ఐదు జిల్లాల్లో కేన్సర్ కేర్ సెంటర్లు | Five districts in Cancer care centers... | Sakshi
Sakshi News home page

ఐదు జిల్లాల్లో కేన్సర్ కేర్ సెంటర్లు

Published Sun, Jun 19 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

Five districts in Cancer care centers...

సాక్షి, హైదరాబాద్: ఐదు జిల్లాల్లో కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ దాని పనితీరును పరిశీలించాక కొన్ని మార్పులు.. చేర్పులు చేసి ఆ తర్వాత మిగిలిన జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.ఒక్కో కేంద్రంలో ఇద్దరు కేన్సర్ వైద్య నిపుణులు, నలుగురు నర్సులుంటారు.

ఆయా కేంద్రాల్లో కేన్సర్ నిర్ధారణ పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఎవరికైనా కేన్సర్ నిర్ధారణ అయితే అక్కడే ప్రాథమిక వైద్య సేవలు అందిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జేకు రోగులను తరలిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement