తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అలిపిరి పోలీసులు తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి కోర్టులో మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ను దాఖలుచేశారు.
తిరుపతి లీగల్: తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అలిపిరి పోలీసులు తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి కోర్టులో మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ను దాఖలుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్‌చేసి తప్పుడు ఆడియో టేప్‌లను సృష్టించి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలను నమ్మించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడ్డారని తిరుపతి మధురానగర్‌కు చెందిన ఊట్ల సురేంద్రనాయుడు మంగళవారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనివల్ల ఇరుప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ప్రజల ధన, మాన హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై అలిపిరి పోలీసులు కెసీఆర్‌సై ఐపీసీ 120బి, 468, 469, 471, 153ఎ తదితర సెక్షన్లతో పాటు 66బి ఐటిఎ సెక్షన్‌కింద కేసు నమోదుచేశారు. ఎఫ్‌ఐఆర్‌ను కోర్టులో దాఖలు చేశారు.