కామాంధులను శిక్షించాలి | Gang rape young boys to punishment | Sakshi
Sakshi News home page

కామాంధులను శిక్షించాలి

Published Mon, Feb 29 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

కామాంధులను  శిక్షించాలి

కామాంధులను శిక్షించాలి

బాధితురాలిని పరామర్శిస్తున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ర్ట చైర్మన్ ఆరెపల్లి మోహన్,
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ

 
కామాంధుల కర్కశానికి బలైన యువతికి సంఘీభావాలు వెల్లువెత్తాయి. గ్యాంగ్‌రేప్ సంఘటనపై టీవీల్లో, పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఆదివారం వివిధ పార్టీలు, దళిత, ప్రజా, మహిళా సంఘాల నాయకులు వీణవంక మండలం చల్లూరులో యువతిని పరామర్శించారు. మానవమృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతిని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కేసు విచారణలో నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి తామున్నామంటూ భరోసానిచ్చారు.   


కరీంనగర్ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూన శోభారాణి డిమాండ్‌చేశారు. కమాన్‌చౌరస్తాలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు నిందితులకు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్సై, సీఐలను సస్పెండ్ చేయాలన్నారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మి, నగర అధ్యక్షురాలు కిన్నెర మల్లమ్మ, పోతుగంటి శారద, సునీత, సమ్మక్క, గాలమ్మ, స్నేహ, రచన, సరోజన పాల్గొన్నారు. అనంతరం దళిత బాధిత మహిళ స్వగ్రామమైన చల్లూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement