ప్రియుడి కోసం మూడు రోజులుగా..
ప్రియుడి కోసం మూడు రోజులుగా..
Published Wed, Jul 5 2017 12:36 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
మహబూబాబాద్ రూరల్: తన కన్నా వయసులో చిన్నవాడివని చెప్పినా ఆ యువకుడు వినలేదు. తొలుత ప్రేమ పేరుతో వేధించి మాయమాటలు చెప్పి చివరకు ఆమెను లోబరుచుకున్నాడు. అనంతరం గర్భవతిని చేసి గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత వదిలించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. సోమవారం ప్రియుడి ఇంటి ముందు పోరాటానికి దిగిన యువతి మూడు రోజులైన అక్కడే పడిగాపులు కాస్తోంది. ఆమె దీక్షకు మహిళ సంఘాలతో పాటు వైఎస్సార్‌సీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు తమ సంఘీభావం తెలిపారు.
వివరాలు.. మహబూబాబాద్ శివారులోని ఆకుల లక్ష్మయ్య కాలనీకి చెందిన బోడ సురేష్(23) స్థానికంగా నివాసముండే యాసారపు స్వాతి(24)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో ఆమె సోమవారం ఇంటి ముందు దీక్ష చేపట్టింది. మూడు రోజులైన ప్రియుడి, అతని కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతోంది.
Advertisement
Advertisement