- కార్యకర్తలకు ‘బీమా’ సౌకర్యం కల్పించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: : ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ.. కనీసం సభ్యత్వ నమోదులోనైనా రికార్డు సృష్టించాలనే యోచనతో తంటాలు పడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి చేపట్టిన సభ్యత్వ నమోదు కావడంతో... దీనిని విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తాయిలాలు చూపుతోంది.
పెద్ద సంఖ్యలో కార్యకర్తలుగా చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అధికారంలో లేకపోవడంతో కాం గ్రెస్ పార్టీ వైపు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే పార్టీలోని పలువురు నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అధికార టీఆర్‌ఎస్ వైపు వె ళ్లిపోయారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వంటి పదవుల్లో ఉన్న నేతలే పార్టీ మారుతుంటే...నాయకులు, కార్యకర్తలను నిలువరించడం పార్టీ నాయకత్వానికి తలకు మించిన భారం అవుతోంది. దీంతో కార్యకర్తలకు ఏదో ఒక ప్రయోజనం చేకూర్చకుంటే సభ్యత్వం తీసుకునేవారి సంఖ్య తగ్గిపోయే ప్రమాదముందని గ్రహించిన నాయకత్వం వా రికి ‘బీమా’ సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది.