‘మిషన్ కాకతీయ’తో మమేకం అవుదాం | gaddar calls to public mission kakatiya | Sakshi
Sakshi News home page

‘మిషన్ కాకతీయ’తో మమేకం అవుదాం

Published Tue, Feb 24 2015 12:13 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

‘మిషన్ కాకతీయ’తో మమేకం అవుదాం - Sakshi

‘మిషన్ కాకతీయ’తో మమేకం అవుదాం

తూప్రాన్: ప్రభుత్వం చేపడుతున్న ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములమవుదామని ప్రజాగాయకుడు గద్దర్  ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్రలో భాగంగా తొలిరోజు సోమవారం మండల పరిధిలోని కాళ్లకల్, కూచారం, జీడీపల్లి, మనోహరాబాద్, రామాయిపల్లి, ఇమాం పూర్, లింగారెడ్డిపేట, రావెల్లి గ్రామాల్లో ని చెరువులను సందర్శించారు.

డప్పు, ఓగ్గు కళాకారులతో కలిసి గ్రామల్లోని ప్రజలను, విద్యార్థులను మమేకం చేస్తూ చెరువు నుంచి చెరువుకు సాంస్క ృతిక పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఈఈ ఆనం ద్, గఢా అధికారి హన్మంతరావు, విద్యావంతుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ తిప్పర్తి యాదయ్య, మాల్కాజిగిరి ఎమ్మెల్యే కనకరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిలు హాజరయ్యారు. వారంతా గద్దర్‌తో కలిసి ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా గద్దర్ తన పాటలతో ప్రజలను, విద్యార్థులను ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా గద్దర్  ‘అమర వీరులకు జోహర్లు, జై తెలంగాణ’ అని రాసి ఉన్న చొక్కాను ధరించారు. తన కాళ్లకు గజ్జె లు కట్టి పాటలు పాడుతూ గ్రామాల్లో ప్రజలను ఆకట్టుకున్నారు.

మొదట కాళ్లకల్ బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పాదయాత్రగా గ్రామ సమీపంలోని ఊర చెరువును సందర్శించి నీటిలో పూజలు జరిపారు. గ్రామస్తులతో  చెరువులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ అమరుల స్వప్నమైన జలకళ, పంట సిరుల్ని సాధించాలని సూచించారు. రాష్ట్రంలో చెరువుల పునర్నిర్మాణం పూర్తయితే కోటి ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వివరించారు.
 
1.20 కోట్ల ఎకరాల భూమి సాగవుతుంది..
తెలంగాణలోని 46 వేల చెరువులు పునరుద్ధరణ జరిగితే 265 టీఎంసీల నీరు నిల్వచేయవచ్చని, ఈ నీటితో 1.20 కోట్ల ఎకరాల భూమి సాగవుతుందని ఇరిగేషన్ శాఖ ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే అన్నారు. దేశంలోనే అత్యధిక చెరువులు గల రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారుతుందని వివరించారు. చెరువుల్లోని మట్టిలో అనేక పోషకాలు ఉంటాయని ఇది పొలాల్లో వేసిన పంటలకు లాభాం చేకురుతుందన్నారు. మన నీరు, మన భూములు, మన వనరులు మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. గద్దర్ చేపట్టిన కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుందున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని 1212 చెరువుల్లో మొదటి విడుతల్లో 606 చెరువులకు జూన్‌లో ప్రారంభమవుతాయని చెప్పారు.

అనంతరం విద్యావంతుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులు నిండి సస్యశ్యామలంగా ఉంటే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.   అలాగే సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ మన వనరులు, మన నీళ్లు కోసం 1994లోనే గద్దర్‌తో కలిసి ఉద్యమం ప్రారంభించినట్లు  చెప్పారు. పాదయాత్రలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, పొన్నాల రఘుపతిరావు, డీఎస్పీ వేంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, ఎంపీడీఓ కరుణాశీల, సర్పంచులు శివ్వమ్మ, మంజుల, విఠల్‌యాదవ్, ఎంపీటీసీ లక్ష్మినర్సింలుగౌడ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement