గ్రామస్థాయి నుంచి సంబరాలు | From fixed celebrating | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయి నుంచి సంబరాలు

Published Thu, May 29 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

From fixed celebrating

సప్తగిరికాలనీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించేం దుకు అధికార యంత్రాం గం సమాయత్తమవుతోం ది. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో జూన్ 1, 2 తేదీల్లో సంబరాలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య బుధవారం జిల్లా అధికారులు, టీఎన్జీవోస్, ఉపాధ్యాయ సంఘాలు, సాహితీ సంస్థల నాయకులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు.
 
 60 ఏళ్ల ప్రజల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న జరిగే వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సంబ రాల్లో ఉద్యోగుల జేఏసీ ముఖ్య పాత్ర పోషించాలని, ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లా కేంద్రం లో రెండు రోజులు వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. జూన్ 1న కలెక్టరేట్ నుంచి కళాకారులు బతుకమ్మలతో సర్కస్ గ్రౌండ్ వరకు ర్యాలీ ఉంటుందని, రాత్రి సర్కస్‌గ్రౌండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులు, బోనాలు, బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించాలని సూచించారు.
 
 సర్కస్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమాలు ఉంటాయన్నారు. జూన్ 2న ఉదయం కలెక్టరేట్‌లో జాతీయపతాక ఆవిష్కరణ, జాతీయ, తెలంగాణ గీతాలాపన, ప్రతిజ్ఞ, కలెక్టర్ సందేశం ఉంటాయని తెలిపారు. అనంతరం ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అమరవీరుల కుటుంబాలకు సన్మానం, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. తెలంగాణ సంబరాల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి లింగయ్య, డీపీఆర్వో ప్రసాద్, హౌసింగ్ సీడీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement