ఏటూరునాగారం : తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది జూలై 14 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా పుష్కరాల నిర్వహణకు 17 శాఖలు సుమారు రూ. 28 కోట్ల ప్రతిపాదనలు రూపొందించాయి. కాగా, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీరం వెంట పుష్కర ఘాట్లను నిర్మించేందుకు ఆయా శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రతీ రోజు లక్షా యాభై వేల మంది భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాలకు అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద 20 మీటర్ల వెడల్పుతో ఘాట్, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు వెచ్చిం చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ముల్లకట్ట గోదావరి తీరంలోని జాతీయ రహదారి వంతెనకు ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఘాట్ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
అలాగే మంగపేట వద్ద 100, మల్లూరు వద్ద మరో 100 మీటర్ల పుష్కరఘాట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాగా, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఇప్పటికే ఉన్న 20 మీటర్లతోపాటు మరో పది మీటర్ల మేర కు విస్తరించనుంది. అయితే ఈ నిర్వహ ణ పూర్తిగా ఎండోమెంట్‌శాఖ ఆధ్వర్యం లో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రూ. 13.56 కోట్లతో ప్రతిపాదనలు..
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ఏర్పాటు చేసేం దుకు నీటిపారుదల శాఖ రూ. 13.56 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో ముల్లకట్ట వద్ద 200 మీటర్ల ఘాట్‌తోపాటు ఇన్‌ఫిల్టరేషన్ బావి, మహిళల డ్రెస్సింగ్ రూముల కోసం రూ.7 కోట్లు, రామన్నగూడెం వద్ద పది మీటర్ల విస్తరణతో పాటు ఒక ఇన్‌ఫిల్టరేషన్ బావి, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.36 లక్షలు, మంగపే ట వద్ద రూ.3.10 కోట్లు, మల్లూరు వద్ద రూ.3.10 కోట్ల వ్యయంతో ఘాట్లు, బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్, డ్రెసింగ్ రూములు, బావులను ఏర్పాటు నిర్మించనుంది.
రూ. 8.93 కోట్లతో పంచాయతీరాజ్‌శాఖ..
రూ. 8.93 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. కోటితో రోడ్లు, భవనాలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. రెవెన్యూశాఖ ద్వారా రూ. 50 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ రూ.కోటి, ట్రాన్స్‌కో రూ. 36.64 లక్షలు, దేవాదాయశాఖ రూ. 1.13 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖ రూ. 19.17 లక్షలు, జిల్లా పంచాయతీ అధికారి ద్వారా రూ. 25 లక్షలు, ఆర్టీసీ రూ. 19.67 లక్షలు, టూరిజం విభాగం రూ. 15 లక్షలు మత్స్యశాఖ రూ. 8.58 లక్ష లు, అగ్నిమాపక శాఖ రూ.6.43 లక్షలు, ఎక్సైజ్‌శాఖ రూ. 2 లక్షలు, సమాచార పౌర సంబంధాలశాఖ రూ.50 లక్షలు, ఐసీడీఎస్ ద్వారా రూ.3 లక్షలతో ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.
రహదారి సిద్ధమయ్యేనా..?
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు ఎక్కువగా జాతీయ రహదారి మీదుగా వస్తుంటారు. అయితే పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రోడ్డు విస్తరణ కు రూ.39 కోట్లు ఇప్పటికే మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఈ పనుల కు టెండర్లు నిర్వహించి జూలై 14 వరకు పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడంతో కనీ సం మరమ్మతులైనా చేయాల్సిన అవస రం ఉంది. లేని పక్షంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది.
ఆలయ నిర్మాణానికి సన్నాహాలు..
ప్రధానంగా గోదావరి పుష్కరాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఆలయాలు ఎంతో అవసరం. జాతీయ రహదారి వం తెన నిర్మాణ ప్రవేశం వద్ద చేపట్టే పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేసే భక్తులకు ఆలయం అందుబాటులో లేదు. శివాలయం, గంగాలమ్మ నిర్మా ణం కోసం ప్రణాళికలను సిద్ధం చేశారు. అలాగే గతంలో ఉన్న రామన్నగూడెం వద్ద గంగాలమ్మ ఆలయ అభివృద్ధికి కోసం ప్రతిపాదనల్లో నిధులు కేటాయిం చకపోవడం బాధాకరం. అలాగే ప్రతిపాదనల్లో ముల్లకట్ట, రామన్నగూడెం గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్ల అభివృద్ధి ఊసెత్తలేదు.
‘పుష్కరాలకు’ పరుగులు
Published Wed, Dec 10 2014 4:20 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement