జనగామ: జిల్లా కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు ఆవరణంలో ఉన్న బ్యాంకులో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
Published Mon, Oct 2 2017 10:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement