వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రతి ఉద్యోగికి సంబంధించి న వ్యక్తిగత, వృత్తిగత వివరాలను రాబడు తోంది. ఈ మేరకు పది అంశాలతో కూడిన సమాచారాన్ని ఇవ్వాలని నమూనా పట్టిక ను జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సారి డేటా సేకరించిన ప్రభుత్వం.. తాజా గా మరింత లోతుగా సమాచారాన్ని సేకరి స్తోంది.
వృత్తిగత, వ్యక్తిగత, విద్యార్హతలు, కుటుంబ సభ్యుల సమాచారం, బ్యాంకు రుణాలు, ఖాతాల సంఖ్యల, సెలవుల వివ రాలను కోరింది. ఏయే పద్దుల కింద ఎంత మేర వేతనాలను అందుకుంటు న్నారనే వివరాలను నమూనా పత్రంలో పొందుపరచాలని సూచించింది. ఈ మేరకు పూరించిన డేటాను సంబంధిత విభాగాధిపతి ధ్రువీకరించిన అనంతరం జిల్లా ట్రెజరీ అధికారికి పంపాలంది.