ఈతకెళ్లి ఇద్దరు యువకుల మృతి
Published Sun, Mar 12 2017 2:11 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
భద్రాచలం( కొత్తగూడెం జిల్లా): భద్రాచలంలో హోళీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలానికి చెందిన ఐదుగురు స్నేహితులు హోలీ వేడుకల అనంతరం గోదావరిలో స్నానానికి వెళ్లారు. లోతు అంచనావేయడంలో తప్పిదం జరగడంతో ఐదుగురు యువకులు మునిగిపోయారు.
అక్కడున్న వారు వెంటనే స్పందించి ముగ్గుర్ని కాపాడగలిగారు. మరో ఇద్దరు మునిగి చనిపోయారు. మృతులు మండలకేంద్రంలోని శిల్పినగర్‌కు చెందిన మోరంపూడి రాంప్రసాద్(19), అయ్యప్పనగర్ కాలనీకి చెందిన బోటా రమేశ్(19)లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement