సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మారియెట్ హోటల్‌లో ప్రారంభమైన రెండు రోజుల్లో కలెక్టర్‌ల సమావేశంలో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరెంట్ కోతల గురించి ప్రస్తావించారు. గతంలో ఎండాకాలంలో కోతలుండేవని, ప్రస్తుతం విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో సంబంధింత శాఖ మంత్రి, విద్యుత్‌శాఖాధికారులు కలిసి కృషి చేశారని ప్రశంసించారు.
భూసేకరణలోనూ..
దామరచర్లలో నిర్మించతలపెట్టిన 7800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన 10వేల ఎకరాలను సేకరించడంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని కూడా కేసీఆర్ అభినందించారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన 10వేల ఎకరాలను సేకరించడంతోపాటు అటవీ భూములకు పరిహారం చెల్లించడంలో పాత కలెక్టర్ చిరంజీవులు, కొత్త కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణలు ఎంతో శ్రమించారని, వారికి ప్రత్యేకంగా అభినందులు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్‌సలో అటు జిల్లా మంత్రికి, ఇటు జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ నుంచి అభినందనలు అందడం విశేషం.
శభాష్ జగదీశ్
Published Sat, Apr 18 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement