ముంబై: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ పేషంట్ల చికిత్సా సామర్థ్యాలను పెంచే దిశగా తలపెట్టిన మూడు సెంటర్స్ విస్తరణకు రూ.1,200 కోట్లు అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌తో పాటు పంజాబ్‌లోని ములాన్‌పూర్, మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యకలాపాలు నిర్వహించే తమ అనుబంధ విభాగం ఐసీఐసీఐ ఫౌండేషన్ .. నాలుగేళ్ల వ్యవధిలో రూ. 1,200 కోట్లు వెచ్చించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది తెలిపారు. దీనితో టీఎంసీ ఏటా మరో 25,000 మంది పేషంట్లకు చికిత్సను అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత 1.2 లక్షల పేషంట్ల వార్షిక సామర్ధ్యంతో పోలిస్తే ఇది 25 శాతం అధికమని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ హాస్పిటల్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి లభించే నిధులు కొత్త బ్లాక్‌ల ఏర్పాటు కోసం ఉపయోగపడతాయని టీఎంసీ డైరెక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment