rain drops
-
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్‌లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్‌లలో, అరోమా థెరపీ రిట్రీట్‌లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?
వాన.. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే, అది ఎక్కువైనా నష్టమే.. తక్కువైనా కష్టమే.. ఎక్కువగా కురిస్తే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు.. తక్కువగా పడితే కరువు, కాటకాలు. గతవారం రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు నీట మునిగి, జనం ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో మొన్నటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. పది రోజుల క్రితం 54శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరింది.ఈ సంగతి అలా ఉంచితే.. మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న వాన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చూద్దామా? చినుకు ఎలా ఉంటుందంటే.. సాధారణంగా వర్షపు చినుకులు బిందువుల మాదిరిగా ఉంటాయనుకుంటాం. కానీ అవి బన్ ఆకారంలో ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసార్ధం కలిగిన చినుకులు గోళాకారంలో ఉంటాయి. కాస్త పెద్ద చినుకులు హాంబర్గ్ బన్‌లా ఉంటాయి. అదే 4.5 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కంటే పెద్ద చినుకులు పారాచూట్ తరహాలో మారి చిన్నచిన్న చినుకులుగా కింద పడతాయి. నిమిషంలో31.2 మిల్లీమీటర్ల వర్షం.. ఒక్క నిమిషంలో అత్యధికంగా కురిసిన వర్షం ఎంతో తెలుసా? 31.2 మిల్లీమీటర్లు. 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లోని యూనియన్విల్లేలో ఇది నమోదైంది. ఇక 1966 జనవరి 7 నుంచి మరుసటి రోజు వరకు 24 గంటల్లో కురిసిన 1825 మిల్లీమీటర్ల వర్షమే ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం. అదే మనదేశంలో అయితే.. మేఘాలయలోని మౌసిన్రామ్లో 2022 జూన్ 17న 1003.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది. మేఘాలయలోని చిరపుంజిలో 1860 నుంచి 1861 వరకు 365 రోజుల వ్యవధిలో కురిసిన 1,042 అంగుళాల (26,470 మిల్లీమీటర్లు) వర్షమే ఇప్పటివరకు ఉన్న మరో రికార్డు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 24 గంటల్లో నమోదైన 649.8 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం. ఒక్క చినుకూ చూడని ప్రదేశం.. భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రై వ్యాలీస్. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. ఇక చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి సగటున 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే దాదాపు లేనట్టేనన్నమాట. ప్రతి చుక్కా కిందకు పడదు.. వర్షపు చినుకు అన్ని సార్లూ భూమిని చేరదు. కొన్ని సందర్భాల్లో అవి భూమిపై పడకుండానే మాయమైపోతాయి. గాలి వేడిగా ఉన్నచోట్ల అక్కడే ఆవిరైపోతాయి. ఇలా భూమిని చేరకుండానే ఆవిరైపోయిన వర్షపు చినుకును విర్గా అంటారు. వర్షానికి వాసన ఉంటుందా? వర్షం వాసన భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండవు. అయితే, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మట్టి వాసన వస్తుంది. ఇది నేల తేమ నుంచి వెలువడుతుంది. వర్షం నుంచి వచ్చే సువాసనను పెట్రిచోర్ అంటారు. 14 మైళ్ల వేగం.. 2 నిమిషాలు.. ఒక్క వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి సగటున దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మేఘాల నుంచి వర్షపు చినుకులు పడే ఎత్తును బట్టి ఇది మారుతూ ఉంటుంది. వర్షపు చినుకులు గంటకు 14 మైళ్ల వేగంతో భూమి మీదకు పడతాయి. పెద్ద చినుకులైతే 20 మైళ్ల వేగంతో వస్తాయి. వర్షపు నీటిలోనూ విటమిన్.. వర్షపు నీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా ఉండే అనేక సూక్ష్మజీవులు విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు నీరు గాలిలోకి రాగానే ఈ సూక్ష్మజీవులు అందులో చిక్కుకుని విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. కనురెప్ప కంటే తక్కువ బరువు.. సగటు వర్షపు చినుకు బరువు కేవలం 0.001 ఔన్సులు (0.034 గ్రాములు). అంటే మన కనురెప్ప కంటే తక్కువ బరువు అన్నమాట. -
వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం?
నునుపైన తలం లేదా శుభ్రమైన ఆకుపై నీటి బిందువు పడినప్పుడు ఆ నీరు అర్ధగోళాకృతిని పొందుతుంది. దీనికి కారణం నీటి తలతన్యత. ఒక నీటి బిందువును గుండు సూది సహాయంతో విడగొట్టలేక పోవడానికి కారణం నీటి తలతన్యత. వాన చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం ఈ ధర్మమే. ఆకుపచ్చని మొక్కలు కేశనాళికీయత వల్ల వేర్ల ద్వారా నీటిని శోషించుకొని మొక్క వివిధ భాగాలకు సరఫరా చేస్తాయి. తలతన్యత అణువుల మధ్య ఆకర్షణ బలం రెండు రకాలుగా ఉంటుంది. అవి: 1) సంసంజన బలం 2) అసంసంజన బలం 1. సంసంజన బలం: ఒకే జాతికి చెందిన అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ‘సంసంజన బలం’ అంటారు. ఉదా: నీటి అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలం. ఈ సంసంజన బలాల వల్ల నీరు తక్కువ ఘనపరిమాణం, వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. తలతన్యత: సంసంజన బలాల వల్ల ద్రవాలు అతి తక్కువ వైశాల్యం, ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తాయి. దీని వల్ల ద్రవ ఉపరితల అణువులు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకొని, ఒకదాని నుంచి మరొకటి విడివడకుండా ఉంటాయి. ఈ ధర్మాన్నే ‘తలతన్యత’ అంటారు. సంసంజన బలాల వల్ల ద్రవాలు తలతన్యత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. అనువర్తనాలు: - రెండు నీటి బిందువులను కలిపినప్పుడు అవి వెంటనే అతుక్కుపోవడానికి కారణం నీటి తలతన్యత. - వర్షం కురవడానికి ముందు మేఘాల్లోని నీరంతా ఒక దగ్గరికి చేరుతుంది. దీనికి కారణం తలతన్యతే. - చెలమ లేదా బావిలో నీరు ఊరడానికి కారణం నీటి తలతన్యత. - కొంత నీరున్న బకెట్లో పెయింటింగ్ బ్రష్‌ను ఉంచినప్పుడు దాని వెంట్రుకలు దూరంగా వెళ్లిపోతాయి. అదే బ్రష్‌ను నీటిలో నుంచి బయటకు తీసినప్పుడు కుంచె వెంట్రుకలు దగ్గరగా వస్తాయి. దీనికి కారణం నీటి తలతన్యత. - కుళాయి నుంచి నీరు ఒక జట్టుగా రావడానికి/ కారడానికి కారణం నీటి తలతన్యతే. 2. అసంసంజన బలం: వేర్వేరు జాతులకు చెందిన అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ‘అసంసంజన బలం’ అంటారు. ఉదా: ఒక గాజు పాత్రను కొంత వరకు నీటితో నింపినప్పుడు గాజు గోడల వద్ద నీరుపైకి ఎగబాకుతుంది. దీనికి కారణం నీటికి, గాజుకీ మధ్య పనిచేసే అసంసంజన బలం. కేశనాళికీయత సన్నటి వ్యాసార్ధం ఉన్న గాజు గొట్టాన్ని ఒక ద్రవంలో ముంచినప్పుడు దాని ద్వారా ఆ ద్రవం పైకి ఎగబాకే ధర్మాన్ని ‘కేశనాళికీయత’ అంటారు. సన్నటి వ్యాసార్ధం ఉన్న గాజు గొట్టాన్ని ‘కేశనాళిక’ అంటారు. ద్రవాలు అసంసంజన బలాల వల్ల ‘కేశనాళికీయత’ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. స్పర్శ కోణం: ఏదైనా ఒక వస్తువును ఒక ద్రవంలో ముంచినప్పుడు ఆ ద్రవ ఉపరితలం స్పర్శ బిందువు వద్ద వస్తువుతో చేసే కోణాన్ని ‘స్పర్శకోణం’ అంటారు. గాజుతో నీరు చేసే స్పర్శ కోణం ఎల్లప్పుడూ ఒక అల్పకోణం. గాజుతో పాదరసం చేసే స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అధికకోణం. ఇది సాధారణంగా 139ని లుగా ఉంటుంది. స్పర్శ కోణాన్ని ప్రభావితం చేసే అంశాలు: 1. నీటితో గాజు చేసే స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అల్పకోణం. నీటి స్వచ్ఛత పెరిగే కొద్దీ స్పర్శ కోణం తగ్గుతుంది. అందువల్ల వస్తువులను సాధారణ నీటిలో కంటే స్వచ్ఛమైన నీటిలోనే బాగా శుభ్రపరచవచ్చు. 2. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీటి స్పర్శకోణం తగ్గుతుంది. అందువల్ల వస్తువులను సాధారణ నీటిలో కంటే వేడి నీటిలోనే బాగా శుభ్రం చేయవచ్చు. 3. నీటితో స్పర్శ కోణాన్ని తగ్గించే పదార్థాలను సంసిక్తకాలు అంటారు. ఉదా: సబ్బు, సర్ఫు, డిటర్జెంట్, చాకలి సోడా మొదలైనవి. సంసిక్తకాల స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అల్పకోణం. 4. నీటితో స్పర్శ కోణాన్ని పెంచే పదార్థాలను అసంసిక్తకాలు అంటారు. ఉదా: కొవ్వులు, నూనెలు, చమురు పదార్థాలు, మైనం, గ్రీజు మొదలైనవి. అసంసిక్తకాల స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అధిక కోణం. 5. పైపులను అతికించేటప్పుడు గ్రీజుతో పూత పూస్తారు. దీని వల్ల నీటికి, పైపునకు మధ్య స్పర్శ కోణం పెరిగి నీరు కారడం ఆగిపోతుంది. 6. వాటర్ ఫ్రూఫ్ బ్యాగుల్లో లోపలి గోడలను మైనం లాంటి అసంసిక్తకాలతో పూత పూయడం వల్ల నీటికి, సంచికి మధ్య స్పర్శకోణం పెరిగి నీరు కారడం ఆగిపోతుంది. కేశనాళికీయత అనువర్తనాలు: - కిరోసిన్ దీపం, కొవ్వొత్తి కేశనాళికీయత ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. - సాగు భూములు వదులుగా (మెత్తగా) ఉండటం వల్ల వేర్లు కేశనాళికీయత ధర్మం ద్వారా లోపలికి ఇంకిన నీటిని కూడా పీల్చుకొని మొక్కలకు అందిస్తాయి. - ఏదైనా ఒక మట్టి గోడ పక్కన ఉన్న గుంతలో నీరు నిలిచినప్పుడు కేశనాళికీయత వల్ల నీరు ఆ గోడలపైకి ఎగబాకుతుంది. - కాటన్, స్పాంజ్, నాప్కిన్స మొదలైనవి కేశనాళికీయత వల్ల ద్రవాలను పీల్చుకుంటాయి. - స్నానం చేసిన తర్వాత టవల్‌తో రుద్దినప్పుడు అది కేశనాళికీయత ధర్మం వల్లే నీటిని పీల్చుకోగలుగుతుంది. - ఫౌంటేన్ పెన్ (పత్తి పెన్ను), మార్కర్, స్కెచ్ పెన్ను మొదలైనవి కేశనాళికీయత ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. గతంలో అడిగిన ప్రశ్నలు 1. వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం? 1) కేశనాళికీయత 2) అసంసంజన బలాలు 3) కేంద్రక బలాలు 4) తలతన్యత 2. కిరోసిన్ దీపం ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? 1) తలతన్యత 2) సంసంజన బలాలు 3) కేశనాళికీయత 4) కేంద్రక బలాలు 3. నీటి స్వచ్ఛత పెరిగితే స్పర్శకోణం? 1) తగ్గుతుంది 2) పెరుగుతుంది 3) మారదు 4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు 4. ఒక గుండు సూదికి మైనాన్ని పూస్తే అది నీటిపై తేలియాడుతుంది. దీనికి కారణం? 1) అధిక సాంద్రత 2) అల్పసాంద్రత 3) తలతన్యత 4) కేశనాళికీయత 5. ఇంకు పెన్ను ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? 1) తలతన్యత 2) కేశనాళికీయత 3) అభికేంద్రబలం 4) అపకేంద్రబలం 6. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 1) ఉష్ణోగ్రత పెరిగితే నీటి స్పర్శకోణం తగ్గుతుంది 2) ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు నీటి స్పర్శకోణం విలువ పెరుగుతుంది 3) నీటి స్పర్శకోణంపై ఉష్ణోగ్రత ప్రభావం ఉండదు 4) ఉష్ణోగ్రతతో నీటి స్పర్శకోణం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. 7. స్వచ్ఛమైన నీరు గాజుతో చేసే స్పర్శకోణం ఎంత? 1) 0ని 2) 45ని 3) 90ని 4) 180ని 8. ఆకు పచ్చని మొక్కలు వేర్ల ద్వారా నీటిని శోషించుకొని అన్ని భాగాలకు సరఫరా చేసుకుంటాయి. దీంట్లో ఇమిడి ఉన్న ధర్మం ఏది? 1) తలతన్యత 2) కేశనాళికీయత 3) అభికేంద్ర బలం 4) అపకేంద్ర బలం సమాధానాలు 1) 4; 2) 3; 3) 1; 4) 3; 5) 2; 6) 1; 7) 1; 8) 2. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో కేశనాళికీయత ధర్మానికి ఉదాహరణ కానిది? 1) ఇంకు ఎగబాకడం 2) నీరు ఊరడం 3) వేర్ల నుంచి నీరు మొక్కలోని భాగాలకు చేరడం 4) గుడ్డ నీటిని పీల్చుకోవడం 2. నీటి బిందువు అతి తక్కువ వైశాల్యం, ఘనపరిమాణాలను ఆక్రమించడానికి కారణమైన ధర్మం? 1) తలతన్యత 2) స్నిగ్ధత 3) సాంద్రత 4) భాష్పీభవన పీడనం 3. కిందివాటిలో అత్యధిక తలతన్యత ఉన్న ద్రవం? 1) పాదరసం 2) నీరు 3) సముద్రం 4) బ్రోమిన్ 4. ఏ ధర్మం వల్ల నీటి బిందువులు గోళాకారంలో ఉంటాయి? 1) స్నిగ్ధత 2) ఉపరితల తన్యత 3) అధిక ఉష్ణం 4) వక్రీభవన సూచిక 5. ఏ ధర్మం వల్ల నూనె దీపం వత్తిలోకి కిరోసిన్ ఎగబాకుతుంది? 1) పీడన వ్యత్యాసం 2) కేశిక చర్య 3) నూనెకు స్నిగ్ధద తక్కువగా ఉండటం 4) భూమ్యాకర్షణ శక్తి 6. కేశనాళిక గొట్టంలో పాదరసం ఎత్తు దాని అసలు ఎత్తుకు .... ? 1) సమానం 2) తక్కువ 3) ఎక్కువ 4) శూన్యం 7. దేని కారణంగా సన్నని గొట్టాల్లో నీటి మట్టం పెరుగుతుంది లేదా తగ్గుతుంది? 1) తలతన్యత 2) కేశనాళికీయత 3) లవణం 4) వాతావరణ పీడనం 8. టిష్యూ పేపర్ ఏ చర్య ద్వారా నీటిని గ్రహిస్తుంది? 1) కేశనాళికీయత 2) వ్యాప్తి 3) సంవహనం 4) అయస్కాంతం 9. గుండుసూది నీటిపై తేలియాడటానికి కారణం? 1) తలతన్యత 2) స్నిగ్ధత 3) స్థితిస్థాపకత 4) సాంద్రత 10. ఫౌంటేన్ పెన్ పనిచేసే సూత్రం? 1) కేశనాళికీయత 2) తలతన్యత 3) ఊర్థ్వ ఒత్తిడి 4) స్నిగ్ధత 11. స్వచ్ఛమైన నీరు గాజుతో చేసే స్పర్శ కోణం (డిగ్రీల్లో)? 1) 0ని 2) 5ని 3) 90ని 4) 180ని 12. నేలపై పడిన పాదరసం చిన్న గోళాలుగా విడిపోతుంది. దీనికి కారణం? 1) అధిక సాంద్రత వల్ల 2) అధిక స్నిగ్ధత వల్ల 3) లోహం కావడం వల్ల 4) అధిక తలతన్యత వల్ల 13. {దవాలు మాత్రమే ప్రదర్శించే ధర్మం? 1) తలతన్యత 2) స్నిగ్ధత 3) స్థితిస్థాపకత 4) పైవన్నీ సమాధానాలు 1) 3; 2) 1; 3) 1; 4) 2; 5) 2; 6) 2; 7) 2; 8) 1; 9) 1; 10) 1; 11) 1; 12) 1; 13) 1. - గుండె మల్లేశం సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
కోలుకునేదెలా...!?
రైతుల బతుకు నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. ఓ విపత్తునుంచి తేరుకునే లోగానే మరో విలయం వారిని ముంచుతోంది. ఇలా సీజన్లన్నీ నష్టాలను మూటకట్టి అన్నదాతల నెత్తిన పెడుతున్నాయి. అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితి ఏప్రిల్ నుంచి లెక్కిస్తే ఇప్పటికి ఏడుమార్లు ప్రకృతి వివిధ రూపాల్లో ప్రకోపించి కర్షకులను కుంగదీశాయి. వానలు, వడగండ్లు, భీకర గాలుల రూపంలో సవాలు విసురుతున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే పరిహారం వారిని ఏమూలనా ఆదుకోవడం లేదు. సాక్షి, మహబూబ్‌నగర్ : వడగళ్ల వాన జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మి గిల్చింది. ఏప్రిల్ రెండోవారం చివరి నుంచి ఏడు పర్యాయాలుగా పడిన అకాల వర్షం, వడగళ్ల వాన అన్నదాత ను కుదేలయ్యేలా చేసింది. ఆ నష్టం నుంచి తేరుకోకముందే రైతన్నపై ప్రకృతి మరోసారి కన్నెర్ర జేస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా ఉరుములు,మెరుపులు, గాలి దుమారం, వడగళ్లుతో ప డిన అకాల వర్షంతో వరి, మామిడి తోటలతో పాటు మార్కెట్ యార్డులకు అమ్మకం కోసం రైతులు తరలిం చిన ధాన్యం తడిసి పోవటంతో తీవ్ర నష్టాన్ని కలిగించింది. యార్డులకు తరలించిన పంట ఉత్పత్తులు దెబ్బతినటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మహబూబ్‌నగర్, వీపనగండ్ల, పెబ్బేరు, న వాబుపేట,మాడ్గుల, ఆమనగల్లు,గోపాల్పేట తదితర మండలాల పరిదిలోని 14 గ్రామాలల్లోని వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.జడ్చర్ల, వనపర్తి మార్కేట్ యార్డులకు తరలించిన వందల క్వింటాళ్ల వరిధాన్యం తడిసి ముద్దవటంతో రైతులు అందోళనకు గురయ్యా రు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి తోటలు అ ధికంగా ఉండటంతో తీవ్రనష్టం వాటిల్లింది. బొక్కొనిపల్లి,చౌదర్పల్లి,ధర్మాపూర్,తెల్గుగూడెం, జమిస్తాపూర్, కొడూరు,రామచంద్రపూర్ గ్రామాల్లోని 200కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. నవాబుపేట మండలంలోని మూడు గ్రామాల్లో 120 ఎకరాల్లో కూడా వరి పంటకు నష్టం జరిగింది.పెబ్బేరు మండల కేంద్రంతో పాటు ఇదే మండలంలోని బూడిదపాడు, నూగూరు, గుమ్మడం, అయ్యవారిపల్లెల్లో 25 ఎకరాల్లో మామిడి తోట దెబ్బతిన్నది. వీపనగండ్ల మండలంలో 300 ఎకరాల్లో మామిడి తోటకు నష్టం వాటిల్లింది. ఆమనగల్లు మండలంలోని నాలుగు గ్రామాల్లో 400 ఎకరాల్లో ,మాడ్గుల మండలంలోని ఐదు గ్రామాల్లోని 150 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గోపాల్పేట మండలంలోని నాలుగు గ్రామాల్లో 400 ఎకరాల్లో వరి పంట, 40 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతినటంతో రైతులు తీవ్ర ఆవేదనచెందారు. ఈ రెండు, మూడు రోజుల్లో పడిన వడగళ్లతో రూ.80 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ అంచనా వేసినట్టు తెలుస్తోంది. రైతులు మాత్రం రూ. 2 కోట్లకు పైగానే నష్టం జరిగిన ట్లు చెప్తున్నారు. నెల వ్యవధిలో రూ.3.41 కోట్ల దెబ్బ ఈ నెల రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానతో అన్నదాతకు రూ.3.41కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఒక హెక్టారులో వరి పంట నష్టానికి రూ.10వేలు, మామిడితోటకు రూ.15వేలు, పత్తి,మిర్చి,కూరగాయలతోట, ఉల్లిగడ్డ పంటలకు రూ.10వేలు ల వంతున వ్యవసాయశాఖ రైతులకు పరిహారం కింద అందజేస్తున్నది.ఈ లెక్క ప్రకారమే జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయశాఖ జమకట్టింది. జిల్లాలోని 26 మండలాల పరిదిలోని పలు గ్రామాల రైతులకు చెందిన 3417.8 హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా రూ.3.41 కోట్లు నష్టంగా వ్యవసాయశాఖ పేర్కొంది. ఈ మేరకు జిల్లా అధికారయంత్రాంగానికి ఒక నివేదికను కూడా అందజేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంట నష్టంపై సమగ్రమైన నివేదికను అందించటం ద్వారా రైతులకు పరిహారం అందే విధంగా జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఎన్నికల హాడావిడి కారణంగా ఇప్పటికే జాప్యం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. గతనష్టం..తలచుకుంటేనే గుండెదడజిల్లాలో ఏప్రిల్ 13 నుంచి ఈ నెల 2 వరకు ఏడు పర్యాయాలుగా పడిన వడగళ్ల వానతో 3417.8 హెక్టార్లలో వరి పంటకు దెబ్బతినగా రూ. 3.41 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది . ఏప్రిల్ 13న ఆమనగల్లు, మాడ్గుల, కల్వకుర్తి, వంగూరు, ఈగ్కూరు, మక్తల్, అయిజ, తాడూరు, తిమ్మాజీపేట, ధన్వాడ మండలాల్లో కురిసిన వడగళ్ల వానతో 1091.6 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. జడ్చర్ల, భూత్పూరు, మిడ్జిల్, కొందుర్గు, కొత్తూరు మండలాల్లో ఏప్రిల్ 14 న కురిసిన వడగళ్లతో 490.4 హెక్టార్లల్లో వరి పంట దెబ్బతిన్నది. వరుసగా ఏప్రిల్ 16, 18, 28, 30 తేదీల్లో పడిన వడగళ్ల వర్షాలతో భూత్పూరు మండలంలో 98 హెక్టారల్లో, పెద్దమందడి, కోయిలకొండ, అడ్డాకుల, కొత్తకోట, హన్వాడ, నవాబుపేట, మహబూబ్‌నగర్, దౌలతాబాద్, కోస్గి మండలాల్లో 1333.4 హెక్టార్లలో, మిడ్జిల్, తాడూరు లలో 70, మిడ్జిల్, వీపనగండ్ల, కొల్లాపూర్‌లలో 72 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఈ నెల 2న జిల్లాలోని జడ్చర్ల, వీపనగండ్ల, మహబూబ్‌నగర్, నవాబుపేట మండలాలో 262.4 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.