రైతుల బతుకు నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. ఓ విపత్తునుంచి తేరుకునే లోగానే మరో విలయం వారిని ముంచుతోంది. ఇలా సీజన్లన్నీ నష్టాలను మూటకట్టి అన్నదాతల నెత్తిన పెడుతున్నాయి. అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితి ఏప్రిల్ నుంచి లెక్కిస్తే ఇప్పటికి ఏడుమార్లు ప్రకృతి వివిధ రూపాల్లో ప్రకోపించి కర్షకులను కుంగదీశాయి. వానలు, వడగండ్లు, భీకర గాలుల రూపంలో సవాలు విసురుతున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే పరిహారం వారిని ఏమూలనా ఆదుకోవడం లేదు.
సాక్షి, మహబూబ్‌నగర్ : వడగళ్ల వాన జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మి గిల్చింది. ఏప్రిల్ రెండోవారం చివరి నుంచి ఏడు పర్యాయాలుగా పడిన అకాల వర్షం, వడగళ్ల వాన అన్నదాత ను కుదేలయ్యేలా చేసింది. ఆ నష్టం నుంచి తేరుకోకముందే రైతన్నపై ప్రకృతి మరోసారి కన్నెర్ర జేస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా ఉరుములు,మెరుపులు, గాలి దుమారం, వడగళ్లుతో ప డిన అకాల వర్షంతో వరి, మామిడి తోటలతో పాటు మార్కెట్ యార్డులకు అమ్మకం కోసం రైతులు తరలిం చిన ధాన్యం తడిసి పోవటంతో తీవ్ర నష్టాన్ని కలిగించింది.
యార్డులకు తరలించిన పంట ఉత్పత్తులు దెబ్బతినటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మహబూబ్‌నగర్, వీపనగండ్ల, పెబ్బేరు, న వాబుపేట,మాడ్గుల, ఆమనగల్లు,గోపాల్‌పేట తదితర మండలాల పరిదిలోని 14 గ్రామాలల్లోని వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.జడ్చర్ల, వనపర్తి మార్కేట్ యార్డులకు తరలించిన వందల క్వింటాళ్ల వరిధాన్యం తడిసి ముద్దవటంతో రైతులు అందోళనకు గురయ్యా రు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి తోటలు అ ధికంగా ఉండటంతో తీవ్రనష్టం వాటిల్లింది.
బొక్కొనిపల్లి,చౌదర్‌పల్లి,ధర్మాపూర్,తెల్గుగూడెం, జమిస్తాపూర్, కొడూరు,రామచంద్రపూర్ గ్రామాల్లోని 200కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. నవాబుపేట మండలంలోని మూడు గ్రామాల్లో 120 ఎకరాల్లో కూడా వరి పంటకు నష్టం జరిగింది.పెబ్బేరు మండల కేంద్రంతో పాటు ఇదే మండలంలోని బూడిదపాడు, నూగూరు, గుమ్మడం, అయ్యవారిపల్లెల్లో 25 ఎకరాల్లో మామిడి తోట దెబ్బతిన్నది.
వీపనగండ్ల మండలంలో 300 ఎకరాల్లో మామిడి తోటకు నష్టం వాటిల్లింది. ఆమనగల్లు మండలంలోని నాలుగు గ్రామాల్లో 400 ఎకరాల్లో ,మాడ్గుల మండలంలోని ఐదు గ్రామాల్లోని 150 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గోపాల్‌పేట మండలంలోని నాలుగు గ్రామాల్లో 400 ఎకరాల్లో వరి పంట, 40 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతినటంతో రైతులు తీవ్ర ఆవేదనచెందారు. ఈ రెండు, మూడు రోజుల్లో పడిన వడగళ్లతో రూ.80 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసినట్టు తెలుస్తోంది. రైతులు మాత్రం రూ. 2 కోట్లకు పైగానే నష్టం జరిగిన ట్లు చెప్తున్నారు.
నెల వ్యవధిలో రూ.3.41 కోట్ల దెబ్బ
ఈ నెల రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానతో అన్నదాతకు రూ.3.41కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఒక హెక్టారులో వరి పంట నష్టానికి రూ.10వేలు, మామిడితోటకు రూ.15వేలు, పత్తి,మిర్చి,కూరగాయలతోట, ఉల్లిగడ్డ పంటలకు రూ.10వేలు ల వంతున వ్యవసాయశాఖ రైతులకు పరిహారం కింద అందజేస్తున్నది.ఈ లెక్క ప్రకారమే జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయశాఖ జమకట్టింది. జిల్లాలోని 26 మండలాల పరిదిలోని పలు గ్రామాల రైతులకు చెందిన 3417.8 హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా రూ.3.41 కోట్లు నష్టంగా వ్యవసాయశాఖ పేర్కొంది. ఈ మేరకు జిల్లా అధికారయంత్రాంగానికి ఒక నివేదికను కూడా అందజేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంట నష్టంపై సమగ్రమైన నివేదికను అందించటం ద్వారా రైతులకు పరిహారం అందే విధంగా జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఎన్నికల హాడావిడి కారణంగా ఇప్పటికే జాప్యం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.
గతనష్టం..తలచుకుంటేనే గుండెదడజిల్లాలో ఏప్రిల్ 13 నుంచి ఈ నెల 2 వరకు ఏడు పర్యాయాలుగా పడిన వడగళ్ల వానతో 3417.8 హెక్టార్లలో వరి పంటకు దెబ్బతినగా రూ. 3.41 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది .
ఏప్రిల్ 13న ఆమనగల్లు, మాడ్గుల, కల్వకుర్తి, వంగూరు, ఈగ్కూరు, మక్తల్, అయిజ, తాడూరు, తిమ్మాజీపేట, ధన్వాడ మండలాల్లో కురిసిన వడగళ్ల వానతో 1091.6 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. జడ్చర్ల, భూత్పూరు, మిడ్జిల్, కొందుర్గు, కొత్తూరు మండలాల్లో ఏప్రిల్ 14 న కురిసిన వడగళ్లతో 490.4 హెక్టార్లల్లో వరి పంట దెబ్బతిన్నది. వరుసగా ఏప్రిల్ 16, 18, 28, 30 తేదీల్లో పడిన వడగళ్ల వర్షాలతో భూత్పూరు మండలంలో 98 హెక్టారల్లో, పెద్దమందడి, కోయిలకొండ, అడ్డాకుల, కొత్తకోట, హన్వాడ, నవాబుపేట, మహబూబ్‌నగర్, దౌలతాబాద్, కోస్గి మండలాల్లో 1333.4 హెక్టార్లలో, మిడ్జిల్, తాడూరు లలో 70, మిడ్జిల్, వీపనగండ్ల, కొల్లాపూర్‌లలో 72 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఈ నెల 2న జిల్లాలోని జడ్చర్ల, వీపనగండ్ల, మహబూబ్‌నగర్, నవాబుపేట మండలాలో 262.4 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.
కోలుకునేదెలా...!?
Published Wed, May 7 2014 3:17 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement