Tims
-
అంతర్జాతీయస్థాయిలో ‘టిమ్స్’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులను అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ ఆస్పత్రుల్లో వెయ్యి పడకలు ఉంటాయని, ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలోనే ‘టిమ్స్’పనితీరు ఉంటుందన్నారు. ప్రతి ఆస్పత్రికి ప్రత్యేకంగా పాలకమండలి ఉంటుందని మంత్రి తెలిపారు. వీటన్నింటిని కలిపి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం నిమ్స్‌కు ఈ హోదా కల్పించడంతో వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఆదివారం ఆయన శాసనమండలిలో ‘టిమ్స్ బిల్లు– 2023’ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటుతో దాదాపు 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి వస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 10వేల బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 34వేలకు చేరిందన్నారు. అతిత్వరలో వీటి సంఖ్య 50వేలకు చేరనుందని మంత్రి సభలో వెల్లడించారు. టిమ్స్ ఆస్పత్రుల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయని, సూపర్ స్పెషాలిటీల్లో నర్సింగ్, పారామెడికల్ కోర్సులతో పాటు గుండె, మూత్రపిండాలు, లివర్, ఊపిరితిత్తులు, కేన్సర్, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ తదితర 30 విభాగాలుంటాయన్నారు. 200 మంది ఫ్యాకల్టి, 500 మంది వరకు రెసిడెంట్ వైద్యులు, 26 ఆపరేషన్ థియేటర్లు, గుండెకు సంబంధించి క్యాథ్ ల్యాబ్, కిడ్నీలకు డయాలసిస్, కేన్సర్‌కు రేడియేషన్, కీమోథెరపీతో పాటు సీటీస్కాన్, ఎంఆర్ఎస్ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి ఆస్పత్రిలో 300 ఐసీయూ పడకలతోపాటు వెంటిలేటర్ బెడ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మంత్రి హరీశ్ మండలిలో ప్రవేశపెట్టిన టిమ్స్ బిల్లు–2023ని సభ ఆమోదించింది. వీటితో పాటు కర్మాగారాల సవరణ బిల్లు–2023, జైనులను మైనార్టీలుగా గుర్తిస్తూ మైనార్టీ కమిషనర్ సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, పంచాయతీ సవరణ బిల్లుల్ని కూడా శాసనమండలి ఆమోదించింది. -
ఇక ప్రజారోగ్యానికి మహర్దశ
దశాబ్దాలుగా సర్కారు వైద్యంపై పాలకులు చూపిన అంతులేని నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కోల్పోయి, ప్రైవేటు వైద్యం వైపు మళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ పేదలకు సర్కారు వైద్యం పట్ల మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తోంది. పేదలకు ఉచితంగా నాణ్యమైన, ఆధునిక వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనలు ఆచరణలోకి వస్తున్నాయి. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అమలుచేస్తూ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూనే... మరోవైపు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నలు మూలలా నాలుగు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), వరంగల్‌లో హెల్త్ సిటీ, 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి చారిత్రక నిర్ణయాలతో ప్రభుత్వ వైద్య వ్యవస్థకు జీవం పోస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో యుద్ధప్రాతిపాదికన గచ్చిబౌలిలో ఖాళీగా ఉన్న భవనాలను వినియోగించుకొని 1,500 పడకలతో మొదటి టిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వేలాదిమంది కరోనా రోగులకు ఈ ఆసుపత్రి వైద్యాన్ని అందించి జీవం పోసింది. ఇదే స్ఫూర్తితో నగరానికి మిగతా మూడు వైపులా కూడా టిమ్స్‌లు నిర్మించాలనే బృహత్తర ఆలోచనను ముఖ్య మంత్రి కేసీఆర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 26వ తేదీన రూ. 2,679 కోట్లతో సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సనత్‌నగర్ పరిధిలోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో, ఎల్బీ నగర్‌లోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో, అల్వాల్‌లోని బొల్లారంలో టిమ్స్‌లు నిర్మాణం అవుతున్నాయి. ప్రతీ ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 300 పడకలు ఐసీయూలో ఉంటాయి. అన్ని పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉంటుంది. ఒక్కో టిమ్స్ 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. మొత్తం 30 విభాగాల్లో 200 మంది టీచింగ్ డాక్టర్లు, 500 మంది రెసిడెంట్ డాక్టర్లు సేవలు అందిస్తారు. ప్రతి టిమ్స్‌లో 16 ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టిమ్స్ నిర్మాణం పూర్తి అయితే ప్రస్తుతం ఉన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపైన ఒత్తిడి తగ్గుతుంది. ఆయా ఆసుపత్రు ల్లోనూ వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. బస్తీల్లో బస్తీ దవాఖానాలు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయి. పల్లెల్లో పల్లె దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. గతంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు దశాబ్దాల కోరికగా ఉండేది. మెడికల్ కాలేజీల కోసం ఉద్యమాలు జరిగేవి. కానీ, ఇప్పుడు 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. (చదవండి: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?) ఇక వరంగల్‌లో రూ.1,100 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న హెల్త్ సిటీ కూడా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో గొప్పగా నిలవబోతోంది. అలాగే ఇప్పటికే ఉన్న ఎంజీఎంతో పాటు కాకతీయ మెడికల్ కాలేజీని కలిపి వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ప్రజలు వైద్యం కోసం వరంగల్‌కు వస్తుంటారు. అందువల్ల హెల్త్ సిటీ నిర్మాణం చాలా మేలు చేయబోతోంది. ఈ విధంగా ప్రభుత్వం పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించే బృహత్తర యజ్ఞాన్ని ప్రారంభించింది. (చదవండి: కోఠి కాలేజ్ భవితవ్యం ఏమిటి?) - డాక్టర్ ఎన్. యాదగిరి రావు వ్యాసకర్త జీహెచ్ఎంసీ అదనపు కమీషనర్ -
ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్‌లు
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలో హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వీటి సేవలు ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని కంటోన్మెంట్, ఎయిర్‌పోర్టుల నిబంధనలు కూడా పరిగణనలోకి తీసుకొని నమూనాలు తయారు చేయాలని కోరారు. ఒక్కొక్కటి వెయ్యి పడకల సామర్ధ్యంతో కూడిన ఈ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రి హరీశ్‌రావు సోమవారం వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. వరంగల్ ఆసుపత్రికి టెండర్లు పూర్తి చేయండి వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. మరోవైపు పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా మరో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు త్వరగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.150 కోట్లతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. 20 ఆసుపత్రులకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్ సహా వివిధ జిల్లాల్లోని 20 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సుమారు రూ.59.25 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమీక్షల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారి నీతు కుమారి ప్రసాద్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, గణపతి రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో క్రీడా విధానమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఓ క్రీడా విధానమంటూ లేకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నిం చారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా గచ్చిబౌలి స్టేడియంలోని స్థలాన్ని ఇతర సంస్థలకు ఇవ్వడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గచ్చిబౌలి స్టేడియం టవర్‌లో టిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి చెందాలని అనుకున్నామన్నారు. అయితే దానికి భిన్నంగా స్టేడియం మధ్యలో ఐదెకరాల స్థలాన్ని టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించి, సంబంధం లేని వ్యక్తులతో పంచనామాపై సంతకం చేయించారని విమర్శించారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రాంతం లోని 25 ఎకరాల స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిపై మంగళవారం నుంచి క్రీడాకారులు, క్రీడా ప్రేమికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని స్టేడియాలని అభివృద్ధి చేయాల్సింది పోయి సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో రూ.50 కోట్లతో స్టేడియం, ఆర్థికమంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలో, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో స్టేడియాలు మంజూరు చేసుకోవడం ఏంటని రఘునందన్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో క్రీడా గ్రామాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ఏడేళ్ల కిందట చేసిన ప్రకటన ఏమైందని నిలదీశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు, క్రీడలకు ఏం సంబంధం? ఒలింపిక్ అసోసియేషన్‌లో ఆయన ఎందుకు వేలు పెట్టారని నిలదీశారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై 20 నెలలు దాటినా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. -
కోవిడ్ శవాలనూ, కొనఊపిరితో ఉన్నవారినీ వదల్లే
సాక్షి, గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ కేర్ టేకర్లుగా పనిచేసిన భార్యభర్తలు ఆ వృత్తికే కళంకం తెచ్చారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగులతో పాటు కోవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాల నుంచీ నగలు, సొత్తు కాజేశారు. మొత్తం ఏడు కేసులు నమోదైన ఉన్న వీళ్లని ఇలా చోరీ చేసిన సెల్‌ఫోన్ ఆధారంగానే గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు పూర్తి వివరాలు వెల్లడించారు. 2017లో నాగర్‌కర్నూల్ జిల్లా ధర్మపురికి చెందిన చింతపల్లి రాజు, లతశ్రీ ప్రేమ వివాహం చేసుకుని కూకట్పల్లి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజును సెకండ్ వేవ్ సమయంలో వైద్య సిబ్బంది జగద్గిరిగుట్ట నుంచి టిమ్స్‌కు తీసుకొచ్చేందుకు నియమించుకున్నారు. ఇలా ఏర్పడిన పరిచయాలతోనే తన భార్య లతశ్రీని టిమ్స్‌లో పేషెంట్ కేర్ టేకర్‌గా చేర్చాడు. కొన్నాళ్లకు రాజు కూడా అలాంటి ఉద్యోగంలోనే చేరాడు. అప్పుల్లో కూరుకుపోయిన వారి దృష్టి టిమ్స్‌లోని కోవిడ్ రోగులపై ఉన్న బంగారు ఆభరణాలపై పడింది. ఏప్రిల్ 17–మే 25 మధ్య ఏడు నేరాలు చేశారు. లతశ్రీ ముందుగా మృతదేహాలు ఉన్న చోటుకు వెళ్లి పరిశీలించేది. అక్కడ ఎవరూ లేకపోతే తన భర్త రాజును పిలిచేది. అక్కడకు వెళ్లే అతగాడు శవాలపై ఉన్న నగలు తీసి జేబులో వేసుకుని ఏమీ తెలియనట్లు డ్యూటీ చేసేవాడు. ఈ సొత్తును జగద్గిరిగుట్టలోని జగదాంబ జువెల్లర్స్‌లో కుదువ పెట్టి అప్పులు తీర్చడంతో పాటు జల్సాలు చేశారు. కేసు వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు కోవిడ్‌తో మరణించిన ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి దిద్దులు, యూసూఫ్‌గూడకు చెందిన పరహత్ సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు, దిద్దులు, జవహర్‌నగర్‌కు చెందిన భిక్షపతి తల్లి మెడలోంచి గుండ్ల మాల తస్కరించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగానే ఆమె ఒంటిపై ఉన్న నాలుగు బంగారు గాజులు కాజేశారు. ఈమెను మరో హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఈ విషయం గుర్తించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఈ భార్యభర్తలు టిమ్స్‌లో డ్యూటీకి వెళ్లడం మానేశారు. ఓ మృతదేహం నుంచి వీళ్లు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్ కూడా తస్కరించారు. ఇటీవల దీన్ని ఆన్ చేయడంతో పోలీసులకు క్లూ లభించి ఇద్దరూ చిక్కారు. విచారణలో తాము చేసిన నేరాలు అంగీకరించారు. వీరి నుంచి పది తులాల బంగారం సహా రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాదీనం చేసుకున్నారు. మరో రెండు సంస్థల్లో తాకట్టు పెట్టిన నాలుగు బంగారు గాజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల్ని పట్టుకున్న గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గోనె సురేష్ తదితరుల్ని అభినందించిన డీసీపీ రివార్డు ప్రకటించారు. -
మొన్న తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయిన సంజన..
సాక్షి, హిమాయత్‌నగర్: ‘కాళ్లు పట్టుకుంటా.. మా నాన్నను బతి కించండి’ అంటూ కనిపించిన వైద్యుల కాళ్లా వేళ్లాపడినా.. చివరకు నిస్సహాయస్థితిలో మొన్న తండ్రిని పోగొట్టుకున్న సంజన.. ఇప్పుడు తల్లినీ కోల్పోయింది. ‘మా అమ్మను బతికించండి సార్’ అంటూ టిమ్స్ వైద్యులను వేడుకుంటే, ‘మేం చూసుకుంటాం’ అని చెప్పి పంపిన వైద్యులు కాసేపటికే ‘మీ అమ్మ చనిపోయిందం’టూ చావు కబురు చెప్పారు. వారం వ్యవధిలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని ఇప్పు డు తమ్ముడితో కలిసి దైన్య పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన జగదీశ్, గీత దంపతులు. వీరికి సంజన, హనుమ సంతానం. జ్వరంతో బాధపడుతున్న తల్లికి సంజన ఈ నెల 5న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆమెను కింగ్‌కోఠిలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. వైద్యులు ఆక్సిజన్ బెడ్‌పై చికిత్స అందించారు. రెండ్రోజుల తర్వాత తండ్రికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించింది. కొద్దిరోజులకు తండ్రి పరిస్థితి విషమించింది. ఆయనకు ఐసీయూ బెడ్ సమకూర్చేందుకు సంజన ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అక్కడ కనిపించిన తెల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరి కాళ్లావేళ్లాపడింది. చివరకు బెడ్ దొరకని దయనీయ పరిస్థితుల్లో ఆయన ఈ నెల 13న మరణించారు. నాడు సంజన కన్నీరుమున్నీరైన తీరును, ఆమె వేదనను కళ్లకుకడుతూ ‘కాళ్లు పట్టుకుంటా.. మా నాన్నను బతికించండి’ శీర్షికతో ఈ నెల 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఎవరూ కనికరించలేదు.. వారం వ్యవధిలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన దురదృష్టవంతురాలిని. తండ్రిని రక్షించుకునేందుకు కింగ్‌కోఠి ఆçస్పత్రిలో అందరి కాళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. తల్లినైనా కాపాడుకోవాలని తండ్రి శవా న్ని వదిలేసి ప్రైవేట్ ఆస్పత్రికి పరిగెత్తా. వాళ్లు నా బాధ పట్టించుకోలేదు. అమ్మ ను రక్షించండి.. అని మంత్రి కేటీఆర్‌ను వాట్సాప్‌లో రిక్వెస్ట్ చేశా. ఆయన స్పందించి ఆస్పత్రికి ఫోన్ చేయిస్తే, ఫోన్ చేయిస్తావా అంటూ వైద్యులు కసురుకున్నారు. అక్కడ అమ్మకు సరిగా వైద్యం అందదనే భయంతో గచ్చిబౌలిలో ‘టిమ్స్’కు తీసుకెళ్లా. పడకల్లేవంటూ సమయం వృథాచే యడంతో అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు, తమ్ముడికి పాజిటివ్. – సంజన ఫిర్యాదు చేసిందని ప్రైవేట్ ఆస్పత్రి వీరంగం తండ్రి చనిపోయిన అరగంటకే తల్లి గీత పరిస్థితి విషమించింది. ఒకపక్క తండ్రి మృతదేహం.. ఆ బాధను దిగమింగుకుంటూనే సంజన.. తల్లిని కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి కర్మన్‌ఘాట్ బైరామల్‌గూడలోని ఓ ప్రెవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు గీతను సరిగా పట్టించుకోకపోగా, ఒక్కరోజుకే రూ.2 లక్షలు బిల్లు వేశారు. అసలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంజన తల్లినైనా కాపాడుకోవాలనుకుంది. మంత్రి కేటీఆర్ వాట్సాప్ నంబర్‌ను సంపాదించి ‘నా తల్లిని రక్షించండి’ అంటూ ఈ నెల 15న మెసేజ్ చేసింది. దీనికి ‘ఓకే’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చిన అరగంటకే సదరు ఆస్పత్రికి ఫోన్ వెళ్లింది. అంతే.. కొద్దిసేపటికే ఆమెపై ఆస్పత్రి యాజమాన్యం మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ విరుచుకుపడింది. వీల్‌చైర్‌లోనే తుదిశ్వాస.. సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సరిగా చూడటం లేదని భావించిన సంజన.. తల్లిని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించింది. అక్కడా బెడ్స్ ఖాళీలేని పరిస్థితి.. దీంతో వైద్యులు సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం రాత్రి 2 గంటల వరకు వీల్‌చైర్‌లోనే ఉంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌పైనే గీతకు చికిత్స అందించారు. ‘ఏదైనా బెడ్ ఖాళీ కాగానే చేరుస్తాం. మీరు వెళ్లిపోండి. మేం చూసుకుంటాం’ అని వైద్యులు సంజనకు చెప్పారు. ఆ కొద్దిసేపటికే తల్లి చనిపోయిందంటూ వైద్యుల నుంచి ఫోన్ వచ్చింది. కథనం చూసి చలించా తండ్రిని బతికించుకోడానికి సంజన పడిన తపన గురించి ‘సాక్షి‘లో చదివాను. మనసు చివుక్కుమంది. వెంటనే సంజనకు, హనుమకు కోవిడ్ టెస్టులు చేయించాను. అంబులెన్స్‌ను, కొంత డబ్బును సమకూర్చాను. వాళ్ల తల్లిని బతికించాలని, డబ్బు ఎంత ఖర్చయినా భరిస్తానని ప్రైవేటు ఆసుపత్రి వాళ్లతో మాట్లాడాను. కానీ, పేషెంట్ పరిస్థితిని నాకుగానీ, సంజనకుగానీ వారు చెప్పలేదు. – శ్రావ్య మందాడి, ‘వీ అండ్ షీ’ వ్యవస్థాపకురాలు -
Covid-19: ఆస్పత్రిలో బెడ్స్ కావాలా?
లక్డీకాపూల్: కోవిడ్ సెకండ్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి. అతికష్టం మీద పడక సమస్య తీరినా.. వెంటిలేటర్ ఖాళీ లేకపోవడమో.. లేక ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం లేని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు మీ కోసం ‘సాక్షి’ అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు టిమ్స్, గచ్చిబౌలి – 94949 02900 గాంధీ – 93922 49569 ఈఎస్ఐ, సనత్‌నగర్ – 77029 85555 జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 80085 53882 ఉస్మానియా – 98499 02977 మిలిటరీ హాస్పిటల్, తిరుమలగిరి – 78895 29724 నిలోఫర్ – 94406 12599 చెస్ట్ హాస్పిటల్ – 99492 16758 ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట – 93470 43707 ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట – 98662 44211, ఏరియా హాస్పిటల్, గోల్కొండ – 94409 38674 ఏరియా హాస్పిటల్, నాంపల్లి – 80085 53888 సీహెచ్‌సీ రాజేంద్రనగర్ – 80085 53865 ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం – 80085 53912 జిల్లా దవాఖాన, కొండాపూర్ – 94400 61197 సీహెచ్‌సీ, హయత్‌నగర్ – 80085 53863 ప్రైవేట్ ఆసుపత్రులు కిమ్స్, కొండాపూర్ – 98495 54428 ఆదిత్య బొగ్గులకుంట – 99851 75197 అపోలో జూబ్లీహిల్స్/కంచన్ బాగ్ – 92462 40001 రెయిన్ బో, బంజారాహిల్స్ – 99591 15050 ఒమేగా, బంజారాహిల్స్ – 98480 11421 సెయింట్ థెరిస్సా, ఎర్రగడ్డ – 90320 67678 మల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్, సూరారం – 98498 91212 వివేకానంద, బేగంపేట – 99482 68778 కేర్, బంజారాహిల్స్/ హైటెక్‌సిటీ – 99560 69034 నోవా – 93917 11122 కామినేని – 94910 61341 అస్టర్ ప్రైమ్, అమీర్‌పేట – 91777 00125 వాసవి, లక్డీకాపూల్ – 98481 20104 యశోద – 99899 75559, 93900 06070 మల్లారెడ్డి ఆస్పత్రి, సూరారం – 87903 87903 రవి హిలియోస్, ఇందిరాపార్క్ – 98490 84566 ఇమేజ్, అమీర్‌పేట/మాదాపూర్ – 90000 07644 ప్రతిమ, కాచిగూడ 99593 61880/ 97039 90177 ఏఐజీ, గచ్చిబౌలి –040–4244 4222, 6744 4222 విరించి, బంజారాహిల్స్ – 040 4699 9999 మెడికోవర్, మాదాపూర్ – 040 68334455 సన్ షైన్ – 040 44550000, 80081 08108 దక్కన్ – 90000 39595, స్టార్, బంజారాహిల్స్ – 040 4477 7777 మమత–బాచుపల్లి – 78932 11777 ఆయాన్ ఇన్స్టిట్యూట్ కనకమామిడి – 98496 05553 మెడిసిటీ ఇన్స్టిట్యూట్ , మేడ్చల్ – 97037 32557 వీఆర్కే మెడికల్ కాలేజీ, మెయినాబాద్ – 99859 95093 షాదన్ మెడికల్ కాలేజీ, హిమాయత్‌సాగర్ – 98482 88697 చదవండి: Bachupally: 840 ఫ్లాట్స్.. 320 విల్లాలు: 24/7వలంటీర్లు -
ఆక్సిజన్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కు అవసరమైన ఆక్సిజన్ కొరత లేకుండా చేసే దిశగా ప్రభుత్వ యత్నాలు ఫలించాయి. ఒడిశా నుంచి రాష్ట్రానికి తొలిదఫా 6 ట్యాంకర్లలో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ చేరుకుంది. ట్యాంకర్లు రోడ్డు మార్గాన ఒడిశాలోని అం గూల్ ప్లాంట్‌కు వెళ్లి, తిరిగి వచ్చేందుకు వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వేగంగా ఆక్సిజన్ రప్పించేందుకు ఖాళీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఒడిశాకు తరలించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ నింపుకొని రాష్ట్రానికి చేరుకున్న ట్యాం కర్లను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించినట్టు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత మొదలయ్యే పరిస్థితిలో వెంటనే ఎయిర్‌ఫోర్స్ సహాయంతో ఆక్సిజన్ తెప్పించాలని సీఎం నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాష్ట్ర అధికారులు.. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 విమానాల్లో తొమ్మిది ఖాళీ ట్యాంకర్లను ఈ నెల 23న హైదరాబాద్ నుంచి ఒడిశాలోని అంగూల్ ప్లాంట్‌కు పంపారు. ఈ ట్యాంకర్లు అక్కడ ఆక్సిజన్ నింపుకొని రోడ్డు మార్గంలో రాష్ట్రానికి బయలుదేరాయి. సోమవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. మొదట్లో రూర్కెలా, అంగూల్ రెండు ప్లాంట్ల నుంచీ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని భావించినా.. రూర్కెలా ప్లాంట్ అక్కడి విమానాశ్రయానికి మరీ దూరంగా ఉండడంతో.. ప్రస్తుతానికి అంగూల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 350 టన్నుల మేర ఆక్సిజన్ అవసరమని చెప్పారు. వంద టన్నుల మేర ఇక్కడ ఉత్పత్తి అవుతోందని, మరో 300 టన్నుల మేర దిగుమతి చేసుకోవాల్సి ఉందని వివరించారు. కేంద్రం ఒడిశా నుంచి రాష్ట్రానికి 250 టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని, ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆస్పత్రులకు ఆక్సిజన్.. రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్‌ను అవసరమైన ఆస్పత్రులకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్లలో ఒకదానితో గచ్చిబౌలిలోని టిమ్స్, ఛాతీ వైద్యశాల, కింగ్ కోఠి ఆస్పత్రులకు ఆక్సిజన్ అందించారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పరిస్థితి చేయి దాటుతుండడంతో.. అక్కడి రోగులను, కరోనా బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఆస్పత్రుల్లో పరిస్థితి చక్కబడనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడకుండా.. అవసరాల మేరకు సరఫరా చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నేడు మరో ఎనిమిది ట్యాంకర్లు అంగూల్‌కు.. మంగళవారం మరో ఎనిమిది ఖాళీ ట్యాంకర్లను విమానాల ద్వారా ఒడిశాలోని అంగూల్ ప్లాంట్‌కు తరలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ట్యాంకర్లు ఆక్సిజన్ నింపుకొని ఈ నెల 30వ తేదీ నాటికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటాయని వెల్లడించాయి. వాటిలో సుమారు 120 టన్నుల ఆక్సిజన్ వస్తుందని వివరించాయి. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతోందని, ఈ మేరకు కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. ‘ఆక్సిజన్’ రథసారథులు ఆర్టీసీ డ్రైవర్లే ఒడిశాలోని అంగూల్‌లో ఆక్సిజన్ నింపుకొన్న ట్యాంకర్లను వందల కిలోమీటర్ల దూరం నడిపి భద్రంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది ఆర్టీసీ డ్రైవర్లే. ఈ నెల 23న ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపిన విషయం తెలిసిందే. మండే స్వభావమున్న ఆక్సిజన్‌ను అంత దూరం నుంచి తరలించడం కత్తిమీద సాము వంటిది. ట్యాంకర్లను నిర్దేశిత వేగంతో జాగ్రత్తగా నడపాలి. ఇందుకోసం డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యం ఉన్న సీనియర్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ 20 మంది డ్రైవర్లను ఎంపిక చేసింది. అందులో 10 మంది డ్రైవర్లు ఖాళీ ట్యాంకర్లతో విమానంలో ఒడిశాకు వెళ్లారు. విమానాశ్రయం నుంచి అంగూల్ ప్లాంట్‌కు ట్యాంకర్లతో వెళ్లి.. ఆక్సిజన్ నింపుకొని రాష్ట్రానికి తీసుకువచ్చారు. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఖాళీ ట్యాంకర్లతో మరికొందరు ఆర్టీసీ డ్రైవర్లు ఒడిశాకు వెళ్తున్నారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
టీమ్స్ కు క్యూ కడుతున్న భాదితులు
-
స్ఫూర్తిగా నిలుస్తున్న వైద్య సిబ్బంది
గచ్చిబౌలి (హైదరాబాద్): కరోనా పాజిటివ్ పేషెంట్లకు నిర్విరామంగా చికిత్స అందిస్తూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్ఫూర్తి నింపుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రికి అవసరమైనంత మంది డాక్టర్లను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను మంత్రి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉం టుందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులలో లేని సదుపాయాలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్నాయని, విశాలమైన గదులలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజక్షన్లు లేవని ప్రైవేట్ ఆస్పత్రులు చేతులు ఎత్తివేస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులలో చేరిన వారికి అత్యాధునిక, ఖరీదైన వైద్యం అందిస్తున్నామని, బాధితులు ఇక్కడే చికిత్స చేయించుకోవాలన్నారు. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు. చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి మాట్లాడి వారిలో భరోసా నింపారు. చికిత్స, భోజనం ఎలా ఉందని ఆరా తీశారు. సదుపాయాలపై పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారని తెలి పారు. అనంతరం అక్సిజన్ కొరత లేకుండా చూడా లని టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్‌ను ఆదేశించారు. టిమ్స్‌లో 1,035 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా చికిత్సకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని చెప్పారు. రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేస్తున్నట్లు ప్రైవైట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో విచారణకు కమిటీ ఏర్పాటు చేశామ న్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. -
కరోనా వైద్య సేవలపై మంత్రి ఈటల రాజేందర్ ఆరా..
-
కరోనా వైద్యం ఖరీదైంది కాదు: మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సందర్శించారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్వాంటీన్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో అంకితభావంతో సేవలందిస్తున్నారని తెలిపారు. టిమ్స్‌ను పూర్తిస్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చామని తెలిపారు. ఆసుపత్రిలో 1350 పడకలు, ల్యాబ్‌లు, ఐసీయూ అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్, మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి రాజేందర్ తెలిపారు కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే వంద శాతం కరోనా బారి నుంచి బయట పడతామన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ద్వారా అధిక మంది బాధపడుతున్నారని, ఆక్సిజన్ అందించిన కూడా కొందరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. కరోనా వైద్యం ఖరీదైనది కాదని, పదివేల లోపే ఖర్చువుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఫీజులపై సమీక్ష నిర్వహించామని, సామాన్యులను పీక్కుతినే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైద్య కేంద్రాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో కింగ్ కోఠి, చెస్ట్, సరోజిని,టిమ్స్, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయని వెల్లడించారు. కరోనా ఆసుపత్రుల్లో సరిపోయే బెడ్స్ ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని మంత్రి సూచించారు. టిమ్స్‌లో కొందరు కరోనా బాధితులతో మాట్లాడానని, వైద్యం బాగుందని చెబుతున్నారని తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ వారం రోజుల్లో పెట్టిస్తామన్నారు. ఫీవర్, చెస్ట్, ఉస్మానియా, సరోజిని, కింగ్‌కోఠి, వరంగల్ ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ పెడుతున్నామని మంత్రి రాజేందర్ పేర్కొన్నారు. -
వామ్మో.. అక్కడా..!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరినుంచి వస్తుందో అర్థంకాక జనం బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో పనిచేసేందుకు సిబ్బంది కూడా వెనుకంజ వేస్తున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్న వారు మినహాయిస్తే..కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కింద పని చేస్తున్న స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల్లో ఇప్పటికే 30 శాతం మంది అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే మానేస్తున్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారు భయంతో విధులకు దూరంగా ఉంటుంటే...ప్రభుత్వం ఆయా సెంటర్లలో రెగ్యులర్ కాకుండా తాత్కాలిక ప్రతిపాదికన చేపడుతున్న నియామకాలకు స్పెషాలిటీ వైద్యులు సహా టెక్నీషియన్లు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటికే గచ్చిబౌలిలోని 14 అంతస్తుల్లో 1500 పడకలతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)పరిస్థితి ప్రశ్నా ర్థకంగా మారింది. పది రోజుల క్రితమే సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఇది అందుబాటులోకి రాకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. ఉస్మానియా సహా ఇతర టీచింగ్ ఆస్పత్రులు, జిల్లాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఇప్పటికే కొంత మందిని ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ..వారు కూడా ఇక్కడ పని చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం విశేషం. ఆ స్టాఫ్ నర్సుల్లో ఆందోళన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్) సహా గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్ సహా పలు కోవిడ్ సెంటర్లలో విధులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సుల నియమాకా నికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా మంది స్టాఫ్ నర్సులు ధైర్యంతో ఇక్కడ పని చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాంట్రాక్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 152 మందిని ఎంపిక చేసి, వీరిలో కొంత మందిని గాంధీ కోవిడ్ సెంటర్‌కు పంపింది. ఆ మేరకు వారంతా ఇటీవల గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. కాంట్రాక్ట్ ప్రతిపాదిక కింద ఇటీవల ఎంపిక చేసిన నర్సులకు తీరా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద నియమించినట్లు తెలిసి వారు ఆందోళనకు దిగారు.‘గాంధీ’లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణాలను రిస్క్‌లో పెడతారా? నిజానికి ఒక డాక్టర్ ప్రొఫెసర్ స్థాయికి చేరుకోవాలంటే కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వీరంతా ఇప్పటికే ఎక్కడెక్కడో సెటిలైపోయారు. ఇలాంటి వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి... కేవలం ఏడాది తాత్కాలిక ఉద్యోగం కోసం టిమ్స్‌కు ఎలా వస్తారు? కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క ఏడాది కోసం ఏ డాక్టరైనా తమ ప్రాణాలను ఫణంగా పెడతాడా? ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఏపీలో వేల పోస్టులను రెగ్యులర్ బేసిస్‌పై రిక్రూట్మెంట్ చేస్తుంటే..తెలంగాణలో మాత్రం తాత్కాలిక పేరుతో నోటిఫికేషన్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? – డాక్టర్ శ్రీనివాస్, ప్రతినిధి,తెలంగాణ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ -
హైదరాబాద్‌లో నర్సుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 150మంది నర్సులు ఆందోళనకు దిగారు. ‘టిమ్స్’లో కరోనా సేవల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపడతామని చెప్పిన అధికారులు మాట తప్పారంటూ నిరసన చేపట్టారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న తమను నోటిఫికేషన్ అంటూ తీసుకొచ్చి రోడ్డున పడేశారని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతి అంటూ తమని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. నర్సులు తమ ఆందోళనను కొనసాగిస్తూ... తమ సమస్యపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించాలని డిమాండ్ చేశారు.(చదవండి : ‘హైదరాబాద్ నగరాన్ని గాలికొదిలేశారు’) -
టిమ్స్ రెడీ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. శనివారం బీఆర్కే భవన్లో కోవిడ్–19 నిపుణుల కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిమ్స్‌లో ఐపీ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. మొత్తం 499 పోస్టులకు 13 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో అర్హులను నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌ల పనితీరుపై నిపుణుల కమిటీ చేసిన తనిఖీల్లో మార్గదర్శకాలు పాటించని వాటిని గుర్తించి, నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్న పరీక్షల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్యలో ఉన్న అవకతవకలపై కమిటీ విస్తృతంగా పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. కొన్ని ల్యాబ్‌లలో 70 శాతం కేసులు పాజిటివ్ రావడంపైనా కమిటీ సునిశితంగా పరిశీలన చేయనుందని చెప్పారు. ఆ తర్వాత ఆయా ల్యాబ్‌ల్లో గుర్తించిన లోపాలు, నివారణ చర్యలు కూడా కమిటీ సూచించనుందని వెల్లడించారు. పొరపాట్లు చేస్తున్న ల్యాబ్‌లకు మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లలో జరుగుతున్న పరీక్షల తీరుపై ప్రభుత్వ ల్యాబ్‌ల మాదిరిగా నిరంతర పర్యవేక్షణ, తరచుగా వాలిడేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అన్నీ ల్యాబ్‌లు ఐసీఎంఆర్, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షల సంఖ్య పెంచే అంశంపై స్పందిస్తూ పరీక్షల సామర్థ్యం 6,600కు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం మార్పులతో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు చాలా మంది ప్రజల్లో కనిపిస్తున్నాయని, కరోనా వైరస్ సోకిన వారికి సైతం ఇలాంటి లక్షణాలు ఉండటంతో ప్రజల్లో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జంట నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంపైనా మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్, ప్రొఫెసర్ విమలా థామస్ పాల్గొన్నారు. -
‘టిమ్స్’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) కు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నట్టు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. ‘టిమ్స్’లో ప్రభుత్వం సీవరేజ్ ప్లాంటు ఏర్పాటు చేయలేదని, దీంతో మురుగునీరు పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళుతున్న విషయాన్ని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకు వచ్చారని, ఈ ప్లాంటు నిర్మాణం కోసం నిధులు ఇస్తునట్టు ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. చదవండి: ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్ -
టిమ్స్ ఆస్పత్రికి రూ. 25 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్, యోగాధ్యయన పరిషత్, ఆయుష్ వంటి విభాగాలకు నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ. 274 కోట్లు మంజూరు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కరోనా చికిత్సకోసం ఏర్పాటు చేసిన టిమ్స్ ఆస్పత్రికి రూ.25 కోట్లు కేటాయించారు. 1,500 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ఆధునీకరణ, మరమ్మతుల పనుల కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. ఆయా పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టాలని టీఎస్ఎంఎస్ఐడీసీని ఆదేశించారు. ఇదిలావుండగా వైద్య విధాన పరిషత్‌కు రూ. 107.43 కోట్లు, ఇంకో పద్దు కింద రూ.12 కోట్లు, నిమ్స్‌కు రూ. 28.46 కోట్లు, డీఎంఈ పరిధిలోకి వచ్చే బోధనాసుపత్రుల కోసం ఒక పద్దు కింద రూ. 41.66 కోట్లు, మరో పద్దుకింద రూ. 1.18 కోట్లు మంజూరు చేశారు. ఇక మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రూ. 23 లక్షలు మంజూరు చేశారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రూ. 12 కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌కు ఒక పద్దుకింద రూ. 37.38 కోట్లు, ఇంకో పద్దు కింద రూ. 1.20 కోట్లు మంజూరు చేశారు. టిమ్స్ ఆస్పత్రిగా గచ్చిబౌలి స్పోర్ట్స్ భవనం సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి వద్ద ఉన్న స్పోర్ట్స్ హాస్టల్ భవనాన్ని ఇకపై తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ (టిమ్స్)గా పిలవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని తొలుత కరోనా ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని, అనంతరం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్‌గా విస్తరిస్తామని శనివారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఈ భవనంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. స్పోర్ట్స్ హాస్టల్ భవనంతో పాటు, 9.16 ఎకరాల్లో ఆస్పత్రి ప్రారంభించి, ఆపై మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కమ్ ప్రీమియర్ మెడికల్ కాలేజీగా అభివృద్ధి చేస్తారు. -
గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి ప్రారంభం..
సాక్షి, హైదరాబాద్ : కరోనా చికిత్సలు అందించేందుకు హైదరాబాద్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలోని 13అంతస్తుల భవనంలో 1500 పడకలతో ఉస్మానియాకు అనుబంధంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో సోమవారం నుంచి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఇకపై సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన పనిలేదు. ఐటీ కారిడార్‌లోని హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్‌తోపాటు టోలిచౌకి, గోల్కొండ, వికారాబాద్ నుంచి వచ్చే వారికి ఈ కొత్త ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందుతాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఆస్పత్రిలో పూర్తిగా వైరస్ బారిన పడిన వారికే వైద్యం అందించనున్నారు. ఈ ఆస్పత్రిని కేవలం 20రోజుల్లోనే రెడీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. -
డయలేదాయె!
♦ డయాగ్నోస్టిక్ సెంటర్ లేనట్టే! ♦ రూ.12కోట్లు ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ♦ ఈసారికి సారీ అని మౌఖిక ఆదేశాలు ♦ కర్నూలు పెద్దాసుపత్రికి మరో అన్యాయం కర్నూలు(హాస్పిటల్): అడిగేవారులేరని ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెనక్కి తీసేసుకుంటోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను తుంగభద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) చేస్తామని, కర్నూలులో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ హామీలకు తూట్లు పొడిచారు. తాజాగా ఆసుపత్రికి ఏడాదిన్నర క్రితం మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను కూడా రద్దు చేశారు. ఈ విషయమై వైద్యవర్గాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా నుంచే గాక వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, ప్రకాశం, మహబూబ్‌నగర్, రాయచోటి, బళ్లారి జిల్లాల నుంచి ప్రతిరోజూ 3వేల మంది దాకా రోగులు చికిత్స నిమిత్తమై వస్తుంటారు. వీరేగాక నిత్యం 1400 నుంచి 1500మంది రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంటారు. వీరందరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే ఆసుపత్రిలో పెద్ద ప్రహసనంగా ఉంటోంది. ఒక్కో వైద్యపరీక్ష ఒక్కోచోట ఏర్పాటు చేయడంతో రోగులకు ఇబ్బందిగా మారింది. అవుట్ పేషెంట్ల వైద్యపరీక్షలకు 33వ నం బర్లో, ఇన్పేషంట్లకు 24వ నెంబర్లో, బ్లడ్‌గ్రూప్ చేయించుకోవాలంటే 19వ నెంబర్లో, హెచ్ఐవీ, హెచ్‌బీసీ వంటి పరీక్షలు చేయించుకోవాలంటే ఏఆర్టీ సెంటర్ వద్ద, కొన్ని రకాల బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలంటే మెడికల్ కాలేజిలోని పెథాలజి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎంఆర్ఐ, సిటిస్కాన్ పరీక్షలు ఒకచోట, ఎక్స్‌రే పరీక్షలు నాలుగు చోట్ల, అల్ట్రాసౌండ్ పరీక్షలు ఒకచోట చేస్తారు. నిత్యం ఆసుపత్రిలో సంచరించే వారికే ఒక్కోసారి ఏ బ్లాక్ ఎక్కడ ఉందో, ఏ పరీక్ష ఎక్కడ చేస్తారో అర్థం కాదు. వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి తిరిగేందుకు గంట సమయం పడుతుంది. ఇక వాటి నివేదికలు రావాలంటే ఒక్కోసారి రెండు నుంచి వారం రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కో పరీక్ష ఒక్కో చోట గాకుండా అన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ.12కోట్ల అంచనాతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు జీవో జారీ చేసింది. నోరుమొదపని ప్రజాప్రతినిధ/లు.. రెండేళ్ల క్రితం మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మోకాలొడ్డుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్లానింగ్ మార్చాలని చెబుతూ రెండేళ్ల పాటు నిర్మాణం జరగకుండా జాప్యం చేశారు. ఆరు నెలల క్రితం డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పార్కింగ్ స్థలాన్ని కూడా ఎంపిక చేసి మట్టి పరీక్షలు కూడా నిర్వహించి ఓకే చేశారు. కానీ ఏమైందో ఏమో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దీని నిర్మాణం గురించి అడగొద్దంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ భవనం వస్తే అన్ని రకాల పరీక్షలు ఒకేచోట చేయించుకోవచ్చన్న రోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిదులు సైతం ప్రశ్నించకపోవడంతో రూ.12కోట్లు కాస్తా గుంటూరు జిల్లాకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలుకు తీరని అన్యాయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలుకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టిమ్స్, రిమ్స్, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ చెప్పినా ఏవీ అమలు కాలేదు. తాజాగా రూ.12కోట్లతో మంజూరైన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను సైతం ఇతర ప్రాంతానికి తరలించాలని చూడటం దారుణం. ఇది కర్నూలు జిల్లా వాసులకు తీరని అన్యాయం. ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులను నమ్ముకుని ఎంతో మంది రోగులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి మరిన్ని మెరుగైన వైద్యసౌకర్యాలు అందించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా సమీక్షించి ఆసుపత్రిని అభివృద్ధి పరచాలి. –డాక్టర్ రామకృష్ణనాయక్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కర్నూలు కార్యదర్శి -
టిమ్స్.. టెన్షన్స్
► ప్రైవేట్ వ్యక్తులకు ‘టిమ్స్’ అందజే యడంపై కార్మిక సంఘాల ఆగ్రహం ► ఆర్టీసీ యాజమాన్య నిర్ణయం సరి కాదంటున్న కార్మికులు ► అడ్డుకునేందుకు సై అంటున్న వైనం పట్నంబజారు (గుంటూరు): ఏపీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించడానికి యాజమాన్యం చేపడుతున్న కొన్ని చర్యలు కార్మికుల ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాటిలో డ్రైవర్ కం కండక్టర్ విధానమూ ఒకటి. దీని ద్వారా కండక్టర్‌తో పని లేకుండా నేరుగా డ్రైవరే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ విధానం అమలవుతున్న సంగతి విదితమే. స్థానిక సర్వీసుల్లోనూ ఇదే విధానాన్ని ప్రవేశ పెట్టి దశల వారీగా కండక్టర్ల సంఖ్యను కుదించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్నది యాజమాన్యం ఎత్తుగడ. ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలుండగా వాటిపై దృష్టి సారించకుండా ఉద్యోగుల సంఖ్యను కుదించడం ద్వారానే ఆర్థిక భారం తగ్గించుకోవాలని చూస్తున్న తీరుపై కార్మిక వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇటీవల యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలూ వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగిస్తుండటంతో కార్మికులు ఆందోళన బాట పట్టనున్నట్లు వారు చెబుతున్నారు. నేతలపై కేసుల నమోదు.. ప్రసుత్తం రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి అద్దె బస్సులూ దూరప్రాంతాలకు తిరుగుతున్నాయి. గతంలో ఒక్కో బస్సులో డ్రైవర్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి, ఆర్టీసీ కండక్టర్లు విధులు నిర్వర్తించే వారు. ఇటీవల యాజమాన్యం అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులకే సర్వాధికారాలు అప్పగించింది. దీంతో కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కొన్నిరోజుల కిందట గుంటూరు డిపో నుంచి విశాఖపట్నానికి పైవేట్ బస్సు పంపిస్తూ, దానిలో హైర్ బస్సు వ్యక్తికే టిమ్‌ను అప్పగించటంతో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును కదలనివ్వమని రాస్తారోకో దిగారు. దీనిపై పాతగుంటూరు పోలీసుస్టేషన్లో ఎన్ఎంయూ నేతలపై కేసు కూడా నమోదయింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు తాత్కాలికంగా ఆర్టీసీ డ్రైవర్‌ను కండక్టర్‌గా పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొన్నాళ్ల క్రితం కృష్ణా జిల్లా నూజీవీడు డిపోకు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ప్రైవేటు వ్యక్తి వేలల్లో డబ్బులు తీసుకుని పరారడయ్యాడని కార్మిక నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పోరుకు సన్నాహాలు.. హైర్ (అద్దె) బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించటంపై కార్మిక సంఘాలు పోరుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నాయి. యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామంటున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాల నేతలు హైర్ బస్సుల్లో ప్రైవేట్ వ్యక్తులకు టిమ్ములు అప్పగించ చూస్తే సహించొద్దని ఆయా డిపోల నేతలకు మౌఖికంగా చెప్పినట్లు సమాచారం. రీజియన్ పరిధిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోసారి పునరావృతమైతే సహించొద్దన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఆఖరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే !