Tata Memorial Centre
-
టాటా మెమోరియల్ సెంటర్‌కు ఐసీఐసీఐ రూ.1,200 కోట్ల నిధులు
ముంబై: టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ పేషంట్ల చికిత్సా సామర్థ్యాలను పెంచే దిశగా తలపెట్టిన మూడు సెంటర్స్ విస్తరణకు రూ.1,200 కోట్లు అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌తో పాటు పంజాబ్‌లోని ములాన్‌పూర్, మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలు నిర్వహించే తమ అనుబంధ విభాగం ఐసీఐసీఐ ఫౌండేషన్ .. నాలుగేళ్ల వ్యవధిలో రూ. 1,200 కోట్లు వెచ్చించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది తెలిపారు. దీనితో టీఎంసీ ఏటా మరో 25,000 మంది పేషంట్లకు చికిత్సను అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత 1.2 లక్షల పేషంట్ల వార్షిక సామర్ధ్యంతో పోలిస్తే ఇది 25 శాతం అధికమని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ హాస్పిటల్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి లభించే నిధులు కొత్త బ్లాక్‌ల ఏర్పాటు కోసం ఉపయోగపడతాయని టీఎంసీ డైరెక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. -
మరింత సమర్థంగా క్యాన్సర్ కట్టడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్‌ను సమర్థంగా నియంత్రించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలను భాగస్వామ్యం చేస్తోంది. ఆయా సంస్థల సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటూ క్యాన్సర్‌పై యుద్ధానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందిన టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో సుమారు 120 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన వైద్య విధానాలతో రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్స వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ విశాఖపట్నం హోమీ బాబా ఆస్పత్రి నుంచి సాంకేతిక సహకారం పొందనుంది. వ్యాధి గుర్తింపునకు స్క్రీనింగ్, పలు రకాల క్యాన్సర్ ప్రమాదాల గుర్తింపు, జిల్లాల్లో ప్రివెంటివ్ అంకాలజీ, క్యాన్సర్ డే కేర్ సేవలు అందుబాటులోకి తేవడం, రిజిస్ట్రీ, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి నైపుణ్యాల పెంపునకు శిక్షణ అందించడం వంటివి హోమీ బాబా ఆస్పత్రి అందించనుంది. ప్రభుత్వాస్ప త్రుల్లో పొగాకు విరమణ కేంద్రాల ఏర్పాటు, స్క్రీనింగ్‌లో నిర్ధారించిన క్యాన్సర్ రోగులు, హైరిస్క్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రెఫరల్ విధానం రూపకల్పనకు సంబంధించి హోమీ బాబా ఆస్పత్రి సహకారం అందించనుంది. విభజన అనంతరం క్యాన్సర్ చికిత్స వనరులను ఏపీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్యాన్సర్ వ్యాధి కట్టడి, ప్రభుత్వ రంగంలో చికిత్స వనరులను మెరుగుపరచడంపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ దృష్టి సారించింది. భవిష్యత్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా రాష్ట్రంలోనే చికిత్స వనరులను మెరుగుపరచనున్నారు. -
బులెటిన్ బోర్డ్
టాటా మెమోరియల్ సెంటర్లో 31 పోస్టులు పంజాబ్‌లోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)కి చెందిన హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్, సంగూర్ అండ్ హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో వివిధ విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: ఇంజనీర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నర్స, సైంటిఫిక్ అసిస్టెంట్. ఖాళీలు: 31 వయోపరిమితి: డిసెంబర్ 26 నాటికి ఇంజనీర్‌కి 45 ఏళ్లు, నర్స, సైంటిఫిక్ అసిస్టెంట్‌కి 30 ఏళ్లు, ఫార్మసిస్ట్, టెక్నీషియన్‌కి 27 ఏళ్లు, ఇతర పోస్టులకి 35 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హత: సంబంధిత పోస్టుకిగాను బీఈ/ బీటెక్/ఎమ్మెస్సీ/ఐసీడబ్ల్యూఏ/ఎఫ్సీఏ/ ఎంబీఏ/బీఎస్సీ/బీఫార్మా/ఇంటర్మీడియెట్/ఎస్ఎస్సీ/తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 26 వివరాలకు: https://tmc.gov.in/ ఈఎస్ఐ హాస్పిటల్లో34 పోస్టులు న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: జూనియర్ రెసిడెంట్ ఖాళీలు: 34 (ఎస్సీ-3, ఎస్టీ-5, ఓబీసీ- 9, ఇతరులు-17) వయోపరిమితి: నవంబర్ 30, 2016 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హత: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత, నవంబర్ 30 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తవ్వాలి. ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 14 వివరాలకు: www.esic.nic.in ఐజీఐబీలో 16 పోస్టులు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: రీసెర్చ్ అసోసియేట్-ఐ (ఖాళీలు: 2), రీసెర్చ్ అసోసియేట్-ఐఐ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ అసిస్టెంట్ - ఐఐఐ (ఖాళీలు:9), ప్రాజెక్ట్ అసిస్టెంట్- ఐఐ (ఖాళీలు-4) వయోపరిమితి: ప్రాజెక్ట్ అసిస్టెంట్ - ఐఐ పోస్టులకి 30 ఏళ్లు, మిగతా పోస్టులకి 35 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్డీ/ఎమ్మెస్సీ/ఎంటెక్ /ఎంసీఏ/బీటెక్ / ఎంబీబీఎస్/ తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 13 వివరాలకు:www.igib.res.in ఐఐపీఏలో 13 పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: సెక్టార్ ఎక్స్పర్ట్ (ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ) (ఖాళీలు-2); మార్కెట్ రీసెర్చ్ అసోసియేట్ (ఖాళీలు -1); జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (ఖాళీలు-1); జూనియర్ కౌన్సిలర్ (ఖాళీలు-7); ఆఫీస్ అసిస్టెంట్ (ఖాళీలు-1), ట్రైనీ కౌన్సిలర్ (ఖాళీలు-2) అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్/పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ/ తత్సమాన విద్యార్హతతోపాటు అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 7 వివరాలకు: www.iipa.org.in