నగరంలోని ఉప్పల్ మార్కెట్ యార్డులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మార్కెట్ యార్డులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్కెట్ లోని పలు దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. వ్యాపారులు అప్రమత్తమై మంటలు ఆర్పి వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే దుకాణాలను తగలబెట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ లో తరుచు దొంగతనాలు, అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని.. రక్షణ కల్పించాలన్నారు. మార్కెట్ యార్డును స్దానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిశీలించారు.