అహంకారం ఉన్న మనిషి తనకంటే బలహీనమైన వారిని లొంగదీసుకుని, తనకంటే బలవంతులైన వారిని బుట్టలో వేసుకుని ఇదే జీవితమనే ధోరణిలో గడిపేస్తాడు. ఈ రెండూ సాధ్యం కాని పక్షంలో మిగిలేది దుఃఖం. అహంకారంతో బతికే వారికి శాంతి ఉండదు. జీవితంలో శాంతిని పొందడం కంటే అదృష్టం మరొకటి లేదు. అందుకే నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునేవారు ఈ దుర్లక్షణాన్ని వదులుకోవాలని చెప్పే బాబా సూక్తి సదా స్మరణీయం. ఆచరణీయం. - డా. కుమార్ అన్నవరపు బాబా చెప్పిన మంచిమాటలు ఏకాగ్రతతో పని చేయండి. కార్యసాధనలో బద్దకం, అలసత్వం, సోమరితనం, వాయిదాలు వేసే తత్వాన్ని వీడండి. మనసును నిత్యం నిర్మలంగా ఉంచుకోందడి. అనవసర చర్చలు, వాదులాటలు, కీచులాటలు మానండి. మంచి పని చేసి అందులో ఉన్నతిని సాధించడానికి సదా ప్రయత్నించండి. ప్రశాంతంగా ఉండండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులూ వాటికవే కుదుటపడతాయి. సమయాన్ని వాగ్వివాదాలతో, వాదులాటలతో వృథా చేయవద్దు. కాలక్షేపం కబుర్లతో పొద్దుపుచ్చకండి. హారతి ఎందుకు? ఆలయంలోని మూలమూర్తికి ధూపదీపనైవేద్యాది సకలోపచారాలు సమర్పించాక, ఆ విగ్రహాన్ని ‘పాదాది శిరఃపర్యంతం’ వీక్షించటానికి అర్చకులు కర్పూర నీరాజనం సమర్పిస్తారు. మన ఇండ్లలో చేసుకునే పూజలలో కూడా భగవంతునికి హారతి సమర్పించడం పరిపాటి. ‘హారతి అంటే హరించుకుపోవడం’ అని అర్థం.‘పవిత్రమైనది’ అనే అర్థం కూడా ఉంది. భగవంతునికి మనకి మధ్య ఉన్న చీకటిని పారద్రోలేది కూడా (ఈ) హారతేనని ఆధ్యాత్మిక ప్రవచకులంటారు. హారతినే కర్పూర నీరాజనం అని కూడా అంటారు. నీరాజనం అంటే మిక్కిలి ప్రకాశింపచేసేది అని అర్థం. మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థ్థాలను సక్రమ మార్గంలో అవలంబించేలా శక్తినిమ్మని భగవంతుని ప్రార్థిస్తూ, హారతి ఇవ్వడం ఆచారం. ఆలయంలోని మూలమూర్తిని విద్యుద్దీపాల వెలుగులోగాక, హారతి ద్వారా దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవడం ఇందులోని అంతరార్థం కావచ్చు. ఆయన దర్శనం మంగళప్రదమైనది కాబట్టే దానిని మంగళహారతి అని కూడా అంటారు. -
వివేకం: ఆదుర్దా వాస్తవం కాదు
మీరు ‘ఆదుర్దా’ అనేది ఏమిటంటే, ఫలితం ఏమౌతుందోనని ఆందోళన పడటం. దేని ఫలితమైనా మీ కోరికలపై ఆధారపడి ఉండదు. మీరు చేసే విధానాన్ని బట్టి ఫలితం నిర్దేశింపబడి ఉంటుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో మీరు ఎంత అసమర్థులైతే, మీ ఆదుర్దా అంత ఎక్కువగా ఉంటుంది. అవునా, కాదా? మీకు మోటారు సైకిలు నడపడం రాదనుకుందాం. మీరు దానిపై కూర్చుంటే ప్రతిక్షణం ఆదుర్దా. అదే మోటార్ సైకిల్ ఎలా నడపాలో తెలుసనుకోండి, అది ఒక కలలా ఉంటుంది. కాబట్టి మోటార్ సైకిల్ కాదు మీ ఆదుర్దాకి కారణం. కేవలం మీరు దాన్ని నడపలేకపోవడం అనేదే ఆదుర్దాకు కారణం. కాబట్టి మీ ఆదుర్దాని సరిచేసుకుందామని చూడకండి. ఆదుర్దా అనేది నిజం కాదు. అది కేవలం కొంత చేతగానితనానికి పరిణామం. దేనినైనా మనం చేయాలని అనుకుంటే, మన సమర్థతను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఫలితం కోసం చేయడం కాదు. మీరు కేవలం విజయాన్ని కోరుకున్నంత మాత్రాన అది రాదు. మీకు ఉన్న యోగ్యతను బట్టి విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ భూమిపై ఏదైనా సఫలీకృతం కావాలంటే రెండు ప్రాథమిక విషయాలు పాటించాలి. అవి మీ భౌతిక శరీరాన్ని, మనసును పూర్తి సమర్థతతో ఉపయోగించగలగటం. ఇలా కనక జరగాలంటే మీరు స్వతహాగా ప్రసన్నంగా ఉండాలి. అలా ఉంటే మీ జీవితంలో మీరే ఒక సమస్య కాదని దాని అర్థం. మీరే సమస్య కాకపోతే బయటి విషయాలను తేలికగా ఎదుర్కోవచ్చు. మీరే కనుక ఒక సమస్య అయితే ఇక అన్నీ ఇబ్బందులే. ఈ భూమిపై ఎన్నో వేల సంవత్సరాల జీవితానుభవం ఉన్నప్పటికీ, మానవులు ఇంకా ఎన్నో సమస్యలతో ఉండటానికి కారణం, స్వతహాగా వ్యక్తులు తమకు తామే ఒక పెద్ద సమస్య కావడం వలన. వారు ఏదైనా సరిచేసి సమర్థించడానికి ప్రయత్నిస్తే, ఇంకా ఎక్కువ సమస్యలు సృష్టిస్తారు. మీకు మీరే ఒక సమస్యగా ఉన్నప్పుడు, మీరు దేనిని తాకినా అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి అన్నింటికంటే మొదటిది, ముఖ్యమైనది ‘ఇది’ అంటే ‘మీరు’ ముందు సరిగ్గా ఉండాలి. మీరు కనుక స్థిరంగా ఉంటే, అప్పుడు మనం ప్రపంచంలో అన్నీ సరిగ్గా చేయగలం. ప్రపంచం ఏ విధంగా ఉన్నా, మీరు మాత్రం స్థిరంగా ఉండగలరు. ఇలా ఉండటానికి ప్రతివారూ యోగ్యులు, అర్హులు; ఆ దిశగా అందరూ ప్రయత్నించాలి. మీరు ఈ దేశపు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా ఒక గొప్ప క్రీడాకారునిగా అవబోతున్నారా అనేది ముఖ్యం కాదు. అది అలా జరిగితే మంచిదే; కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కనీసం ఈ జీవితాన్ని హాయిగా జీవించగలగాలి. ఇలా ఉండటానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉంది. సమస్య - పరిష్కారం సద్గురూ! చిన్న చిన్న యోగసాధనాల వల్ల అనేక సమస్యలు దూరం చేసుకోవచ్చనుకుంటే, మరి ఆడవారు యోగా చెయ్యవచ్చా? - ఎస్ వసంత, సికింద్రాబాద్ సద్గురు: ఈ సమాజంలో కొన్ని కుటుంబాల్లో యోగా, ప్రాణాయామం లాంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు స్త్రీ ఆచరిస్తే భర్తకు దూరమైపోతుందని, కుటుంబం వదిలి బయటకు వచ్చేస్తుందనే మూఢ విశ్వాసం ఉంది. ‘నీకేమైనా జీవితం మీద విరక్తి పుట్టిందా? యౌవనంలో ఎందుకు యోగం, ధ్యానం?’ అంటూ యువతను తికమక పెట్టేవారూ ఉన్నారు. ‘‘శరీరం వయసులో ఉన్నప్పుడు, దాన్ని సంతోషాలను పొందడానికి ఉపయోగించుకోవాలి. శరీరం దేనికీ పనికిరాకుండా పోయినప్పుడు, ఆధ్యాత్మికంలో దించాలి,’’ అనే ఆలోచనలు పెరిగిపోయాయి. కాని వయసు దాటాక శరీరం సక్రమంగా పనిచేయకపోతే భోజనం సయించదు. తింటే జీర్ణం కాదు. కూర్చుంటే నిల్చోవడం రాదు. నిల్చుంటే కూర్చోవడం కష్టం. అలాంటి స్థితిలో ఆధ్యాత్మికమా? ఏం ఆలోచనలివి? యోగ వలన యౌవన ప్రాయంలో జీవితం మీద విరక్తి పుట్టదు. పైగా జీవితం మీద పరిపూర్ణమైన ప్రేమ జనిస్తుంది. భార్య అనే మనిషిని పనిచేసే యంత్రంగా, సుఖాలనిచ్చే మనిషిగా మాత్రమే భావించే వ్యవస్థను కుటుంబం అని ఎలా అంటాం? కుటుంబం అంటే ఒకరికొకరు భాగం పంచుకోవడం. భార్యాభర్తలిరువురూ పరస్పరం పూర్తి ప్రేమతో ఉంటేనే సహజీవనం సాఫీగా సాగిపోతుంది. ఇరువురూ కలిసి ఒకే దిక్కుకు పయనించాలి కదా! ఉత్తమమైంది ఆశించడానికి అందరూ అర్హులే!! - జగ్గీ వాసుదేవ్ -
టీటీడీకి ఎనభై వసంతాలు (1933 - 2013)
కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే శ్రీవేంకటేశ్వరుడుగా అవతరించాడు. కోట్లాది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి కరుణా కటాక్షాలను అందుకోవడానికి భక్తులను ఆహ్వానిస్తూ, ఎనభై వసంతాలుగా తన ఘనతను చాటుతోంది తిరుమలక్షేత్రం. 1933లో టీటీడీ ఏర్పడిన నాటి నుండి ఈ ఎనభయ్యేళ్లలో తిరుమల క్షేత్రం ఎన్నో మార్పులను సంతరించు కుంది. వాటిని ఓసారి అవలోకనం చేసుకుందాం... పూర్వం తిరుమలకొండను ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అనీ అనేవారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు, తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు తిరుమలేశుని సేవించి, భక్తులకు తమవంతు సేవలు అందించారు. ఇక ఆదిశంకరాచార్యులు, వైష్ణవ భక్తాగ్రేసరుడు రామానుజాచార్యులు, తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, పరమ భక్తుడు పురంధరదాసు, స్వామే సర్వస్వం అని భక్తితో పరితపించిన తరిగొండ వెంగమాంబ వంటి మహనీయులెందరో ఈ క్షేత్ర మహిమను ఇనుమడింపజేశారు. అభివృద్ధికి పునాదులు ఘాట్ రోడ్లే! 1944 ఏప్రిల్ 10న ప్రారంభమైన మొదటి ఘాట్‌రోడ్డు, 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్‌రోడ్డు తిరుమల అభివృద్ధిలో మైలురాళ్లు. మద్రాసు ఉమ్మడి రాష్ర్ట బ్రిటిషు గవర్నర్ సర్ ఆర్థర్ హూప్ నేతృత్వంలో భారతీయ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ఘాట్‌రోడ్డుకు రూపకల్పన చేశారు. తర్వాత రెండవ ఘాట్‌రోడ్డును కూడా నిర్మించడంతో తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు వేర్వేరుగా వెళ్లే అవకాశం కలిగింది. 1975లో రవాణా బాధ్యతలు ఆర్టీసీ చేతికి వెళ్లాయి. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు 3,200 ట్రిప్పులు సాగిస్తున్నాయి. నాడు పది నిమిషాల్లోనే దర్శనం... 1970కి ముందు భక్తులు పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. ఘాట్ రోడ్డులు వచ్చాక రోజుకు దర్శనానికి వచ్చే సంఖ్య రెండు వేలు అయితే, 2012 వచ్చేసరికి ఆ సంఖ్య లక్షల్లోకి మారింది. దాంతో దర్శనం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రద్దీని తట్టుకోవడానికి పాత పుష్కరిణి కాంప్లెక్స్ (పీపీసీ) పేరుతో నాలుగు షెడ్లు నిర్మించారు. 1980 నాటికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆలయానికి దక్షిణ దిశలో సాథూరాం మఠం, పూటకూళ్ల మిట్ట వంటి స్థానిక నివాసాలు తొలగించి, అక్కడే ఉన్న గజేంద్రమోక్షం పుష్కరిణిని పూడ్చివేసి 1983లో మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మాణం పనులు చేపట్టారు. 1985లో 31 కంపార్ట్మెంట్లతో భారీ క్యూకాంప్లెక్స్‌ని కట్టారు. దీంతో 20 వేల మంది భక్తులకు అన్ని మౌలిక వసతుల మధ్య స్వామి దర్శనం కోసం నిరీక్షించే సౌకర్యం కలిగింది. మరోవైపు తిరుమలలో సత్రాలు, కాటేజీలు, అద్దె వసతి సముదాయాలను వేగంగా నిర్మించింది టీటీడీ. 1998 నుంచి 2003వ సంవత్సరం మధ్య రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను నిర్మించారు. కానీ ఇప్పుడు ఇవి కూడా చాలటం లేదు. పది రకాలకుపైగా దర్శనాలు 2000 సంవత్సరం ముందు వరకు సర్వదర్శనం, రూ.50 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవల దర్శనాలే ఉండేవి. తర్వాత పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా సుదర్శనం కంకణ విధానం, ఆన్లైన్ రిజర్వేషన్‌ను రూపొందించారు. దేశ వ్యాప్తంగా ఈ-దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్లు కేటాయించే పద్ధతిని చేపట్టారు. అన్ని తరగతులకు చెందిన భక్తులకు పది రకాలకుపైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. శ్రీవారి కునుకూ కుదింపు మహంతుల కాలం (1843 నుంచి 1933)లో స్వామి నిదురకు గంటల సమయం ఉండేది. కానీ ఇప్పుడు పదినిమిషాలు కూడా విశ్రాంతి లభించట్లేదు. తప్పని పరిస్థితుల్లో అన్ని కైంకర్యాలనూ కుదించేశారు. 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామి కైంకర్యాలకు వినియోగిస్తూ, 20 గంటలపాటు భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆదాయంతోపాటే పైబడినవ్యయాలు టీటీడీ ఏర్పడినప్పుడు పది లక్షలుగా ఉన్న బడ్జెట్ ప్రస్తుతం రూ.2248 కోట్లకు చేరింది. అప్పట్లో లక్షల్లో ఉన్న ఖర్చు నేడు రూ.1600 కోట్లు దాటుతోంది. తిరుమల శ్రీవారి పేరుతో మూలనిధి/ పెట్టుబడుల (ఫిక్స్డ్ డిపాజిట్లు) రూపంలో బ్యాంకుల్లో సుమారు రూ. 9 వేల కోట్లు ఉన్నట్టు అంచనా. వీటిపై వడ్డీ రూపంలో వడ్డీకాసులవాడికి ఏడాదికి రూ.555 కోట్ల మేర అందుతోంది. శ్రీవారి స్థిర చరాస్థులు లక్షన్నర కోట్లు పైబడ్డాయి. సవాళ్లపై టీటీడీ సవారీ రోజూ లక్షల్లో వచ్చే భక్తులందరికీ వసతి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, భక్తులతోపాటు ఆలయ భద్రత వంటివన్నీ టీటీడీకి భారంగా మారాయి. అడవిని నరికి కాటేజీలు, సత్రాలు నిర్మించకూడ దని, పెరిగిన వాహన కాలుష్యం కారణంగా తిరుమలలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో భక్తులందరికీ వసతి కల్పించటం కష్టమవుతోంది. భక్తులతోపాటు ఆలయానికి భద్రత కల్పించటం కూడా టీటీడీకి పెద్ద సవాలే. ఇప్పటికే నాలుగంచెల భద్రతైపై దృష్టిసారించారు. అధునాతన స్కానర్లు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి భక్తులను అనుమతిస్తున్నారు. పురవీధుల్లోకి ముష్కరులు రాకుండా ఉండేలా ఇనుప కంచె (ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్) నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఆర్మ్డ్ కమాండోలు, ఎస్పీఎఫ్ కమాండో సిబ్బంది, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, సీసీ కెమెరా వ్యవస్థలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి సుమారు 100 కోట్లు టీటీడీ ఖర్చుచేస్తోంది. చైనా టూ తిరుమల తిరుమలపుణ్యక్షేత్రంలో కొలువైన స్వామి చిత్ర పటాలను చైనా తయారు చేస్తోంది. వీటితోపాటు అనేక ఉత్పత్తులు మనదేశానికి ఎగుమతి చేస్తోంది. చెక్క బొమ్మలు, ఫైబర్, ప్లాస్టిక్ బొమ్మలు, టోపీలు, మహిళలు వినియోగించే పర్సులు, బ్యాగులు, అలంకరణ ఫ్యాన్సీ వస్తువులు, డిజైన్ గాజులు, కీ చెయిన్లు, కుబేరుని బొమ్మలు, ఫొటోలకు వినియోగించే సింథటిక్ ఫ్రేములు, దేవతల త్రీడీ చిత్రాలు వంటివన్నీ చైనా నుంచి తిరుమలకు దిగుమతి అవుతున్నాయి. అమెరికా, ఈజిప్టు తదితర విదేశాల నుంచి, దేశంలోని ముంబై, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, బెంగళూరు, చెన్నయ్, వారణాశి, కలకత్తా వంటి నగరాల నుంచి కూడా వందలాది రకాల సరుకులు తిరుమలకు చేరుతున్నాయి. షికారీలు చేసే దిష్టిబొమ్మలు విదేశాలకు... తిరుమలలో నిత్యం జరిగే వ్యాపార వ్యవహారాల్లో షికారీలది (నక్కల జాతికి చెందిన గిరిజన కుటుంబాలు) ప్రత్యేక పాత్ర. వీరు తయారు చేసే దిష్టిబొమ్మలకు విదేశాల్లో గిరాకీ అధికంగా ఉంది. ఖాళీ కొబ్బరిచిప్పలు, మారేడు కాయ, శంఖు, పసుపుదారం, నల్లటి దిష్టిదారం, రాక్షసుని దిిష్టి ప్రతిమతో కూడిన ఈ దిష్టిబొమ్మలను అన్ని పుణ్యక్షేత్రాలు, ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టోకుగా కొనుగోలు చేస్తున్నారు. డిమాండును బట్టి నేపాల్, శ్రీలంక, మలేషియా, మారిషస్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఈ బొమ్మల కొనుగోలులో భక్తులు లక్షలాది రూపాయల నగదు వ్యవహారాలు సాగిస్తున్నారు. ఊరూరా ధర్మప్రచారం తిరుమల ఆలయానికే పరిమితమైన శ్రీవారి కల్యాణోత్సవాలను గ్రామస్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు, ధనిక, పాశ్చాత్య దేశాల్లోని భక్తులు ... ఇలా అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకునేందుకు టీటీడీ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘భక్తుల వద్దకే భగవంతుడు’ అంటూ పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో శ్రీవారి వైభవ ప్రాశ స్త్యాన్ని చాటుతోంది. అటవీప్రాంతాల్లోని గిరిజన లోగిళ్లలో గోవింద కల్యాణాలు, పట్టణ, నగర, ఇతర దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు, ఊరారా ‘భక్తి చైతన్య రథ’ యాత్రల పేరుతో భక్తులకు దర్శన భాగ్యాలు కల్పిస్తోంది. ‘మన గుడి’ పేరుతో సుమారు 50 వేల ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించింది. ‘శుభప్రదం’ పేరుతో యువతలో మానవ వికాసం, నైతిక విలువలతో కూడిన బోధనతో ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. దళితులు, మత్స్యకారులు, గిరిజనలు, తండావాసులకు పూజావిధానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనికోసం టీటీడీకి ఏడాదికి 150 కోట్ల దాకా ఖర్చవుతోంది. మానవ సేవలో మాధవుడు తిరుమలకొండకు వచ్చే ప్రతి భక్తుడికీ ఉచిత అన్నదానం, నిరుపేద రోగుల కోసం ప్రాణదానం, కన్నవారి ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కోసం బాలమందిరం, వృద్ధుల పునరావాసం కోసం కరుణాధామం, చెవిటి చిన్నారుల కోసం శ్రవణం ప్రాజెక్టుల ద్వారా ఆపన్న హస్తం అందిస్తోంది టీటీడీ. అనేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పి విద్యాదానం చేస్తోంది.