హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడంలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చాలని గతంలో హైకోర్టు తెలంగాణ సర్కార్కు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్యను 200 కు పెంచినట్టు సోమవారం అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపింది. ఎన్నికలపై పూర్తి నివేదికను త్వరలో సమర్విస్తామని తెలపడంతో కేసు విచారణను ఈ నెల 16 కు వాయిదా వేసింది. అదేవిధంగా సెక్రటేరియట్ తరలింపుపై విచారణను కూడా హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా
Published Mon, Apr 13 2015 12:04 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement