సాక్షి, హైదరాబాద్ : కరోనా చికిత్సలు అందించేందుకు హైదరాబాద్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలోని 13అంతస్తుల భవనంలో 1500 పడకలతో ఉస్మానియాకు అనుబంధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో సోమవారం నుంచి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఇకపై సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన పనిలేదు. ఐటీ కారిడార్‌లోని హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్‌తోపాటు టోలిచౌకి, గోల్కొండ, వికారాబాద్ నుంచి వచ్చే వారికి ఈ కొత్త ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఆస్పత్రిలో పూర్తిగా వైరస్ బారిన పడిన వారికే వైద్యం అందించనున్నారు. ఈ ఆస్పత్రిని కేవలం 20రోజుల్లోనే రెడీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment