విదేశీ చదువుల కోసం కారు చోరీ! | For luxury scene of the crime | Sakshi
Sakshi News home page

విదేశీ చదువుల కోసం కారు చోరీ!

Published Sat, May 23 2015 5:06 PM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

విదేశీ చదువుల కోసం కారు చోరీ! - Sakshi

విదేశీ చదువుల కోసం కారు చోరీ!

అల్వాల్ : విలాసాలు, విదేశీ చదువుల కోసం దొంగతనానికి పాల్పడి ఐదుగురు యువకులు పోలీసులకు చిక్కారు. అల్వాల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం....వెంకటాపురంలో నివసించే గుజ్జల వెంకటరాంరెడ్డి ఈనెల 17న ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అల్వాల్ పోలీసులు దమ్మాయిగూడలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద కారును పట్టుకున్నారు. పోలీసులు మరింత లోతుగా విచారించి నిందితులను అరెస్టు చేశారు.

కాప్రా జేజేకాలనీకి చెందిన వడ్డమాని మనోజ్‌కుమార్ (21), వడ్లమాని వెంకటసాయి వినయ్‌కుమార్ (24),  వెస్ట్ వెంకటాపురానికి చెందిన వి.సంతోస్ (20), తాళ్ల ప్రేమ్‌కుమార్ (20) బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరికి కుషాయిగూడలో నివసించే జండాల ధర్మతేజ (21)తో పరిచయమైంది. ఐదుగురూ కలిసి విలాసాలకు, భవిష్యత్తులో విదేశీ చదువులకు డబ్బు అవసరం అవుతుందని చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈనెల 17న వెస్ట్ వెంకటాపురంలో గుజ్జల వెంకటరాంరెడ్డికి చెందిన కొత్త ఇన్నోవా కారును ఎత్తుకెళ్లారు. దమ్మాయిగూడలోని అపార్ట్‌మెంట్ వద్ద కారును విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు దొరికారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement