కొండమ్మ ఆరిఫా మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
మూడు మృతదేహాలు లభ్యం
అశ్వారావుపేట: కార్తీక మాసం చివరి సోమవారం గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్లినవారితోపాటు సరదాగా వెళ్లిన ముగ్గురు, మరొకరు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యారుు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారా వుపేటలోని బీసీ కాలనీకి చెందిన సుమారు 30 మంది ఆటోల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కోరుుదా వద్దకు గోదావరిలో స్నా నాలు చేసేందుకు వెళ్లారు. వీరిలో ఒక యువకుడు నీటిలో మునిగిపోవడంతో అతని చేరుు పట్టుకున్న వారు కూడా మునిగిపోయారు.
అక్కడున్న వారు యువకుడి తోపాటు మరికొందరిని కాపాడగా.. నలుగురు గల్లంతయ్యారు. వీరిలో మద్దె కొండ మ్మ(45), షేక్ ఆరిఫా(27), షేక్ మహబూబ్‌బీ(12), హసీనా(11) ఉన్నారు. కాగా వీరిలో ఆరీఫా, మహబూబ్‌బీ, హసీనా మృతదేహాలు లభ్యమయ్యారుు. కొండమ్మ ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో మహబూబ్‌బీ, హసీనా అక్కాచెల్లెళ్లు. కార్తీక మాసం పూజలకు హిందువులు వెళ్లగా సోమవారం బంద్ కావడంతో ముస్లిం కుటుం బాలకు చెందిన వారు కూడా విహారయాత్రగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు.
ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ..
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సఖినవీడుకు చెందిన రామాల లక్ష్మణరావు(21), కొండల రమేష్(24), గారపాటి అనిల్(19), మధిర మండలం మడుపల్లికి చెందిన లక్ష్మినారాయణ కృష్ణా జిల్లా నాగాయలంక లైట్‌హౌస్ బీచ్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో లక్ష్మినారాయణ మృతదేహం లభ్యం కాగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.