సాక్షి, సిటీబ్యూరో: ‘ఎర్లీ బర్డ్’ పథకంతో జీహెచ్‌ఎంసీ ఖజానా నిండింది. మంగళవారం రాత్రి 10:30 గంటల వరకు అందిన సమాచారం మేరకు ఈసారి రికార్డు స్థాయిలో రూ.535 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. ఇందులోనూ ఎక్కువ మంది ఆన్‌లైన్‌లోనే చెల్లించడం విశేషం. దేశంలోని ఏ ఇతర నగరంలోనూఆన్‌లైన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించిన దాఖలాలు లేవు. జీహెచ్‌ఎంసీకి‘ఎర్లీ బర్డ్’ ద్వారా గతేడాది రూ.437.75 కోట్లు రాగా... ఈసారి దాన్ని అధిగమించి అధిక మొత్తంలో వసూలైంది.
చివరి రోజైన మంగళవారమే దాదాపు రూ.102 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఎర్లీ బర్డ్ ద్వారా ఈసారి రూ.500 కోట్లు సేకరించాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యం నిర్దేశించుకున్న విషయం విదితమే. ఎర్లీ బర్డ్ పథకంలో భాగంగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ ఉన్న విషయం తెలిసిందే. దీనిపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు కమిషనర్ దానకిశోర్ డిప్యూటీ, జోనల్ కమిషనర్లతో నిత్యం టెలీకాన్ఫరెన్స్‌లు, నిరంతర సమీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే అధిక వసూళ్లయ్యాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment