
ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ శిబిరం ముగింపు
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సింగరేణి కాలరీస్ కోయగూడెం ఓపెన్ కాస్టు ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణా శిబిరం సోమవారం ముగిసింది. ముగింపు సభలో ఇల్లెందు ఏరియా జీఎం వై.రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ లక్కినేని సురేందర్‌రావు, సర్పంచ్ ఇస్లావత్ పార్వతి తదితరులు పాల్గొని అంకితభావంతో కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విలువైన స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేశారు. ఇప్పటి వరకు సింగరేణి కార్మికుల పిల్లలకు మాత్రమే ఉచిత శిక్షణ ఇస్తుండగా... తొలిసారిగా కార్మికేతరుల పిల్లలకు ఈ శిక్షణ శిబిరం నిర్వహించడం విశేషం.