కార్పొరేషన్ పరిధిలో నాలుగోసారి ఎన్నికలు
పదిహేనేళ్ల తర్వాత మేయర్ స్థానం జనరల్‌కు
వరంగల్ అర్బన్ : వరంగల్ నగరం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)గా అవతరించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల పోలింగ్ మార్చి 6న జరుగనుండగా సోమవారం నోటిఫికేషన్ విడుదలవుతుంది. 1994కు ముందు మున్సిపాలిటీగా ఉన్న వరంగల్‌ను నగర పాలక సం స్థగా మారుస్తూ 1994 ఆగస్టు 18న అప్పటి ఉమ్మడి రాష్ర్టంలోని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 కాకతీయ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖిలా వరంగల్‌లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరంగల్‌కు గ్రేటర్ నగర పాలక సంస్థ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
2015లో అమలు
2013 మార్చి మూడో వారంలో నగర శివారులోని ఐదు మండలాలకు చెందిన 42 విలీన గ్రామపంచాయతీలను పంచాయతీ రాజ్ శాఖ రద్దు చేసింది. ఈ పంచాయతీలను వరంగల్ నగరంలో విలీనం చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థకు కావాల్సిన జనాభా, విస్తీర్ణం సరిపోవడమే కాకుండా నగరం 407 కిలోమీటర్లతో విస్తరించింది. 2014 ఆగస్టు నాటికి నగర జనాభా 9.18 లక్షలకు చేరింది. ఎట్టకేలకే గత ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హోదా కల్పిస్తూ జీవో ఉత్తర్వులు జారీ చేశారు.
మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా...
వరంగల్ మునిసిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా 1994లో అప్‌గ్రేడ్ అయింది. 1995లో తొలి మేయర్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వు చేశారు. కాంగ్రెస్ నుంచి కాకుమాను పద్మావతి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మేయర్‌గా విజయం సాధిచారు.2000 లో మేయర్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల తరపున బీజేపీకి చెందిన డాక్టర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్‌రావు గెలిచారు. 2005లో మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు అయింది. పరోక్ష విధానంలో కాంగ్రెస్ నుంచి ఎర్రబెల్లి స్వర్ణ మేయర్ పదవిని అలంకరించారు. ఈ పాలక వర్గం గడువు 2010 సెప్టెంబర్ 30తో ముగిసింది. ఇక అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే నడుస్తోంది. {పస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మేయర్ స్థానం జనరల్‌కు కేటారుుంచారు. ఈ ఎన్నికలను గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే నిర్వహించనున్నారు. అరుుతే 15 ఏళ్ల తర్వాత మేయర్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో పోటీ విపరీతంగా పెరిగింది.
మారిన రూపురేఖలు...
కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం ఇంతింతై వటుడింతై అన్నట్లు క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఫసిలి హైదరాబాద్ లోకల్ సెస్ 1309 చట్ట ప్రకారం 1899లో వరంగల్ పట్టణంగా రూపుదిద్దుకుని, 1929 నుంచి స్వతంత్రంగా పనిచేయడం ఆరంభించింది. 12 మంది నాన్ అఫీషియల్స్, ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉండేవారు. సీనియర్ రెవెన్యూ అధికారి కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. 1959లో మేజర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1951లో హైదరాబాద్ మునిసిపాలిటీల చట్టం ప్రకారం మొదటిసారి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఈ కమిటీలో ఎన్నికైన 25 మందితో పాటు ఏడుగురు నామినేటేడ్ సభ్యులు(నలుగురు అధికారులు, ముగ్గురు అనధికారులు) ప్రాతినిధ్యం వహించారు. 1959 జూలైలో స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా, 1960 జూలైలో సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీ శ్రేణికి ఎదిగింది.
గ్రేటర్‌లో తొలిసారి
Published Mon, Feb 22 2016 1:42 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement